సలార్ సెట్లో నన్ను అలా అనుమానించాడు.. ప్రభాస్ యాటిట్యూడ్‌పై శ్రీయారెడ్డి (ఇంటర్వ్యూ)
వరల్డ్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని తలపిస్తున్న సలార్ మూవీపై సాధారణ ప్రజలు, క్రిటిక్స్ నుంచి పాజిటివ్ టాక్ వస్తున్నది. ఈ చిత్రాన్ని భారీ తారాగణంతో ప్రశాంత్ నీల్ ఎమోషనల్‌గా యాక్షన్ ఎపిసోడ్‌తో తెరకెక్కించారు. ఈ చిత్రంలో బలమైన పాత్రతో ఆకట్టుకొన్న రాధా రమా పాత్ర క్యారెక్టర్‌లో తనదైన శైలిలో నటించిన శ్రీయా రెడ్డి కూడా మంచి మార్కులే కొట్టేసింది. ఈ సందర్భంగా ఆమె తెలుగు ఫిల్మీబీట్‌తో మాట్లాడుతూ..
Recommended Video

ప్రభాస్ గురించి ఏం చెప్పాలి. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. చాలా స్వీట్ పర్సన్. నేను గెటప్‌లో ఉంటే.. మీ జుట్టు రియలా? కళ్లు రియలా? అంటూ ఆసక్తిగా నా గురించి అడిగే వారు. సెట్లో సరదాగా ఆటపట్టించే వారు. నా పాత్రకు మంచి పేరు రాకపోతే చంపేస్తానని అంటే.. నీ రియల్ క్యారెక్టర్ అదేగా అంటూ ప్రభాస్ సెటైర్లు వేసేవాడు. చాలా కూల్, కామ్‌గా ఉంటాడు. మిగితా వారు ఏం చేస్తున్నారనే విషయాన్ని పట్టించుకోరు. తన పనేదో తాను చూసుకొనే వాడు. అని శ్రీయారెడ్డి చెప్పారు.

సలార్ సినిమాతో ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టించినప్పుడు చాలా లేయర్స్, చాలా పాత్రలు ఉంటాయి. గేమ్ ఆఫ్ థ్రోన్ చూస్తే ముందు ఏమీ అర్ధం కాదు. బాహుబలి, కేజీఎఫ్ సినిమాలు చూస్తే కూడా త్వరగా అర్దం కాదు. ఫస్ట్ పార్ట్‌లో పాత్రల ఎస్టాబ్లిష్, సీన్లలో కథ చెప్పడం వల్ల కథ ఏమిటో తెలియదు. రెండో పార్ట్‌లో సినిమా కథ ఉంటుంది అంటూ శ్రీయారెడ్డి చెప్పారు.

సలార్ మూవీ సెకండ్ పార్ట్‌లో అసలు కథ మొదలవుతుంది. పార్ట్ 1 మూవీ చూసిన వాళ్ళు ఆహా ఓహో అంటున్నారు. ఇక సెకండ్ పార్ట్ చూస్తే ఏమౌతారో నాకు తెలియడం లేదు. సలార్ 2 మాత్రం ఓ రేంజ్‌లో ఉంటుంది. ఆ క్రెడిట్ అంతా ప్రశాంత్ నీల్‌కే దక్కాలి. సీనియర్ ఆర్టిస్టులు కూడా చాలా కష్టపడి నటిస్తున్నారు. గ్రేస్, డిగ్నిటి, స్క్రీన్ ప్రజెన్స్‌తో రాధా రమ క్యారెక్టర్ అందర్ని భయపెట్టిస్తుంది అని శ్రీయా రెడ్డి చెప్పారు.

అలాగే OG మూవీలో కూడా నా క్యారెక్టర్ చాలా బాగుంటుంది. సెట్లో ప్రకాశ్ రాజ్‌తో నేను గొప్పంటే.. నేను గొప్ప అని పోట్లాడుకొన్నాం. సలార్, ఓజీ సినిమాల తర్వాత నేను రిటైర్మెంట్ అవుతాను. మళ్లీ యాంకర్, వీడియో జాకీగా వ్యవహరించను. కావాలంటే ఏదైనా షోను హోస్ట్ చేయాలని అనుకొంటున్నాను. ఓప్రా విన్ ఫ్రే మాదిరిగా నేను కూడా మంచి కంటెంట్‌తో హోస్ట్‌గా వర్క్ చేయాలని ఉంది అని శ్రీయా రెడ్డి చెప్పారు.


Click it and Unblock the Notifications











