For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మరో 20 తర్వాతే పిల్లల్ని కంటాను.. భర్తతో ఘాటుగా శ్రియా నాటు సరసం..!

|

హాట్ హీరోయిన్ శ్రీయా సరన్ వైవాహిక జీవితాన్ని పరిపూర్ణంగా ఎంజాయ్ చేస్తున్నట్టు కనిపిస్తున్నది. షూటింగ్ బిజీ నుంచి తేరుకొని భర్త అండ్రూ కొశ్చెవ్‌తో కలిసి మెక్సికోలో విహారయాత్రకు వెళ్లింది. సముద్ర తీరంలో భర్తతో కలిసి నాటు భంగిమలతో దిగిన ఫొటోలను తన ఇన్స్‌టాగ్రామ్‌లో షేర్ చేసింది. ప్రస్తుతం ఆ ఫొటోలు మీడియాలో వైరల్‌గా మారాయి.

 హాట్ హాట్‌గా శ్రీయా సరన్

హాట్ హాట్‌గా శ్రీయా సరన్

మెక్సికోలో అండ్రూ, శ్రీయ సరన్ ఫొటోలు మీడియాలో కాక పుట్టిస్తున్నాయి. బీచుల్లో వారు చేసిన హంగామా నెటిజన్లు ఆకట్టుకొంటున్నది. భర్త సంకలోకి ఎక్కి దిగిన ఫొటోపై భారీగా కామెంట్లు చేస్తున్నారు. ఈ ఫొటోకు ఆర్మ్స్ డే అంటూ క్యాప్షన్ పెట్టింది. ఈ విహార యాత్రను శ్రీయ, అండ్రూ ఫుల్లుగా ఎంజాయ్ చేసినట్టు కనిపిస్తున్నది.

పిల్లలు ఇప్పడే వద్దని

పిల్లలు ఇప్పడే వద్దని

ఇటీవల తమిళ మీడియాతో మాట్లాడుతూ.. పిల్లల్ని ఇప్పుడే కనకూడదు అని అనుకొంటున్నాను. లైఫ్‌ను, కెరీర్‌ను బాగా ఎంజాయ్ చేయాలని కోరుకొంటున్నాను. సంతానం కోసం తొందరపడటం లేదు. మరో 20 సినిమాలు చేసిన తర్వాత పిల్లల్ని కనే విషయం గురించి ఆలోచిస్తాను అని శ్రీయ సరన్ చెప్పింది.

 2018లో పెళ్లి చేసుకొని

2018లో పెళ్లి చేసుకొని

2018 మార్చిలో రాజస్థాన్‌లో రష్యాకు చెందిన అండ్రూ కొశ్చెవ్‌ను శ్రీయా సరన్ వివాహం చేసుకొన్నది. అత్యంత ప్రైవేట్ వ్యవహారంగా సాగిన ఈ పెళ్లికి అతికొద్ది మంది కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. ఈ పెళ్లిలో మనోజ్ బాజ్‌పేయి, షబానా అజ్మీలు హంగామా చేస్తూ కనిపించారు.

 హాలీవుడ్ రీమేక్ చిత్రంలో శ్రీయ సరన్

హాలీవుడ్ రీమేక్ చిత్రంలో శ్రీయ సరన్

శ్రీయా సరన్ కెరీర్ విషయానికి వస్తే.. గౌతమి పుత్ర శాతకర్ణి, పైసా వసూల్ తర్వాత పలు తమిళ, తెలుగు చిత్రాల్లో నటించింది. పెళ్లి తర్వాత కూడా మంచి ఆఫర్లను చేజిక్కించికుంటున్నది ఈ భామ. ప్రస్తుతం ది ప్రపోజల్ అనే హాలీవుడ్ సినిమా తమిళ రీమేక్‌లో నటిస్తున్నది. హీరోయిన్ సండ్రా బుల్లక్ పాత్రను శ్రీయ పోషిస్తున్నది. ఈ షూటింగ్ లండన్‌లో జరుగుతుండగా, బ్రేక్ తీసుకొని మెక్సిక్ వెకేషన్‌కు వెళ్లింది.

English summary
Shriya Saran chills with husband Andrei Koscheev in mexico. Their photos are setting the Internet on fire with the hot photos from their Mexican holiday. On the work front, Shriya Saran has signed on to reprise Sandra Bullock's role in the Tamil remake of The Proposal.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more