స్పెయిన్‌లో దుర్భర జీవితం.. చెప్పలేని మానసిక క్షోభ.. ప్రస్టేషన్‌లో శ్రీయ
సినీ తారలైనా.. సాధారణ ప్రజలైనా విధి వెంటాడితే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందనే విషయాన్ని బ్యూటీ శ్రీయ సరన్ ఆవేదన రూపంలో వ్యక్తం చేశారు. మ్యారేజ్ యానివర్సరీ కోసం స్పెయిన్‌కు వెళ్లిన ఈ సుందరి అక్కడే చిక్కుకుపోయారు. దారుణమైన పరిస్థితులను వివరిస్తూ మీడియాతో తన అనుభవాలను చెప్పుకొన్నారు. భర్త అండ్రూతో కలిసి బార్సిలోనాలో ఉంటున్న శ్రీయ చెప్పిన విషయాలు ఏమిటంటే..

స్పెయిన్‌లో దారుణమైన పరిస్థితుల్లో
ప్రపంచవ్యాప్తంగా అతిదారుణమైన పరిస్థితులు ఉన్న స్పెయిన్‌లో ప్రస్తుతం ఉన్నాను. సాధారణ ప్రజలు అనుభవిస్తున్న కష్టాలను చూస్తే నా సమస్యలు చాలా చిన్నవి. వేలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. హోటళ్లలో దిక్కుతోచని పరిస్థితుల్లో చిక్కుపడ్డారనే విషయాన్ని వెల్లడించారు.

మానసిక క్షోభతో
కరోనా కారణంగా తమ కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు దూరంగా ఉంటూ మానసిక క్షోభకు గురి అవుతున్నారు. కొంతమంది పైకప్పు, కరెంటు, కనీస సౌకర్యాలు కూడా లేని ఇంట్లో ఉండటం నేను కళ్లారా చూస్తున్నాను. కానీ ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాను అని శ్రీయ ఆవేదన వ్యక్తం చేశారు.

బార్సిలోనాలో చిక్కుబడి
కరోనాకు ముందు.. తర్వాత పరిస్థితుల్లో చాలా వేగంగా మార్పులు చోటుచేసుకొన్నాయి. నా భర్తతో వివాహ వార్షికోత్సవం జరుపుకోవడానికి బార్సిలోనాకు వచ్చాం. అక్కడే చిక్కుకుపోయాం. మళ్లీ నేను ముంబైకి ఎప్పుడొస్తాననే భయం వెంటాడుతున్నది అని శ్రీయ వెల్లడించారు. ముంబైలో ఉన్న నా తల్లిదండ్రులను వీడియో కాలింగ్ ద్వారా చూస్తూ మాట్లాడుతున్నాను. వీడియో కాలింగ్ ద్వారానే నాకు అమ్మ కొన్ని వంటకాలు నేర్పించింది. గరం మసాలు లేకపోవడం దేశీ ఫుడ్ తినలేకపోతున్నాను అని శ్రీయ చెప్పారు.

ప్రస్టేషన్‌తో దారుణంగా
ప్రస్తుతం నేను చాలా ఫ్రస్టేషన్‌లో ఉన్నాను. వాటి నుంచి బయటపడటానికి యోగా, మెడిటేషన్, కుకింగ్, రీడింగ్, సినిమాలు చూడటం లాంటివి చేస్తున్నాను. అలా ఏదో ఒక పనిమీద మనసు లగ్నం చేసి బాధల నుంచి దృష్టిని మరలస్తున్నాను. స్పెయిన్‌లో ప్రతీరోజు 8 గంటలు కాగానే అందరూ తమ బాల్కనీలోకి వెళ్లి తమ కోసం ప్రాణాలు పెట్టి కరోనాపై పోరాటం చేస్తున్న పోలీసులు, వైద్యులకు చప్పట్లతో సంఘీభావం తెలుపుతున్నారు అని శ్రీయ చెప్పుకొచ్చారు.
Recommended Video

చాలా కాలమే పడుతుంది
కరోనావైరస్ మనుషులు జీవితాలను సమూలంగా మార్చేసింది. వారం రోజుల్లోనే జీవితాలు తలకిందులైపోతున్నాయి. ఇంటి నుంచి ఆఫీస్ పనులు చేయడం, మీటింగ్‌లు నిర్వహించడం, ఫోన్, ఈమెయిల్స్‌తోనే ఎక్కువగా పనిచేయడం లాంటివి ఉద్యోగుల జీవితాల్లో చోటుచేసుకొన్నాయి. రోడ్ల మీద మనుషులు కనిపించడమే మానేశారు. సాధారణ పరిస్థితులు మళ్లీ యధాస్థానంలోకి రావాలంటే చాలా రోజులే పడుతాయి. కాకపోతే ఓ మంచి ప్రపంచాన్ని మాత్రం చూడగలమనే విశ్వాసం పెరిగింది అని శ్రీయ అన్నారు.


Click it and Unblock the Notifications











