RRR సినిమాపై శ్రీయా సరన్ కామెంట్స్.. రాజమౌళి అలా చేయడం వల్లే అంటూ

పాపారావు స్వీయ నిర్మాణంతోపాటు దర్శకత్వం చేపట్టిన మ్యూజిక్ స్కూల్‌లో కీలక పాత్రను శ్రీయా సరన్ పోషించారు. ఇళయ రాజా సంగీతం అందించిన ఈ సినిమా మే 12వ తేదీన రిలీజైన ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. నా బాల్యంలో నా తల్లిదండ్రులు చాలా బాగా చూసుకొన్నారు. నా తల్లిదండ్రులు బాగా చదువుకొన్నారు. నా తల్లి టీచర్ డ్యాన్సర్ కూడా, నా ఫాదర్ సైంటిస్ట్. నాపై నా పేరెంట్స్ ఒత్తిడి చేయలేదు అని తెలిపారు. ఇంకా శ్రీయ మాట్లాడుతూ..

హరిద్వార్ నుంచి ఢిల్లీకి ట్రాన్స్‌ఫర్: బాల్యంలో చదువుతోపాటు మ్యూజిక్, డ్యాన్స్ నేర్చుకోమన్నారు. చదువు ఎంత ముఖ్యమో.. డ్యాన్స్ కూడా ముఖ్యమని చెప్పారు. నా పేరేంట్స్ హరిద్వార్ నుంచి ఢిల్లీకి ట్రాన్స్‌ఫర్ అయ్యాక కూడా సపోర్ట్ చేశారు. ప్రతీ చిన్నారికి తల్లిదండ్రుల సపోర్ట్ అవసరం. బాల్యంలో చదువుతోపాటు ఇతర కళా రూపాలు, స్పోర్ట్స్ ప్రాధాన్యమని భావించారు. నాకు అన్ని రకాల విషయాలు తెలుసుకొనేందుకు తోడ్పాడును అందించారు అని శ్రీయా సరన్ పేర్కొన్నారు.

 Shriya Saran about RRR, SS Rajamouli and Music School movie

సంతోషం రిలీజై 21 ఏళ్లు: సంతోషం సినిమా రిలీజై 21 ఏళ్లు పూర్తయింది. సంతోషం సినిమా నాకు స్పెషల్ మూవీ. నేను నటించిన ప్రతీ సినిమా నాకు స్పెషల్‌గా ఉంటుంది. నేను నటించిన సినిమా హిట్ అయితే.. ఆ సినిమా ఎక్కువ గుర్తుండి పోతుంది. హిట్ కాకపోతే ఆ సినిమా స్పెషల్ కాదని అనుకోవద్దు. ప్రతీ సినిమాను చాలా ఎంజాయ్ చేస్తూ, కష్టపడి నటిస్తుంటాం.

కెరీర్ అనేది సక్సెస్, ఫెయిల్యూర్ కలిసిన వ్యవహారం. నన్ను పక్కింటి అమ్మాయిగా చూశారు. నన్ను డైరెక్టర్లు, కో యాక్లరు చాలా గౌరవంతో చూశాను. ఇలాంటి ప్రేమను పొందడం నిజంగా లక్కీ. నేను గొప్ప వరాన్ని పొందాని అనుకొంటాను అని శ్రీయా సరన్ తెలిపారు.

 Shriya Saran about RRR, SS Rajamouli and Music School movie

డ్రీమ్ రోల్ గురించి: నేను నటించిన ప్రతీ సినిమా విలువైనదిగా భావిస్తుంటాను. భవిష్యత్‌లో నా కూతురు నా సినిమాలు చూస్తే నా విలువ పెంచేలా ఉండాలి. నేను ప్రతీ పాత్ర కోసం చాలా కష్టపడుతుంటాను. నేను డిఫరెంట్ సినిమాల్లో నటించాను. లవ్, రొమాంటిక్ సినిమాలు చేశాను. డ్యాన్సులకు ప్రాధాన్యం ఉండే సినిమాల్లో నటించాను. నేను నటించే ప్రతీ పాత్ర డ్రీమ్ రోల్‌గానే భావిస్తాను అని శ్రీయా సరన్ పేర్కొన్నారు.

 Shriya Saran about RRR, SS Rajamouli and Music School movie

RRR సినిమాలో నా పాత్ర: RRR సినిమాలో నా పాత్ర నాకు మంచి సంతృప్తిని ఇచ్చింది. రాజమౌళి దర్వకత్వంలో నేను నటించింది ఐదు రోజులు మాత్రమే కానీ.. జక్కన్న నా పాత్రను సినిమాలో పెట్టిన విధానంతోనే మంచి పాపులారిటీ లభించింది. మన ఎలాంటి పాత్ర చేశామన్నదే సంతృప్తిని ఇస్తుంది. నిడివి పెద్దదా? చిన్నదా అనేది పెద్దగా ప్రభావం చూపదు అని శ్రీయ సరన్ చెప్పారు.

 Shriya Saran about RRR, SS Rajamouli and Music School movie

మ్యూజిక్ స్కూల్ స్వీట్‌గా, బ్యూటీఫుల్‌గా: మ్యూజిక్ స్కూల్ చిత్రం స్వీట్, బ్యూటీఫుల్ సినిమా. కానీ ఛాలెంజింగ్ సబ్జెక్ట్‌తో రూపొందిన మూవీ. ఈ సినిమాలో చాలా ఎమోషన్స్ ఉన్నాయి. ఇది చిన్న పిల్లల కోసమే కాదు.. పెద్దలు కూడా ఇష్టపడే విధంగా ఉంటుంది. సాంగ్, మ్యూజిక్ డ్రామాగా ఆకట్టుకొంటుంది. ఇళయరాజా లాంటి గొప్ప లెజెండ్స్ సినిమాను మరో రేంజ్‌కు తీసుకెళ్లారు అని శ్రీయ సరన్ అన్నారు.

 Shriya Saran about RRR, SS Rajamouli and Music School movie

పాన్ ఇండియా సినిమాల గురించి: కరోనా తర్వాత చాలా మంది అన్ని భాషల సినిమాలు చూడటానికి అలవాటు పడ్డారు. ఇంట్లో కుటుంబ సభ్యులు తమిళం, మలయాళం, హిందీ, మరాఠీ సినిమాలు చూస్తున్నారు. కంటెంట్ ఉన్న సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు.

సినిమాకు కంటెంట్ మంచి పిల్లర్‌గా మారింది. దర్శకులు మంచి కంటెంట్‌తో వస్తున్నారు. ఓటీటీ సినిమాను ప్రేక్షకులకు మరింత దగ్గర చేసింది. పాన్ ఇండియా సినిమా అని కాదు.. కంటెంట్ ఉన్న ప్రతీ సినిమా పాన్ ఇండియా మూవీనే అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X