అలాంటి అవసరం నాకు లేదు.. దర్శకనిర్మాతలు మోసం చేస్తున్నారు.. శ్రియా సెన్సేషనల్ కామెంట్స్
తెలుగు నాట ఒకప్పుడు టాప్ హీరోయిన్‌గా కొనసాగి.. సీనియర్, జూనియర్ అని తేడా లేకుండా అందరితో జత కట్టింది శ్రియా. ఇష్టం సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన శ్రియా.. టాప్ హీరోలందరి సరసన నటించింది. చిరంజీవి, బాలయ్య, వెంకీ, నాగ్ ఇలా సీనియర్లందర్నీ కవర్ చేసిన శ్రియా ప్రభాస్, ఎన్టీఆర్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ వంటివారతోనూ నటించింది. అయితే పెళ్లి చేసుకున్న అనంతరం సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ఈ సుందరి ఆచితూచి అడుగులేస్తోంది.

భర్తతో కలిసి ఎంజాయ్
గతేడాది పెళ్లి చేసుకున్న శ్రీయ.. భర్త ఆండ్రీ కోస్చీవ్‌తో ప్రతీక్షణం ఎంజాయ్ చేస్తోంది. ఆయనతో కలిసి షికార్లు కొడుతూ బీచ్ ఒడ్డున, పబ్లిక్ ప్రదేశాల్లో పొట్టి పొట్టి దుస్తులు వేసుకొని డాన్సులేస్తూ ఫుల్ ఖుషీ చేస్తోంది. వీటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ఎంతగానో వైరల్ అవుతుంటాయి.

లాక్ డౌన్‌లో మరింత సందడి..
లాక్ డౌన్‌ను ఈ జంట మరింత ఎంజాయ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. భర్తతో వంటింటి పనులు చేయిస్తూ తన భర్త చేస్తోన్న సేవలను సోషల్ మీడియా ద్వారా అందరికీ తెలియజేస్తోంది. ఇక వీరిద్దరు సరదాగా చేసే చేష్టలు నెటిజన్ల మనసును దోచుకుంటున్నాయి. తాజాగా తన తదుపరి ప్రాజెక్ట్‌ల గురించి మాట్లాడుతూ అనేక విషయాలను వెల్లడించింది.

అలాంటి అవసరం లేదు..
మంచి కథ దొరికితేనే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తానని చెప్పుకొచ్చింది. వచ్చిన పాత్రలన్నింటినీ ఒప్పుకోవాల్సిన అవసరం లేదని ఖరాఖండీగా చెప్పేసింది. ఇదే కాకుండా మరో కారణం కూడా ఉందని... దర్శకనిర్మాతలు కొందరు మోసం చేస్తున్నారని ఆరోపించింది. చెప్పే కథ ఒకటి... తీసే కథ మరొకటని మండిపడింది. ఇలాంటి అనుభవాలు ఈ మధ్య కాలంలో మరీ ఎక్కువవుతున్నాయని చెప్పింది.
Recommended Video

చెప్పేది ఒకటి చేసేదొకటి..
ఒకటి రెండు లైన్ల కథ చెప్పి, మోసం చేయాలనుకునే వారికి 'నో' చెబుతున్నానని శ్రియ తెలిపింది. స్పెషల్ సాంగ్స్ చేసేందుకు హీరోయిన్లు భయపడే సమయంలో వాటిని తాను చేశానని చెప్పింది. సినిమాకు ఆ పాట ప్లస్ కావాలని, అప్పుడే ఆ పాట చేస్తానని స్పష్టం చేసింది.


Click it and Unblock the Notifications











