పబ్లిక్ ప్లేస్‌లో భర్తతో శ్రీయ సరసాలు: ఏకంగా పైకి లేపేసి మరీ.. దారుణమైన ఫోజుతో అందాల విందు

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతో కాలం పాటు స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన వారిలో సొట్టబుగ్గల సుందరి శ్రీయ శరణ్ ఒకరు. సాదాసీదాగా ఎంట్రీ ఇచ్చినా.. అద్భుతమైన నటనతో పాటు ఆకట్టుకునే అందంతో చాలా తక్కువ సమయంలోనే ఎవరూ ఊహించని రీతిలో గుర్తింపును సంపాదించుకుంది. అదే సమయంలో వరుసగా ఆఫర్ల మీద ఆఫర్లను అందుకుంటూ హవాను చూపించింది. తద్వారా భారీగా రెమ్యూనరేషన్ కూడా తీసుకుని సత్తా చాటింది. కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉన్న సమయంలోనే ఆండ్రూ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది శ్రీయ. అప్పటి నుంచి సినిమాలను తగ్గించడంతో పాటు అతడితో కలిసి రచ్చ రచ్చ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా భర్తతో కలిసి శ్రీయ పబ్లిక్‌లోనే రెచ్చిపోయింది. దారుణమైన ఫోజుతో అందాల విందు చేసింది. అసలేం జరిగిందో చూద్దాం పదండి!

అలా పరిచయం.. ఇలా పాపులారిటీ

అలా పరిచయం.. ఇలా పాపులారిటీ

ఆకట్టుకునే అందం ఉన్న శ్రీయ శరణ్.. ఆరంభంలో మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది. అందులో తనదైన శైలి గ్లామర్ ట్రీట్‌తో సత్తా చాటుతోన్న సమయంలో పలు రకాల యాడ్స్ చేయడంతో పాటు కొన్ని బ్రాండ్లకు అంబాసీడర్‌గానూ వ్యవహరించింది. ఈ క్రమంలోనే 'ఇష్టం' అనే సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది. ఇది హిట్ కాకున్నా.. నాగార్జున నటించిన 'సంతోషం'తో ఫస్ట్ హిట్‌ను అందుకుంది. ఆ తర్వాత సోలో హీరోయిన్‌గా ఎన్నో చిత్రాల్లో నటించింది. ఇక, అప్పటి నుంచి వరుసగా సినిమాలు చేస్తూ స్టార్‌గా పాపులారిటీని అందుకుంది.

ఎవరికీ సాధ్యం కాని విధంగా రికార్డు

ఎవరికీ సాధ్యం కాని విధంగా రికార్డు

హీరోయిన్‌గా కెరీర్‌ను ఆరంభించిన తొలినాళ్లలోనే సూపర్ డూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకున్న శ్రీయ శరణ్.. లక్కీ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. దీంతో ఆమె డేట్స్ కోసం దర్శక నిర్మాతలు క్యూ కట్టారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనుకున్న ఆమె.. వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుంది. దీంతో ఆమె ఏకంగా ఏడాదికి పది సినిమాలు చేస్తూ హవాను చూపించింది. ఫలితంగా టాలీవుడ్‌లోనే కాకుండా దేశ వ్యాప్తంగా ఆమె పేరొందింది. అంతేకాదు, రెమ్యూనరేషన్ కూడా భారీగా అందుకుని రికార్డులకెక్కింది. ఫలితంగా ఆమె పేరు మారుమ్రోగిపోయింది.

 ఇక్కడే కాదు.. అన్నింట్లోనూ ముందే

ఇక్కడే కాదు.. అన్నింట్లోనూ ముందే

ఏమాత్రం అంచనాలు లేకుండానే హీరోయిన్‌గా అడుగు పెట్టిన శ్రీయ శరణ్.. టాలీవుడ్‌లో ఎంతో కాలం పాటు స్టార్‌డమ్‌ను అనుభవిస్తూ ప్రయాణాన్ని కొనసాగించింది. ఈ క్రమంలోనే సీనియర్లు, జూనియర్లు అనే తేడా లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ వెళ్లింది. అదే సమయంలో తెలుగు సినీ ఇండస్ట్రీలోని దాదాపు అందరు హీరోలతోనూ ఆడిపాడింది. తద్వారా ఎన్నో రికార్డులు, అవార్డులను సొంతం చేసుకుంది. ఆ తర్వాత దక్షిణాదిలోని మిగిలిన భాషల్లోనూ అడుగు పెట్టిందామె. ఈ క్రమంలోనే బాలీవుడ్‌లోనూ పలు చిత్రాలు చేసి తన సత్తాను దేశ వ్యాప్తం చేసుకుంది.

