For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Shriya Saran: శ్రుతి మించిన శ్రీయ సరన్ హాట్ షో.. టాప్ కిందకు జరిపి అందాల ఆరబోత

  |

  తెలుగు ప్రేక్షకులకు శ్రీయ సరన్ గురించి పరిచయం అవసరం లేదు. ఇష్టం అనే చిన్న సినిమాతో తెలుగు చిత్రసీమలో కెరీర్ ప్రారంభించిన శ్రీయ తర్వాత అనేకమంది అగ్రహీరోలతో జోడి కట్టింది. దీంతో అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ఇమేజ్ సంపాందించుకుంది. అప్పటి నుంచి ఇప్పటివరకు తన హవాను కొనసాగిస్తూ వస్తోంది ఈ బ్యూటి. ఇటీవల హిందీలో దృశ్యం 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది శ్రీయ సరన్. సినిమాల సంగతి ఎలా ఉన్న సోషల్ మీడియాలో మాత్రం హాట్ ఫొటోలతో ఆద్యంతం ఎంటర్టైన్ చేస్తూ అభిమానులకు, ప్రేక్షకులకు టచ్ లో ఉంటుంది. తాజాగా మరికొన్ని హాట్ ఫొటోలను వదిలిన శ్రీయ సోషల్ మీడియాలో హైలెట్ అవుతోంది.

  ఇష్టంగా ప్రయాణం..

  ఇష్టంగా ప్రయాణం..

  చిన్న వయసులోనే మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది బ్యూటిఫుల్ శ్రీయ సరన్. ఆ తర్వాత 'ఇష్టం' అనే సినిమాతో హీరోయిన్‌గా తన సినీ ప్రయాణాన్ని మొదలెట్టింది. అనంతరం
  టాలీవుడ్ మన్మథుడు నాగార్జునతో 'సంతోషం' సినిమాలో నటించి కెరీర్‌లో మొదటి విజయాన్ని అందుకుంది. అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూడని ఈ సొట్టల బుగ్గల సుందరి వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకెళ్లింది.

  అగ్ర హీరోలతో జోడి కట్టి..

  అగ్ర హీరోలతో జోడి కట్టి..

  సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ దూసుకెళ్లిన బ్యూటిఫుల్ భామ్ శ్రీయ సరన్ అనేక సూపర్ హిట్లను అందుకుని స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగింది. ఇక సుధీర్ఘం కాలంపాటు టాలీవుడ్‌లో తన అందాలతో మెస్మరైజ్ చేసింది శ్రీయ సరన్. అంతేకాకుండా, టాలీవుడ్‌లో అగ్ర హీరోల సరసన నటించి ఆడిపాడింది. దక్షిణాది భాషల్లోనూ అనేక సినిమాల్లో నటించి క్రేజీ హీరోయిన్ గా రికార్డుకెక్కింది.

  బిజీగా ఉన్న సమయంలోనే..

  బిజీగా ఉన్న సమయంలోనే..


  దక్షిణాది చిత్రాల్లోనే కాకుండా బాలీవుడ్‌లోనూ పలు మూవీలు చేసి నేషనల్ రేంజ్‌కు ఎదిగింది శ్రీయ సరన్. కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉన్న సమయంలోనే శ్రీయ సరన్.. ఆండ్రీ కోషివ్ అనే బిజినెస్ మ్యాన్ తో డేటింగ్ చేసింది. అతనితో చాలా కాలం పాటు డేటింగ్ తర్వాత 2018లో పెద్దల సమక్షంలో ఆండ్రీ కోషివ్ ను పెళ్లి చేసుకుంది. మూడేళ్ల తర్వాత శ్రీయ బేబీ గర్ల్ కు జన్మనిచ్చినట్లు ప్రకటించి అభిమానులకు శుభవార్త తెలిపింది.

  కొంచెం గ్యాప్ తీసుకున్న బ్యూటి..

  కొంచెం గ్యాప్ తీసుకున్న బ్యూటి..

  శ్రీయ సరన్ తనకు కుమార్తె పుట్టిన్పపటి నుంచి సినిమాలకు కొంచెం గ్యాప్ ఇచ్చిందనే చెప్పాలి. సినిమాల్లో ఎక్కువగా కనిపించని ఈ భామ ఆమె భర్త, కూతూరు రాధాతో కలిసి అనేక ఫొటోలు, వీడియోల్లో దర్శనమిచ్చింది. అలా తన పర్సనల్ విషయాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు పెడుతూ అభిమానులకు టచ్ లో ఉంది. అలాగే తన కూతురు రాధాతో ఆడిపాడే వీడియోలతోపాటు హాట్ గా ఫొటోలు పెట్టి హీట్ పెంచింది ఈ సొట్టబుగ్గల సుందరి. ఆమె పెట్టే ఘాటు ఫొటోలకు యూత్ ఫిదా అవుతోంది.

  అజయ్ దేవగణ్ తో..

  అజయ్ దేవగణ్ తో..

  ఇటీవల RRR, గమనం చిత్రాల్లో నటించింది శ్రీయ సరన్. అయితే అవి అంతగా ఫేమ్ తీసుకురాలేకపోయాయి. అయితే తాజాగా సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ దృశ్యంకు సీక్వెల్ దృశ్యం 2ను హిందీలో తీసుకొచ్చారు. మొదటి సినిమాలానే ఇందులో కూడా శ్రీయ సరన్ కీలక పాత్ర పోషించింది. ఈ సినిమాలో శ్రీయ సరన్ కు జోడిగా బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ నటించారు. ఈ సినిమా నవంబర్ 18న విడుదలై మంచి టాక్ తెచ్చుకుంటోంది.

   టాప్ కిందకు జరిపి..

  టాప్ కిందకు జరిపి..

  అప్పుడప్పుడు సినిమాల్లో కనువిందు చేసే గ్లామరస్ బ్యూటి శ్రీయ సరన్ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తెగ హైలెట్ అవుతోంది. ఎప్పటిలానే తాజాగా మరికొన్ని హాట్ ఫొటోలను వదిలింది ఈ ముద్దుగుమ్మ. ఈ ఫొటోల్లో బ్లూ కలర్ డ్రెస్ వేసుకున్న శ్రీయ సరన్ తన టాప్ కిందకు జరిపి ఎద అందాలను ఆరబోసింది. బ్లాక్ డాట్స్ తో ఉన్న బ్లూ కలర్ ఫ్రాక్ లో శ్రీయ సరన్ అందాలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.

  సినిమా ప్రమోషన్స్ కోసం..

  సినిమా ప్రమోషన్స్ కోసం..

  తాజగా శ్రీయ సరన్ పోస్ట్ చేసిన ఈ ఫొటోలకు "దృశ్యం 2 కోసం ఈ డ్రెస్ డిజైన్ చేసినందుకు థ్యాంక్యూ" అని డిజైనర్ పేరును మెన్షన్ చేసింది. అంటే దృశ్యం 2 సినిమా ప్రమోషన్స్ లో భాగంగా శ్రీయ సరన్ ఇలా హాట్ గా సిద్ధమైందని అర్థమవుతోంది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాగే తన బ్యూటితో మెస్మరైజ్ చేస్తున్న శ్రీయ హైలెట్ అవుతూ వస్తోంది.

  English summary
  Tollywood Star Heroine Shriya Saran Latest Photoshoot In Blue Frock For Drishyam 2 Promotions Goes Viral In Social Media.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X