తెలుగు నిర్మాత అలా సూసైడ్.. శ్రీయా సరన్ ఫన్నీ కామెంట్.. నెటిజన్లు దారుణంగా ట్రోల్స్!
ఇండియన్ సినిమా పరిశ్రమలో సుదీర్ఘకాలం హీరోయిన్‌గా కొనసాగుతున్న గ్లామర్ క్వీన్ శ్రీయా సరన్. చిరంజీవి, బాలకృష్ణ లాంటి సీనియర్, ఎన్టీఆర్, ప్రభాస్ లాంటి యువ హీరోలతో కూడా కలిసి నటించింది. అయితే ఓ హిందీ సినిమా ప్రమోషన్స్‌లో తెలుగు నిర్మాత సూపైడ్ గురించి తప్పుగా చెప్పడంతో నెటిజన్ల భారీగా ట్రోల్ చేస్తున్నారు. శ్రీయా సరన్ చెప్పిందేమిటి? అసలు జరిగిందేమిటీ అనే వివరాల్లోకి వెళితే..
నేను తెలుగులో జూనియర్ ఎన్టీఆర్‌తో ఓ భారీ బడ్జెట్ సినిమా చేశాను. అందులో జెనిలీయా డిసౌజా కూడా యాక్ట్ చేసింది. భారీగా ఖర్చు పెట్టి సినిమా తీశారు. ఆ నిర్మాత ఫన్నీగా ఉండే వ్యక్తి. చాలా స్వీట్‌గా మాట్లాడేవాడు. అతను పెద్ద సినిమా చేయాలని ఎక్కువగా ఖర్చు చేశాడు. తన వద్ద ఉన్న డబ్బంతా ఖర్చు అయిపోయింది. దాంతో ఆయన టెన్షన్‌లో పడ్డాడు. సినిమా రిలీజ్ చేయడానికి అవస్థలు పడ్డారు అని శ్రీయా తెలిపింది.

సినిమా విడుదలకు ముందు రోజు చెల్లించాల్సిన డబ్బు లేకపోవడంతో ఆయన ఆత్మాహత్యాయత్నం చేశాడు. ఆయన వెళ్లి హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న సరస్సులో దూకాడు అంటూ ఆ సంఘటనను గుర్తు చేసుకొని శ్రీయా సరన్ నవ్వుల్లో మునిగిపోయింది. కానీ సూసైడ్ ప్రయత్నాన్ని ఎవరో అడ్డుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఆయనతోపాటు మరో వ్యక్తి దూకి ప్రాణాలు కాపాడటంతో అందరం ఊపిరి పిల్చుకొన్నామన్నారు.
ఆ నిర్మాతతో వెళ్లిన ఇద్దరు ముగ్గురు సరస్సులో దూకిన సమయంలో తీసిన వీడియోల, ఫోటోలను చూసి మేము షాక్ తిన్నాం. ఎవరో ఒకరు లేకపోతే దారుణంగా ఉండేది. ఆ విషయం తలుచుకొన్నప్పుడల్లా నాకు ఫన్నీగా అనిపిస్తుంది అని శ్రీయా సరన్ అన్నారు. షో టైమ్ అనే వెబ్ సిరీస్ ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
Buddodu entha mandi producers ni MG chesad ra🙄 pic.twitter.com/XlpTXbnAgK
— Deva (@Salaar__Deva) October 28, 2024
అయితే శ్రీయా సరన్ చెప్పినట్టు.. ఆ సినిమాలో ఆమె నటించలేదు. జెనీలియా, ఎన్టీఆర్‌తో ఆమె కలిసి నటించిన చిత్రం నా అల్లుడు. కానీ నిర్మాత చెంగల వెంకట్ రావు సూసైడ్ అటెంప్ట్ చేసిన చిత్రం నరసింహుడు. ఆ సినిమాకు ఫైనాన్స్ చేసిన వారు ఒత్తిడి చేయడంతో హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న హుస్పేన్ సాగర్‌లో దూకి ఆత్మహత్యకు ప్రయత్నించారు. అయితే శ్రీయా సరన్ తాను నటించిన సినిమా నిర్మాత అని చెప్పుకోవడంపై నెటిజన్లు తప్పుబడుతున్నారు.
చెంగల వెంకట్ రావు నిర్మించిన నరసింహుడు చిత్రంలో అమీషా పటేల్, సమీరా రెడ్డి నటించారు. ఈ సినిమాకు బీ గోపాల్ దర్శకత్వం వహించారు. 2005 మే 20 తేదీన రిలీజైంది. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా ప్రభావం చూపలేకపోయింది. ఈ సినిమా నిర్మాతకు భారీ నష్టాలు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత ఆయన సినిమా పరిశ్రమకు దూరమయ్యారు. ఆయన ఎమ్మెల్యేగా కూడా ఎన్నికయ్యారు.


Click it and Unblock the Notifications











