భర్త పక్కన ఉండగానే శ్రీయకు షాక్.. గుండె అరచేతిలో పట్టుకొని భయంతో..
దక్షిణాదిలో అగ్రతార శ్రీయా సరన్ ప్రస్తుతం భర్తతో రొమాంటిక్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. లాక్‌డౌన్‌లో ఇటలీలో ఇరుక్కుపోయిన ఈ సుందరి అక్కడే తన భర్తతో దాంపత్య జీవితాన్ని పరిపూర్ణంగా అనుభవించారు. తమ లైఫ్‌కు సంబంధించిన రొమాంటిక్ మూమెంట్స్‌ను తన ఇన్స్‌టాగ్రామ్‌లో వెల్లడించారు. తాజాగా రొమాంటిక్ ట్రిప్ కోసం విదేశాలకు వెళ్లిన శ్రీయ ఓ కొత్త అనుభవాన్ని గురించి వీడియో రూపంలో షేర్ చేసిన దేమిటంటే..

భర్త అండ్రీతో కలిసి పెరూ పర్యటన
శ్రీయా సరన్, తన భర్త అండ్రీ కొశ్చేవ్‌తో కలిసి పెరూ నగరంలో విహరిస్తున్నారు. కుజ్కో రీజియన్‌లోని అత్యంత ప్రజాదరణ పొందిన మాచు పిక్కు అనే జంతు ప్రదర్శన శాలకు వెళ్లారు. ఈ ప్రాంతాన్ని ప్రపంచంలోని ఏడు వింతల్లోనే ఒకటిగా 2007 ఓట్లింగ్ జరిగింది. ఈ సందర్భంగా అక్కడ జరిగిన చిన్న సంఘటనను పంచుకొన్నారు.

అరుదైన జంతు ప్రదర్శనశాలలో
మాచూ పిక్కు ప్రాంతంలోని అరుదైన జంతువుల మధ్య గడుపుతూ భర్తతో ఆ సమయాన్ని మధురంగా మార్చుకొన్నారు. జంతు ప్రదర్శన శాలలో ఉండే దక్షిణాఫ్రికాకు చెందిన లామా అనే జంతువుతో మురిపెం చేయబోయారు. శ్రీయ దాని ముందు ఉండగానే ఒక్కసారిగా జంప్ చేసి పరుగులు పెట్టింది.
భయపడిపోయానంటూ భర్తతో
సౌతాఫ్రికాకు చెందిన ఓ గొర్రె లామా ఉన్నట్టుండి పరుగులు పెట్టడంతో శ్రీయా సరన్ ఒక్కసారిగా భయపడి పోయారు. వెంటనే ఆ షాక్ నుంచి తేరుకొన్ని నేను భయపడి పోయాను అంటూ భర్తకు చెబుతూ వీడియోలో కనిపించింది.

శ్రీయా సరన్ కెరీర్ అలా
శ్రీయా సరన్ విషయానికి కెరీర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో వస్తున్న గమనం చిత్రంలో విభిన్నమైన పాత్రలో కనిపిస్తున్నది. పల్లెటూరి యువతిగా డీ గ్లామర్‌గా కనిపించబోతున్నది. అలాగే RRR చిత్రంలో అజయ్ దేవగన్‌కు జంటగా నడుస్తున్నది.


Click it and Unblock the Notifications











