Shriya Saran: భారీగా డిమాండ్ చేస్తున్న శ్రియ.. ఆ డ్యాన్స్ చేసేందుకు షాకింగ్ రెమ్యునరేషన్!
టాలెంటెడ్ సీనియర్ హీరోయిన్ శ్రియా సరన్ అందమైన నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ ను సంపాదించుకుంది. ఇక ఆమె ప్రధానంగా తమిళం, తెలుగు, హిందీ కన్నడ చిత్రాలలో పని చేసింది. ముఖ్యంగా తెలుగులో అయితే ఒకానొక దశలో ఆమె నెంబర్ వన్ హీరోయిన్ గా చక్రం తిప్పింది. అయితే శ్రియ చాలా.
కాలం తరువాత ఒక అగ్ర హీరోతో ఐటెమ్ సాంగ్ కోసం స్క్రీన్ షేర్ చేసుకోనుంది. ఇక ఆ పాటకు ఆమె ఒప్పుకునేందుకు భారీ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సమాచారం. ఇక ఆమె ఏ హీరోతో చేయడానికి ఏ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకుంది అనే వివరాల్లోకి వెళితే..

చిన్నతనం నుంచే..: శ్రియా ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో 1982 సెప్టెంబర్ 11న జన్మించింది. శ్రియ ఢిల్లీలో పాఠశాల విద్యను అభ్యసించింది. అనంతరం న్యూఢిల్లీలోని లేడీ శ్రీరాం కళాశాల నుండి సాహిత్యంలో పట్టభద్రురాలైంది. ఇక చిన్నతనం నుంచే నటనపై ఆసక్తిని పెంచుకుంది. ఇక మోడల్ గా మారిన తరువాత ఆమె కొన్ని కమర్షియల్ యాడ్స్ లో అలాగే ప్రైవేట్ మ్యూజిక్ ఆల్బమ్స్ లో కూడా కనిపించింది.
తొలిసారిగా తెలుగు సినిమాతోనే..: శ్రియ 2001లో తెలుగు చిత్రం "ఇష్టం"లో తొలిసారిగా నటించింది. ఇక తమిళంలో సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన నటించిన "శివాజీ" (2007) చిత్రం ఆమెకు భారీ స్థాయిలో గుర్తింపును తెచ్చిపెట్టింది. దక్షిణ భారత చిత్ర పరిశ్రమలో అగ్రగామిగా స్థిరపడింది. నువ్వే నువ్వే, ఠాగూర్, అవారపన్, దృశ్యం వంటి అనేక హిట్ చిత్రాలలో కనిపించింది.

స్పెషల్ ఎట్రాక్షన్ గా: తన నటనా నైపుణ్యంతో పాటు, శ్రియ తన అద్భుతమైన లుక్స్ ఫ్యాషన్ సెన్స్‌తో కూడా ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ గా మారుతూ ఉంటుంది. ఆమె అనేక ఫ్యాషన్ మ్యాగజైన్‌లలో స్పెషల్ ఎట్రాక్షన్ గా ఫోటోలకు స్టిల్ ఇచ్చింది. వివిధ ఫ్యాషన్ షోల కోసం ర్యాంప్‌పై నడిచింది. ఆమె శిక్షణ పొందిన కథక్ నృత్యకారిణి. ఇక అనేక సాంస్కృతిక కార్యక్రమాలలో ప్రదర్శన ఇచ్చింది.
పెళ్లి తరువాత కూడా బిజీబిజీగా..: శ్రియ వ్యక్తిగత జీవితం కూడా మీడియా దృష్టిని ఆకర్షించింది. ఆమె 2018లో రష్యాకు చెందిన వ్యాపారవేత్త ఆండ్రీ కొస్చీవ్‌ను ప్రైవేట్ వేడుకలో వివాహం చేసుకుంది. అనంతరం ఆమె ఒక పండండి బిడ్డకు జన్మనిచ్చింది. ఆ తరువాత కూడా సినిమాల్లో బిజీ అవుతోంది. ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా RRR వంటి పెద్ద సినిమాల్లో కూడా చిన్న పాత్రలు చేయడానికి కూడా ఒప్పుకుంటోంది.

మెగాస్టార్ సినిమాలో ఐటెమ్ సాంగ్: అయితే మెగాస్టార్ చిరంజీవితో అప్పట్లో ఠాగూర్ సినిమాలో నటించిన శ్రీయా శరన్ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. అయితే మళ్లీ ఇన్నాళ్లకు ఆమె మెగాస్టార్ చిరంజీవితో మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోబోతోంది. కాకపోతే ఈసారి శ్రియ హీరోయిన్ గా కాకుండా ఒక స్పెషల్ ఐటెం సాంగ్ తో మెప్పించనుంది. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరపైకి రాబోతున్న భోళాశంకర్ సినిమాలో ఆమె స్పెషల్ సాంగ్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
సాంగ్ రెమ్యునరేషన్ ఎంతంటే?: అయితే ఈ సాంగ్ కోసం శ్రీయ భారీ స్థాయిలో పారితోషికం కూడా తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే డీల్ మొత్తం ఫైనల్ అయినట్లుగా కథనాలు వెలువడుతున్నాయి. దాదాపు 75 లక్షలకు పైగానే ఆమెకు నిర్మాతలు ఆఫర్ చేసినట్లు సమాచారం. శ్రియ శరన్ గతంలో కూడా కొన్ని ఐటెం సాంగ్స్ చేసింది. అయితే ఆమె మెగాస్టార్ చిరంజీవి సాంగ్ కోసం అత్యధిక స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. మరి భవిష్యత్తులో అమ్మడు ఇంకా ఎలాంటి సాంగ్స్ చేస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











