Don't Miss!
- News
"ఆర్ఆర్ఆర్" కు అవార్డుల పంట.. అరుదైన అకాడమీ అవార్డు దక్కించుకున్న రాజమౌళి సినిమా!!
- Finance
Axis Bank: యాక్సిస్ బ్యాంక్ కళ్లు చెదిరే లాభాలు.. కానీ పడిపోయిన స్టాక్ ధర.. ఏం చేయాలి..?
- Lifestyle
స్త్రీ, పురుషులు ఇద్దరూ తమ సంతానోత్పత్తని మెరుగుపరుచుకోవడానికి ఇవి తినాలి!
- Technology
ఫిబ్రవరి లో లాంచ్ కానున్న టాప్ ప్రీమియం ఫోన్లు! టాప్ 10 ఫోన్ల లిస్ట్!
- Sports
INDvsNZ : మూడో వన్డేలో టాప్ స్కోర్ చేసే బ్యాటర్ ఎవరు?.. ఈ ముగ్గురి మధ్య పోటీ!
- Automobiles
మాజీ విశ్వ సుందరి 'సుస్మితా సేన్' మనసు దోచిన లగ్జరీ కారు.. ధర ఎంతో తెలుసా?
- Travel
రాయలసీమలో దాగిన రహస్యాల మూట.. గుత్తి కోట!
చీకటి గదిలో శ్రీయ సరన్ అందాల విందు.. లైట్ అక్కడ మాత్రమే ఫొకస్ అయ్యేలా ప్రదర్శన!
తెలుగు ప్రజలకు పరిచయం అవసరం లేని ముద్దుగుమ్మ పేరు శ్రీయ సరన్. ఒక చిన్న సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసి టాలీవుడ్ టు బాలీవుడ్ వయా కోలీవుడ్ ఇండస్ట్రీల అగ్ర హీరోలతో జత కట్టింది ఈ అందాల భామ శ్రియ సరన్. ఇష్టం అనే చిన్న సినిమాతో తెలుగు చిత్రసీమలోకి అడుగు పెట్టిన శ్రీయ తర్వాత అనేకమంది స్టార్ హీరోల సరసన ఆడిపాడింది.
దీంతో అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ఇమేజ్ సంపాందించుకుంది. అప్పటి నుంచి ఇప్పటివరకు తన హవాను కొనసాగిస్తూ వస్తోంది ఈ బ్యూటి. కొన్ని సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ తో అట్రాక్ట్ చేసిన ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియా హాట్ ఫొటోలతో హల్ చల్ చేస్తుంటుంది. ఇప్పుడు తాజాగా మరికొన్ని హాట్ ఫొటోలను వదిలింది శ్రీయ సరన్.

మోడలింగ్ లో ఆకర్షించి..
యంగ్ ఏజ్ లోనే మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది గ్లామరస్ బ్యూటి శ్రీయ సరన్. మోడలింగ్ రంగంలో పలువురిని ఆకర్షించిన ఈ ముద్దుగుమ్మ 'ఇష్టం' అనే చిన్న సినిమాతో హీరోయిన్‌గా తన సినీ ప్రయాణాన్ని మొదలెట్టింది.
అనంతరం టాలీవుడ్ మన్మథుడు, కింగ్ నాగార్జునతో 'సంతోషం' సినిమాలో యాక్ట్ చేసి కెరీర్‌లో మొదటి విజయాన్ని అందుకుంది. అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూడని ఈ సొట్టల బుగ్గల సుందరి వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకెళ్లింది.

వివిధ ఇండస్ట్రీల్లో..
సినిమాల మీద సినిమాలు, టాలీవుడ్, సౌత్, బాలీవుడ్ అంటూ అన్ని ఇండస్ట్రీలో నటిస్తూ దూసుకెళ్లిన బ్యూటిఫుల్ భామ్ శ్రీయ సరన్ అనేక సూపర్ హిట్లను అందుకుని స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగింది. ఇక సుధీర్ఘం కాలంపాటు టాలీవుడ్‌లో తన అందాలతో మెస్మరైజ్ చేసింది శ్రీయ సరన్. అంతేకాకుండా, వివిధ ఇండస్ట్రీలకు చెందిన స్టార్ హీరోల సరసన నటించి ఆడిపాడింది. దక్షిణాది భాషల్లోనూ అనేక సినిమాల్లో నటించి క్రేజీ హీరోయిన్ గా రికార్డుకెక్కింది.

