బేబీ బంప్‌తో శ్రీయా వీడియో వైరల్.. ప్రెగ్నెన్సీ టైంలో కూడా ఇలానా నెటిజన్ల ఫైర్

శ్రియ శరణ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగులో అనేక సినిమాలతో ఆమె ప్రేక్షకులకు దగ్గరైంది. సినిమా అవకాశాలు రావడం లేదు అనుకుందో? లేక చేసిన సినిమాలు చాలు అనుకుందో తెలియదు కానీ అనూహ్యంగా ప్రేమ వివాహం చేసుకుని అందరికీ షాక్ ఇచ్చింది.. కరోనా సమయంలో బిడ్డను కూడా కనేసిన ఆమె ఆ విషయం ఎవరికీ చెప్పకుండా బిడ్డతో కలిసి ఫోటో వదిలి మరోసారి షాక్ ఇచ్చింది. అయితే బేబీ బంప్ తో ఉన్న వీడియో ఒకటి వదిలింది. ఆ వివరాల్లోకి వెళితే

 మ్యూజిక్ వీడియో

మ్యూజిక్ వీడియో

ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ లో పుట్టి పెరిగిన శ్రియ శరణ్ అసలు పేరు శ్రియ శరణ్ భట్నాగర్. చిన్ననాటి నుంచి ఆమె డాన్సర్ గా మంచి పేరు తెచ్చుకుంది. ముందుగా రాజస్థాన్ ఫోక్ డాన్స్, కథక్ నేర్చుకున్న తర్వాత ఆమె ఎన్నో డాన్స్ కాంపిటీషన్స్ లో పాల్గొని మంచి పేరు తెచ్చుకుంది.

రామోజీ ఫిలిమ్స్ నిర్మాణంలో

రామోజీ ఫిలిమ్స్ నిర్మాణంలో

ఒక మ్యూజిక్ వీడియోలో కనిపించిన ఆమె ఆ మ్యూజిక్ వీడియో ద్వారా రామోజీ ఫిలిమ్స్ నిర్మాణంలో తెరకెక్కిన ఇష్టం అనే సినిమాలో హీరోయిన్ గా అవకాశం దక్కించుకుంది. దర్శకుడు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో శ్రియ హీరోయిన్ గా నటించగా చరణ్ ఈ హీరో ఈ సినిమాలో నటించారు. అలా కొన్ని సినిమాల్లో కనిపించింది కానీ శ్రియ శరణ్ కు సంతోషం సినిమా మంచి పేరు తెచ్చి పెట్టింది.

ప్రేమలో పడి

ప్రేమలో పడి

ఆ సినిమాలో నటించింది సెకండ్ హీరోయిన్ రోల్ అయినా సరే ఆమెకు మంచి గుర్తింపు తీసుకువచ్చింది. అలా ఆ తర్వాత చెన్నకేశవరెడ్డి, నువ్వే నువ్వే, ఠాగూర్ లాంటి హిట్ సినిమాల్లో అవకాశాలు అందుకుని టాలీవుడ్ లో చాలా కాలం పాటు స్టార్ హీరోయిన్ గా కొనసాగింది. అవకాశాలు తగ్గినా వెంటనే రష్యన్‌ టెన్నిస్‌ ప్లేయర్‌ ఆండ్రీ కొశ్చీవ్‌తో ప్రేమలో పడి పెళ్లిపీటలెక్కింది.

బేబీబంప్‌తో డ్యాన్స్

ఇక్కడి దాకా బాగానే ఉంది కానీ కరోనా సమయంలో ఆమె బిడ్డను కూడా కనేసింది. గత ఏడాది అక్టోబర్‌ 11న తొమ్మిది నెలల క్రితం తనకు ఆడపిల్ల పుట్టిందని, తన కూతురు పేరు రాధ అని వెల్లడించింది. అయితే శ్రియా 2020 బ్యాక్‌ అంటూ బేబీబంప్‌తో డ్యాన్స్ చేస్తున్న వీడియోను షేర్‌ చేసింది. అయితే ఇది చూసి అంతా షాక్‌ అయ్యారు. ఆమె మళ్ళీ గర్భవతి అయిందా ఏంటి? అని అనుమాన పడినా తర్వాత ఇది పాత వీడియో అని గుర్తించారు.

'మ్యూజిక్ స్కూల్'

'మ్యూజిక్ స్కూల్'

అయితే ఆమె వీడియో షేర్ చేసిన వెంటనే సోషల్ మీడియాలో నెట్టింట వైరల్‌గా మారింది. ఇటీవల RRR సినిమాలో మెరిసిన శ్రియ ఇప్పుడు 'మ్యూజిక్ స్కూల్' అనే సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. ఇళయరాజా సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో పలువురు సింగర్స్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ గోవాలో జరుగుతుంది.

More from Filmibeat

Read more about: shriya saran
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X