Don't Miss!
- Sports
సుందర్ రనౌట్ విషయంలో నాదే తప్పు: సూర్యకుమార్ యాదవ్
- News
మాస్ కా బాప్: బాలయ్య-పవన్ కల్యాణ్ పార్ట్ 1 టెలికాస్ట్కు ముహూర్తం ఫిక్స్..!!
- Lifestyle
హాట్ అరోమా ఆయిల్ మేనిక్యూర్ గురించి మీకు తెలుసా? రఫ్ హ్యాండ్స్ ని చేతిని మృదువుగా చేస్తుంది!
- Finance
BharatPe: భారత్ పే వ్యవస్థాపకుడి జీతం ఎంతో తెలుసా..? మిగిలిన వారి జీతాలు ఇలా..
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
భర్తతో శ్రీయ శరణ్ హాట్ సెల్ఫీ: ఏకంగా బ్రాతో అతడి మీద పడుకుని రచ్చ
దశాబ్ద కాలంగా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చారు. కానీ, అందులో చాలా తక్కువ మంది మాత్రమే స్టార్‌డమ్‌ను అందుకుని సత్తా చాటారు. అలాంటి వారిలో సొట్టబుగ్గల సుందరి శ్రీయ శరణ్ ఒకరు. సాదాసీదాగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. అనతి కాలంలోనే అద్భుతమైన టాలెంట్.. అదిరిపోయే అందంతో స్టార్ హీరోయిన్‌గా ఎదిగిపోయింది.
అలా చాలా కాలం పాటు తన హవాను చూపించింది. ఇక, కొన్నేళ్ల క్రితం పెళ్లి చేసుకున్న శ్రీయ.. అప్పటి నుంచి పెద్దగా సినిమాలు చేయకున్నా సోషల్ మీడియా ద్వారా సందడి చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా తన భర్తతో దిగిన హాట్ రొమాంటిక్ సెల్ఫీని షేర్ చేసింది. దానిపై మీరూ ఓ లుక్కేయండి మరి!

అలా వచ్చింది.. ఇలా ఫేమస్
సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి ముందే శ్రీయ శరణ్ మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది. అందులో తన అందచందాలతో మెప్పించిన ఈ భామ.. అందరి దృష్టినీ ఆకర్షించింది. ఆ తర్వాత చాలా బ్రాండ్లకు అంబాసీడర్‌గానూ చేసింది. ఈ క్రమంలోనే 'ఇష్టం' అనే సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. తర్వాత 'సంతోషం'తో ఫస్ట్ హిట్‌ను ఖాతాలో వేసుకుని ఫేమస్ అయింది.
ఆమెతో కలిసున్న ఫొటోతో షణ్ముఖ్ సర్‌ప్రైజ్: పాత రోజులు గుర్తు చేసేలా జంటగా!

టాలీవుడ్‌లో అరుదైన ఘనత
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన తర్వాత సమయంలోనే ఎన్నో విజయాలను అందుకున్న శ్రీయ శరణ్.. లక్కీ హీరోయిన్ అనిపించుకుంది. దీంతో ఆమెకు ఆఫర్లు వెల్లువెత్తాయి. ఫలితంగా ఈ అమ్మడు ఏడాదికి సగటున పది సినిమాల వరకూ చేసింది. అలా చాలా కాలం పాటు హవా చూపించింది. దీంతో అరుదైన ఘనతతో పాటు రెమ్యూనరేషన్‌నూ భారీగా అందుకుంది.

అన్ని చోట్లా సందడి చేసింది
సుదీర్ఘ కాలం పాటు శ్రీయ శరణ్ టాలీవుడ్‌లో స్టార్‌డమ్‌ను అనుభవించుకుంది. ఈ క్రమంలోనే సీనియర్లు, జూనియర్లు అనే తేడా లేకుండా వరుసగా సినిమాలు చేసింది. అదే సమయంలో తెలుగులో దాదాపు అందరు హీరోలతోనూ ఆడిపాడింది. తద్వారా ఎన్నో రికార్డులు, అవార్డులను సొంతం చేసుకుంది. అలాగే, మరికొన్ని భాషల్లోనూ నటించి అక్కడా తెగ సందడి చేసేసింది.
Bigg Boss Non Stop: షో ప్రారంభానికి ముందు బిగ్ షాక్.. చివరి నిమిషంలో తప్పుకున్న కంటెస్టెంట్

ప్రేమ పెళ్లి.. తల్లైన హీరోయిన్
ఇండియాలోనే ఫేమస్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న శ్రీయ శరణ్.. ఆండ్రీ అనే వ్యాపారవేత్తతో ఆమె ప్రేమాయణం సాగించింది. ఇలా చాలా కాలం పాటు అతడితో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన తర్వాత.. 2018లో వివాహం చేసుకుంది. ఇక, తన భర్తతో తరచూ టూర్లు వెళ్తూ రచ్చ రచ్చ చేస్తోంది. ఇక, తాను ఓ బిడ్డకు తల్లినయ్యానని ఇటీవలే ప్రకటించి అందరినీ ఆశ్చర్య పరిచేసింది.

అందులో మాత్రం ఫుల్ బిజీ
అప్పట్లో వరుస సినిమాలతో బిజీగా ఉన్నా.. ప్రస్తుతం పెద్దగా సినిమాలు చేయకుండా ఖాళీగా ఉన్నా.. శ్రీయ శరణ్ సోషల్ మీడియాలో మాత్రం ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తనకు తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. తన అందచందాలను చూపిస్తూ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ ఫాలోవర్ల సంఖ్యను పెంచుకుంటోంది.
మితిమీరిన హీరోయిన్ హాట్ షో: లోపలివి కూడా కనిపించేలా.. అసలు ఇది డ్రెస్సెనా!

గ్లామర్ ట్రీట్... రొమాంటిక్‌గా
చాలా కాలంగా సోషల్ మీడియాలో సందడి చేస్తోన్న శ్రీయ శరణ్.. ఎక్కువగా అందాల విందు చేస్తుంటుంది. ఇందులో భాగంగానే తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను తరచూ షేర్ చేస్తోంది. అదే సమయంలో భర్తతో ఎంజాయ్ చేస్తోన్న పిక్‌లను కూడా వదులుతోంది. వీటిలో లిప్ లాక్‌ల ఫొటోలు కూడా ఉంటున్నాయి. మొత్తానికి ఈ అమ్మడు ఇలా ఇంటర్నెట్‌ను తెగ ఊపేస్తోంది.

భర్తతో శ్రీయ శరణ్ హాట్ సెల్ఫీ
తన భర్త అండ్రీతో శ్రీయ శరణ్ తెగ ఎంజాయ్ చేస్తుంటుంది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను సైతం సోషల్ మీడియాలో వదులుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఆమె తన భర్తతో ఏకాంతంగా ఉన్న ఓ పిక్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఇందులో శ్రీయ శరణ్‌ను ఆండ్రీపై వాలిపోయి కనిపించింది. ఇందులో ఆమె బ్రా మాత్రమే ధరించింది. దీంతో ఈ పిక్ వైరల్ అవుతోంది.