పెద్దలను ఒప్పించి మరి..
దక్షిణాది చిత్రాల్లోనే కాకుండా బాలీవుడ్‌లోనూ పలు మూవీలు చేసి నేషనల్ రేంజ్‌కు ఎదిగింది శ్రీయ సరన్. కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉన్న సమయంలోనే శ్రీయ సరన్.. ఆండ్రీ కోషివ్ అనే బిజినెస్ మ్యాన్ తో డేటింగ్ చేసింది. అతనితో చాలా కాలం పాటు డేటింగ్ తర్వాత 2018లో పెద్దలను ఒప్పించి మరి వాళ్ల సమక్షంలో ఆండ్రీ కోషివ్ ను పెళ్లి చేసుకుంది. మూడేళ్ల తర్వాత శ్రీయ బేబీ గర్ల్ కు జన్మనిచ్చినట్లు ప్రకటించి అభిమానులకు శుభవార్త తెలిపింది.

కుమార్తె పుట్టడంతో..
శ్రీయ సరన్ తనకు కుమార్తెకు రాధ అని పేరు పెట్టింది. ఇక రాధ పుట్టిన్పపటి నుంచి శ్రీయ సరన్ సినిమాలకు కొంచెం గ్యాప్ ఇచ్చిందనే చెప్పాలి. సినిమాల్లో ఎక్కువగా కనిపించని ఈ భామ ఆమె భర్త, కూతూరు రాధాతో కలిసి అనేక ఫొటోలు, వీడియోల్లో దర్శనమిచ్చింది. అలా తన పర్సనల్ విషయాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు పెడుతూ అభిమానులకు టచ్ లో ఉంది. అలాగే తన కూతురు రాధాతో ఆడిపాడే వీడియోలతోపాటు హాట్ గా ఫొటోలు పెట్టి హీట్ పెంచింది ఈ సొట్టబుగ్గల సుందరి. ఆమె పెట్టే ఘాటు ఫొటోలకు యూత్ ఫిదా అవుతోంది.

క్రైమ్ థ్రిల్లర్ సీక్వెల్ లో..
ఇటీవలే RRR, గమనం చిత్రాల్లో నటించింది శ్రీయ సరన్. ఆ సినిమాలు సూపర్ హిట్ అయిన శ్రీయ సరన్ కు మాత్రం అంత క్రేజ్ తీసుకురాలేకపోయాయి. అయితే శ్రీయ సరన్ సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ దృశ్యంకు సీక్వెల్ గా వచ్చిన దృశ్యం 2ను హిందీ రీమెక్ లో నటించింది. మొదటి సినిమాలానే ఇందులో కూడా శ్రీయ సరన్ కీలక పాత్ర పోషించింది. ఈ సినిమాలో శ్రీయ సరన్ కు జోడిగా బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ నటించారు. ఈ సినిమా నవంబర్ 18న విడుదలై మంచి టాక్ తెచ్చుకుంటోంది. ఇప్పటికీ వసూళ్లు కొల్లగొడుతోంది.

రెడ్ కలర్ లైట్ లో..
అప్పుడప్పుడు సినిమాల్లో కనువిందు చేసే గ్లామరస్ బ్యూటి శ్రీయ సరన్ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తెగ హైలెట్ అవుతోంది. ఎప్పటిలానే తాజాగా మరికొన్ని హాట్ ఫొటోలను వదిలింది ఈ ముద్దుగుమ్మ. ఈ ఫొటోల్లో మెరూన్ అండ్ బ్లాక్ కాంబినేషన్ లోని డ్రెస్ వేసుకున్న శ్రీయ సరన్ అందాలను ఆరబోసింది. రెడ్ కలర్ లైట్ లో దర్శనమిచ్చిన ఈ భామ తన ఎద అందాలను ప్రదర్శించింది.

డార్క్ రూమ్ లో అందాలు..
తాజాగా శ్రీయ సరన్ పోస్ట్ చేసిన ఈ ఫొటోలకు "ఇలాంటి ఫొటోలు తీసినందుకు థ్యాంక్యూ ఫారెస్ట్ లైట్. నాకు అవి చాలా బాగా నచ్చాయి" అని డిజైనర్ పేరును ఫొటోగ్రాఫర్స్ పేరు మెన్షన్ చేస్తూ రాసుకొచ్చింది. ఈ ఫొటోల్లో మొత్తం డార్క్ రూమ్ లో ఉన్న శ్రీయ సరన్ ఎద అందాలపైనే లైట్ ఫొకస్ అయ్యేలా చిత్రీకరించారు. ఈ ఫొటోలకు వయ్యారంగా పోజులిచ్చింది శ్రీయ సరన్. ఎద అందాలతో మెస్మరైజ్ చేస్తున్న శ్రీయ సరన్ ఫొటోలు వైరల్ గా మారాయి.