 అతడితో ప్రేమ.. గ్రాండ్‌గా వివాహం

అతడితో ప్రేమ.. గ్రాండ్‌గా వివాహం

కెరీర్ ఆరంభం నుంచి వరుస ఆఫర్లతో దూసుకుపోయిన శ్రీయ శరణ్.. ఈ మధ్య కాలంలో స్పీడు తగ్గించేసింది. అయితే, వరుసగా సినిమాలు చేయకున్నా.. నిన్న మొన్నటి వరకూ బిజీగానే గడిపింది. ఈ క్రమంలోనే ఆండ్రీ అనే వ్యాపారవేత్తతో ఆమె ప్రేమాయణం సాగించింది. ఇలా చాలా కాలం పాటు అతడితో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన తర్వాత.. 2018లో వివాహం చేసుకుంది. ఇక, తన భర్తతో తరచూ టూర్లు వెళ్తూ రచ్చ రచ్చ చేస్తోంది. అదే సమయంలో అతడితో రొమాన్స్ చేస్తున్న ఫొటోలు, వీడియోలను సైతం వదులుతోంది. ఫలితంగా అమ్మడు హాట్ టాపిక్ అవుతోంది.

 మకాం మార్చేసిన శ్రీయ.. వెతుకుతూ

మకాం మార్చేసిన శ్రీయ.. వెతుకుతూ

ప్రస్తుతం శ్రీయ శరణ్ చేతిలో పెద్దగా సినిమాలు లేవు. కానీ, ఆమె దేశంలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా వస్తోన్న RRR మూవీలో కీలకమైన పాత్రను పోషించింది. అలాగే, 'గమనం' అనే మరో సినిమాలోనూ నటించింది. వీటితో పాటు మరికొన్ని చిత్రాలను చేసింది. ఇవన్నీ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇదిలా ఉండగా.. శ్రీయ శరణ్ ప్రస్తుతం ముంబైకి మకాం మార్చేసింది. ఇటీవలే భర్త, స్నేహితులతో కలిసి ఆ మహానగరంలో రెండు మూడు రోజుల పాటు ఇల్లు వెతుక్కుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలిపింది. దీంతో ఈ విషయం బయటకు వచ్చింది.

అందులో మాత్రం ఎప్పుడూ బిజీగానే

అందులో మాత్రం ఎప్పుడూ బిజీగానే

శ్రీయ శరణ్ కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నా.. ప్రస్తుతం పెద్దగా సినిమాలు చేయకుండా ఖాళీగా ఉన్నా.. సోషల్ మీడియాలో మాత్రం ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తనకు తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అలాగే పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన విశేషాలను కూడా షేర్ చేసుకుంటోంది. అదే సమయంలో తన అందచందాలను చూపిస్తూ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ ఫాలోవర్లను భారీగా పెంచుకుంటోంది. ఫలితంగా ఇంటర్నెట్‌లో సెన్సేషన్ అవుతోంది. దీంతో ఆమె తరచూ వార్తల్లో ఉంటోంది.

Recommended Video

'Aranya' Movie Motion Poster Released
పబ్లిక్ ప్లేస్‌లోనే భర్తతో శ్రీయ రొమాన్స్

పబ్లిక్ ప్లేస్‌లోనే భర్తతో శ్రీయ రొమాన్స్

చాలా ఏళ్లుగా శ్రీయ శరణ్ తన భర్త అండ్రీతో కలిసి తెగ ఎంజాయ్ చేస్తోంది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను సైతం సోషల్ మీడియాలో వదులుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఆమె తన భర్తతో సన్నిహితంగా ఉన్న ఓ పిక్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఇందులో శ్రీయ శరణ్‌ను ఆండ్రీ పైకి లేపి మరీ ఎత్తుకుని రొమాన్స్ చేశాడు. పైగా ఈ పిక్‌లో ఆమె ఎద అందాలు చూపరులకు కనువిందు చేస్తున్నాయి. దీంతో ఈ ఫొటోకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోంది. ఫలితంగా ఇది చాలా తక్కువ సమయంలోనే విపరితంగా వైరల్ అయిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X