For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Shriya Saran: స్విమ్ సూట్ లో శ్రీయ సరన్ అందాల ఆరబోత.. కూతురితో కలిసి మరి

  |

  'ఇష్టం' అనే సినిమాతో చిన్న హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయమైంది శ్రీయ సరన్. తర్వాత సుధీర్గ కాంలగా తన హవాను చాటుతోంది ఈ సొట్ట బుగ్గల సుందరి. గత రెండు దశాబ్దాలుగా టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్లుగా సందడి చేసిన వాళ్లలో ముందుగా చెప్పుకోవాల్సింది ఈ భామ గురించే. ఎందుకంటే అంతలా ఈ చిన్నది తెలుగులో ప్రభావాన్ని చూపించగలిగింది. అయితే, పెళ్లై ఓ బిడ్డకు తల్లైన తర్వాత మాత్రం శ్రీయ వెండితెరపై పెద్దగా కనిపించడం లేదు. కానీ, సోషల్ మీడియాలో మాత్రం ఈ భామ తెగ హడావిడి ఇంకా తన అందం ఏమాత్రం తరగలేదన్నట్లుగా చేస్తోంది. హాట్ హాట్ ఫొటోలతో రెచ్చగొడుతోంది. తాజాగా బీచ్ లో స్విమ్ సూట్ లో ఓ వీడియో షేర్ చేసింది ఈ బ్యూటీఫుల్ భామ శ్రీయ సరన్.

  టీనేజ్‌లోనే మోడలింగ్..

  టీనేజ్‌లోనే మోడలింగ్..

  టీనేజ్‌లోనే మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీయ సరన్.. 'ఇష్టం' అనే సినిమాతో హీరోయిన్‌గా ప్రయాణం మొదలెట్టింది. ఆ తర్వాత 'సంతోషం'తో కెరీర్‌లో మొదటి విజయాన్ని అందుకుంది. అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూడని ఈ భామ.. వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకెళ్లింది. ఈ క్రమంలోనే ఎన్నో హిట్లను ఖాతాలో వేసుకుని స్టార్ అయింది.

  అగ్ర హీరోలతో సినిమాలు..

  అగ్ర హీరోలతో సినిమాలు..

  టాలీవుడ్‌లో శ్రీయ సరన్ సుదీర్ఘ కాలం పాటు హవాను చూపించింది. ఈ క్రమంలోనే వరుసగా సినిమాల మీద సినిమాలు చేసింది. అంతేకాదు, టాలీవుడ్‌లో అగ్ర హీరోలుగా వెలుగొందుతోన్న అందరితోనూ ఆడిపాడింది. ఇక, దక్షిణాది భాషల్లోనూ శ్రీయ చాలా చిత్రాల్లో హీరోయిన్‌గా నటించింది. అలాగే, బాలీవుడ్‌లోనూ ఈ బ్యూటీ పలు మూవీలు చేసి నేషనల్ రేంజ్‌కు ఎదిగింది.

   వ్యాపారవేత్తతో 2018లో పెళ్లి..

  వ్యాపారవేత్తతో 2018లో పెళ్లి..

  కెరీర్ పరంగా ఫుల్ ఫామ్‌తో కనిపిస్తోన్న సమయంలోనే శ్రీయ సరన్.. ఆండ్రీ కోషివ్ అనే వ్యాపారవేత్తతో డేటింగ్ చేసింది. ఇలా చాలా కాలం పాటు అతడితో లవ్ ట్రాక్ సాగించిన తర్వాత.. అంటే 2018లో అతడిని పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుంది. అలాగే, మూడేళ్ల తర్వాత శ్రీయ ఓ బిడ్డకు తల్లినయ్యానని వెల్లడించింది. దీంతో సినీ లోకమంతా ఒక్కసారిగా అవాక్కయిపోయింది.

  ఇటీవల గమనం మూవీతో పలకరించిన శ్రీయ..

  ఇటీవల గమనం మూవీతో పలకరించిన శ్రీయ..

  చాలా కాలం పాటు వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ సందడి చేసిన శ్రీయ సరన్.. ఈ మధ్య కాలంలో అంతగా ఆఫర్లను అందుకోవట్లేదు. ఇక, కొద్ది రోజుల క్రితమే ఆమె 'గమనం' అనే సినిమాలో నటించింది. అలాగే RRR మూవీలోనూ భాగమైంది. కానీ, ఇవి శ్రీయ కెరీర్‌కు ఊపు తీసుకు రాలేదు. ప్రస్తుతం ఈ భామ భారీ ఆఫర్లు లేక చిన్న చిత్రాల్లోనే నటించాలని అనుకుంటోంది.

  సోషల్ మీడియాలో క్రేజ్..

  సోషల్ మీడియాలో క్రేజ్..

  సుదీర్ఘ కాలం పాటు టాలీవుడ్‌లో తనదైన చిత్రాలతో సందడి చేసిన శ్రీయ సరన్.. ఈ మధ్య కాలంలో సినిమాల్లో పెద్దగా కనిపించడం లేదు. కానీ, సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో ఎప్పుడూ టచ్‌లోనే ఉంటోంది. అంతేకాదు, ఇందులో తనకు తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో అంశాలను ఫాలోవర్లతో షేర్ చేసుకుంటోంది. తద్వారా ఇప్పటికీ క్రేజ్‌ను పెంచుకుంటూనే ఉంది.

  హాట్ హాట్ ఫొటోలతో..

  హాట్ హాట్ ఫొటోలతో..

  సోషల్ మీడియాలో ఎంతో కాలంగా యాక్టివ్‌గా ఉంటోన్న శ్రీయ సరన్.. ఇందులో ఎక్కువగా అందాలను ఆరబోస్తూ కుర్రాళ్లను రెచ్చగొడుతోంది. ఇందులో భాగంగానే తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను తరచూ వదులుతోంది. అలాగే భర్తతో ఎంజాయ్ చేస్తోన్న, రొమాంటిక్ పిక్‌లను కూడా షేర్ చేస్తూనే ఉంటోంది. దీంతో ఈ బ్యూటీ తరచూ వార్తల్లోనే నిలుస్తూ వస్తోంది.

  కూతురితో కలిసి..

  ఈ బోల్డు హీరోయిన్ శ్రీయ సరన్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ వీడియో షేర్ చేసింది. ఇందులో ఆమె బ్లాక్ కలర్ స్విమ్ సూట్ వేసుకుని బీచ్ లో కూతురు రాధాతో కలిసి సందడి చేసింది. ఆ తల్లికూతుళ్లు ఇద్దరు ఆడుకున్నారు. వారితో శ్రీయ భర్త ఆండ్రీ కోషివ్ కూడా జత కలిశాడు. ఈ వీడియోలో శ్రీయ ఎద అందాలు ఘాటుగా కనిపిస్తున్నాయి. సౌత్ గోవా బీచ్ లో శ్రీయ సందడి వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

  English summary
  Tollywood Star Heroine Shriya Saran Latest Video With Her Daughter In Black Swimsuit At South Goa Beach Goes Viral In Social Media.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X