మరో బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా మూవీలో శ్రియా మెయిన్ రోల్.. 20ఏళ్ళైనా ఆమె రేంజ్ తగ్గలేదు

వయసు అనేది కేవలం ఒక నెంబర్ మాత్రమే అని కొంతమంది సీనియర్ హీరోయిన్స్ చాలా ఈజీగా అర్థమయ్యేలా చెబుతున్నారు. టాలెంట్ మరియు అందంతో సరికొత్తగా ఆకట్టుకుంటు వయసు అనే పదాన్ని కూడా గుర్తు చేయనివ్వడం లేదు. ఇక శ్రియా శరన్ దాదాపు 20 ఏళ్ళ నుంచి కుర్రాళ్ళను తన అందంతో ఆకట్టుకుంటూనే ఉంది. ఇక ఇప్పుడు ఈ బ్యూటీ పాన్ ఇండియా సినిమాతో సిద్ధమవుతోంది.

వయసుతోనే మాయ చేస్తోంది

వయసుతోనే మాయ చేస్తోంది

నేడు శ్రియా పుట్టినరోజు. సాధారణంగా ఆమె అందాన్ని చూస్తే ఎవరైనా సరే పాతికేళ్ల అమ్మాయి అని ఈజీగా చెప్పేస్తారు. కానీ ఈ రోజుతో ఈ సీనియర్ బ్యూటీ 38వ వసంతంలోకి అడుగుపెట్టింది. వయసుతోనే మాయ చేస్తోంది. ఇక నాలుగు పదుల వయసులోకి వెళ్ళడానికి ఎంతో దూరం లేదు. శ్రియా 2001లో వచ్చిన ఇష్టం సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యింది.

స్టార్ హిరోలందరితో వర్క్ చేసింది..

స్టార్ హిరోలందరితో వర్క్ చేసింది..

2000వ సంవత్సరం నుంచి శ్రియా అవకాశాల కోసం సినిమా ఇండస్ట్రీల వైపు ఫోకస్ పెట్టింది. కానీ పెద్దగా కష్టపడకుండానే ఆమె అందమే అవకాశాలను అందించింది. దాదాపు టాలీవుడ్, కోలీవుడ్ లో ఉన్న స్టార్ హిరోలందరితో ఈ బ్యూటీ స్క్రీన్ షేర్ చేసుకుంది. ఇక లేడి ఓరియెంటెడ్ సినిమాలను కూడా చేస్తోన్న శ్రియా ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా ట్రెండ్ ని ఫాలో అవుతోంది.

శ్రియా పాన్ ఇండియా మూవీ

శ్రియా పాన్ ఇండియా మూవీ

పెళ్లి తరువాత సినిమాలకు కాస్త దూరంగా ఉన్న శ్రియా కేవలం తనకు నచ్చిన సినిమాలకే గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. ఇక ఫైనల్ గా సుజన రావు దర్శకత్వంతో తెరకెక్కుతున్న గమనం అనే సినిమా ద్వారా శ్రియా మరో స్ట్రాంగ్ రీ ఎంట్రీ ఇవ్వబోతోంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషలలో పాన్ ఇండియా ఎంటర్టైనర్ గా ఆ సినిమాను రూపొందిస్తున్నారు.

Recommended Video

RRR Movie Update : SS Rajamouli Serious On Shriya Saran
గమనం ఫస్ట్ లుక్ రిలీజ్

గమనం ఫస్ట్ లుక్ రిలీజ్

శ్రియా పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఈ రోజు విడుదల చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో శ్రియా ఎదో బాధతో ఉన్నట్లు కనిపిస్తోంది. ప్రముఖ రచయిత సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అందిస్తున్న ఈ సినిమాకు మాస్ట్రో ఇలయరాజా సంగీతం సమకూరుస్తున్నారు. ఇక ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో బిజీగా ఉన్న చిత్ర యూనిట్ త్వరలో సినిమా రిలీజ్ పై మరో క్లారిటీ ఇవ్వనుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X