RRR సీక్రెట్ లీక్ చేసిన శ్రీయ.. పవన్, ప్రభాస్, ఎన్టీఆర్ సెన్సేషనల్ కామెంట్స్
అందాల తార శ్రీయ సరన్ ప్రస్తుతం విదేశాల్లో భర్తతో కలిసి లాక్‌డౌన్‌లో చిక్కుకుపోయారు. అయితే తాజాగా హలో యాప్‌లో మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్, ప్రభాస్, ఎన్టీఆర్ గురించి తన అభిప్రాయాలను చెప్పారు. అలాగే తాను నటించబోతున్న సినిమాల గురించి వివరించారు. అలాగే RRR చిత్రంలో తన రోల్ ఎలా ఉంటుందనే విషయాన్ని కూడా లీక్ చేశారు. శ్రీయ చెప్పిన విషయాలు ఏమింటంటే..

ప్రభాస్, ఎన్టీఆర్ గురించి
ప్రభాస్ గ్రేట్ యాక్టర్. అతనెప్పుడూ గుడ్ లుకింగ్‌గానే ఉంటాడు. ఆయన కళ్లు నాకు చాలా ఇష్టం. ఆయనతో షూటింగ్ చేసేటప్పుడు ఎప్పుడూ ఆయన కళ్లలోకి చూస్తూ ఉండే దానిని. ఇక ఎన్టీఆర్‌తో కూడా పనిచేయడం చాలా ఫన్‌గా ఉంటుంది. ఆయనలో ఎనర్జీ చెప్పనక్కర్లేదు అని శ్రీయ చెప్పారు. ఎన్టీఆర్ చాలా మారిపోయి.. చూడటానికి భలే తయారయ్యాడు అని శ్రీయ చెప్పారు.

పవన్ కల్యాణ్ ఇంటెన్సివ్
పవన్‌తో పనిచేస్తే సరదాగా ఉంటుంది. సెట్లో చాలా ఉత్సాహంగా కనిపిస్తారు. అంందర్నీ ఉత్సాహ పరుస్తారు. చాలా విషయాలు చెప్తుంటే అలా వినాలనిపిస్తుంటుంది. సెట్స్‌లో కామ్‌గా కనిపిస్తారు. ఎప్పుడూ పుస్తకాలు చదువుతుంటారు. ఆయన మనస్తత్వం, ఆలోచనలు చాలా ఇంటెన్సివ్‌గా ఉంటాయి అని శ్రీయ పేర్కొన్నారు.

అజయ్ దేవగన్‌కు జంటగా
దర్శకుడు రాజమౌళి సార్ రూపొందిస్తున్న RRR చిత్రంలో నటిస్తున్నాను. ఫ్లాష్‌బ్యాక్‌లో స్టోరీలో అజయ్ దేవగన్‌కు జంటగా నటిస్తున్నాను. ఫీల్‌గుడ్ సీన్లు ఉంటాయి. ఇంకా తెలుగులో సృజన దర్శకత్వం వహిస్తున్న లిటిల్ బర్డ్ చిత్రంలో నటిస్తున్నాను. ఇప్పటి వరకు ఎంతో మంది దర్శకులతో పనిచేశాను. కానీ మహిళ దర్శకులతో పనిచేయలేదు. ఆ కోరిక తీరింది అని శ్రీయ చెప్పారు

యువతకు సందేశం
యువతకు సలహాలు ఇస్తూ.. కష్టించి పనిచేయాలి. ఎప్పుడూ పాజిటివ్‌గా ఉండాలి. ఎవరినీ ద్వేషించవద్దు. మత పరమైన విషయాల్లో తల దూర్చుకూడదు. మీ జీవితాలకు లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. వైఫల్యంలో కుంగిపోకూడదు. ప్రతికూల సమయంలో కూడా పాజిటివ్‌గా చూసుకోవాలి. తల్లిదండ్రులను గౌరవించడం నేర్చుకోవాలి అంటూ శ్రీయ అన్నారు.
Recommended Video

కెరీర్ గురించి
నా కెరీర్ విషయానికి వస్తే.. నేను రెండు హిందీ చిత్రాల్లో నటిస్తున్నాను. మరో రెండు తమిళ సినిమాలు చేస్తున్నాను. తమిళంలో అరవింద స్వామి, మరో ఫన్ మూవీలో నటిస్తున్నాను. హిందీలో సర్కార్, తడ్కా చిత్రాలు చేస్తున్నాను. ప్రస్తుతం తాను స్పెయిన్‌లో ఉన్నాను. లాక్‌డౌన్ ముగిసి విమాన సర్వీసులు మొదలు కాగానే ఇండియాకు తిరిగి వచ్చేసి షూటింగులో పాల్గొంటాను అని శ్రీయ తెలిపారు.


Click it and Unblock the Notifications











