నాగార్జునతో చాలా సౌకర్యంగా ఉంటుంది.. 16ఏళ్ల వయసులోనే అలా: సంతోషం మూవీపై శ్రియా
ఏ సినిమా ఇండస్ట్రీలో అయినా ఏడాదికి పదుల సంఖ్యలో హీరోయిన్స్ వస్తుంటారు మాయమవుతుంటారు. కానీ కొందరు మాత్రమే ఏళ్ళ తరబడి అభిమానుల సపోర్ట్ తో భారీ స్థాయిలో ఆఫర్స్ అందుకుంటారు. అలాంటి నటిమణుల్లో శ్రియా ఒకరు. ఈ బ్యూటీ ఎలాంటి సినిమాలు చేసినా కూడా అందులో ఎదో ఒక కొత్త తరహా పాయింట్ ఉంటుంది. ఇక ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ బ్యూటీ తన కెరీర్ కి సంబంధించిన కొన్ని విషయాలను గురించి చెప్పింది.

వివాదాల్లోకి వెళ్లకుండా..
శ్రియా దాదాపు టాలీవుడ్ లో ఉన్న అగ్ర హీరోలందరితో నటించింది. అలాగే కోలీవుడ్ హీరోలతో కూడా స్క్రీన్ షేర్ చేసుకుంది. 2001 నుంచి సౌత్ సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్న శ్రియా ఎక్కువగా వివాధాల్లోకి వెళ్లింది లేదు. కేవలం తనకి నచ్చిన సినిమాలను మాత్రమే చేసుకుంటూ వెళ్లింది. ఇక ఇంటర్వ్యూలో అమ్మడు సంతోషం సినిమాలో వచ్చిన ఆఫర్ గురించి చెప్పింది.

16 ఏళ్ల వయసులోనే..
మొదట ఇష్టం సినిమాలో అనుకోకుండా అవకాశం దక్కించుకున్న శ్రియా అంతకుముందు ఒక డ్యాన్స్ ఆల్బమ్ లో డ్యాన్స్ చేయడం వలన తెలుగు నిర్మాతలను ఎక్కువగా ఆకర్షించిందట. 16 ఏళ్ల వయసులోనే మొదటి అవకాశం దక్కిందని ఆ తరువాత హైదరాబాద్ లోకి వచ్చి టాలీవుడ్ సినిమాలపై ఎక్కువగా దృష్టి పెట్టినట్లు తెలిపింది.

సంతోషం సినిమాలో ఆఫర్ ఎలా వచ్చిందంటే..
శ్రియా మాట్లాడుతూ.. నా మ్యూజిక్ వీడియో తరువాత అనేక రకాల ఆఫర్స్ వచ్చాయి. ఇక టాలీవుడ్ ఆఫర్స్ కోసం హైదరాబాద్ లో ఉన్న నా స్నేహితుల దగ్గరకు వెళ్ళాను. వారి సహాయంతో స్క్రీన్ టెస్ట్ లలో పాల్గొన్నాను. ఆ విధంగా సంతోషం సినిమాలో చాలా తొందరగా అవకాశం వచ్చింది. నాగార్జున సర్ తో అవకాశం రావడం నిజంగా చాలా సంతోషాన్ని ఇచ్చింది.

నాగార్జున గారితో సౌకర్యంగా అంటుంది
సంతోషం సినిమా జ్ఞాపకాలను నేను అంత ఈజీగా మర్చిపోలేను. నాగార్జున గారితో నటించడం చాలా సౌకర్యంగా ఉంటుంది. అందుకే ఆయనతో అనేక సినిమాల్లో నటించడానికి ఇంట్రెస్ట్ చూపించాను. నాగ్ కుటుంబ సభ్యులు కూడా నాతో చాలా సన్నిహితంగా ఉంటారు. అందరూ నాకు పరిచయమే. అమలగారు నిజంగా అమేజింగ్ ఉమెన్.. అని శ్రియా తనదైన శైలిలో వివరణ ఇచ్చింది.
Recommended Video

మొదటిసారి అలాంటి సినిమా..
ఇక ప్రస్తుతం తన భర్తతో ఫ్యామిలీ లైఫ్ ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నట్లు చెప్పిన శ్రియా కొన్ని సినిమాల్లో కూడా నటిస్తున్నట్లు తెలిపింది. శ్రియా RRR సినిమాలో అజయ్ దేవ్ గన్ కు జోడిగా కనిపించనున్న విషయం తెలిసిందే. ఇక మొదటిసారి ఆమె కెరీర్ లో గమనం అనే ఒక లేడి ఓరియెంటెడ్ పాన్ ఇండియన్ సినిమాలో కూడా నటిస్తోంది. వాటితో పాటు తమిళ్ లో మరో రెండు సినిమల్లో అవకాశం దక్కించిన శ్రియా బాలీవుడ్ లో కూడా ఒక ఛాన్స్ అందుకుంది.


Click it and Unblock the Notifications











