Shriya Saran: స్విమ్మింగ్ పూల్‌లో భర్తతో శ్రీయ రొమాన్స్.. నైట్ టైమ్‌లో రెచ్చిపోయి మరీ దారుణంగా!

ఆకట్టుకునే అందం.. అద్భుతమైన నటన.. అప్పుడప్పుడూ గ్లామర్ ట్రీట్‌తో తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలా కాలంగా స్టార్ హీరోగా వెలుగొందింది సొట్టబుగ్గల సుందరి శ్రీయ శరణ్. చిన్న సినిమా ద్వారా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. చాలా తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్‌ను అందుకుంది అప్పటి నుంచి వెనుదిరిగి చూడకుండా వరుస ఆఫర్లను అందుకుంటూ దూసుకెళ్లింది.

తెలుగులోనే కాదు.. వేరే భాషల్లోనూ ఈ అమ్మడు సత్తా చాటింది. ఇక, కొన్నేళ్ల క్రితమే ఈ బ్యూటీ వివాహం చేసుకుంది. అప్పటి నుంచి సినిమాల్లో పెద్దగా కనిపించడం లేదు. కానీ, సోషల్ మీడియాలో మాత్రం తెగ హడావిడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా తన భర్తతో రొమాన్స్ చేస్తోన్న ఓ ఫొటోను షేర్ చేసింది. దానిపై మీరూ లుక్కేయండి!

అలా పరిచయం.. యమ పాపులర్

అలా పరిచయం.. యమ పాపులర్

శ్రీయ శరణ్.. ఆరంభంలో మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది. అందులో తనదైన శైలి గ్లామర్ ట్రీట్‌తో సత్తా చాటుతోన్న సమయంలో పలు రకాల యాడ్స్ చేయడంతో పాటు కొన్ని బ్రాండ్లకు అంబాసీడర్‌గానూ చేసింది. ఈ క్రమంలోనే 'ఇష్టం' అనే సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది. తర్వాత 'సంతోషం'తో ఫస్ట్ హిట్‌ను అందుకుంది. అప్పటి నుంచి పాపులర్ అయింది.

టాలీవుడ్‌లో ఆమె మాత్రమే ఇలా

టాలీవుడ్‌లో ఆమె మాత్రమే ఇలా

హీరోయిన్‌గా కెరీర్‌ను ఆరంభించిన తొలినాళ్లలోనే సూపర్ డూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకున్న శ్రీయ శరణ్.. లక్కీ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. దీంతో ఆమె ఏకంగా ఏడాదికి పది సినిమాలు చేస్తూ హవాను చూపించింది. ఫలితంగా టాలీవుడ్‌లోనే కాకుండా దేశ వ్యాప్తంగా ఆమె పేరొందింది. అంతేకాదు, రెమ్యూనరేషన్ కూడా భారీగా అందుకుని రికార్డులకెక్కింది.

ఇక్కడా అక్కడా.. అందరితో రచ్చ

ఇక్కడా అక్కడా.. అందరితో రచ్చ

శ్రీయ శరణ్ టాలీవుడ్‌లో ఎంతో కాలం పాటు స్టార్‌డమ్‌ను అనుభవిస్తూ ప్రయాణాన్ని కొనసాగించింది. ఈ క్రమంలోనే సీనియర్లు, జూనియర్లు అనే తేడా లేకుండా వరుసగా సినిమాలు చేసింది. అదే సమయంలో తెలుగులో దాదాపు అందరు హీరోలతోనూ ఆడిపాడింది. తద్వారా ఎన్నో రికార్డులు, అవార్డులను సొంతం చేసుకుంది. ఆ తర్వాత మిగిలిన భాషల్లోనూ అడుగు పెట్టిందామె.

లవ్ మ్యారేజ్.. బిడ్డకు తల్లైందిగా

లవ్ మ్యారేజ్.. బిడ్డకు తల్లైందిగా


కెరీర్ ఆరంభం నుంచి వరుస ఆఫర్లతో దూసుకుపోయిన శ్రీయ శరణ్.. ఆండ్రీ అనే వ్యాపారవేత్తతో ఆమె ప్రేమాయణం సాగించింది. ఇలా చాలా కాలం పాటు అతడితో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన తర్వాత.. 2018లో వివాహం చేసుకుంది. ఇక, తన భర్తతో తరచూ టూర్లు వెళ్తూ రచ్చ రచ్చ చేస్తోంది. ఇక, తాను ఓ బిడ్డకు తల్లినయ్యానని ఇటీవలే ప్రకటించి అందరినీ షాక్‌కు గురి చేసింది.

రెండు మూవీలు.. ఇప్పుడు అక్కడే

రెండు మూవీలు.. ఇప్పుడు అక్కడే

శ్రీయ శరణ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా వస్తోన్న RRR మూవీలో కీలకమైన పాత్రను పోషించింది. అలాగే, 'గమనం' అనే మరో సినిమాలోనూ నటించింది. వీటితో పాటు మరికొన్ని చిత్రాలను చేసింది. ఇవన్నీ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇదిలా ఉండగా.. శ్రీయ శరణ్ ప్రస్తుతం ముంబైకి మకాం మార్చేసింది. ఇటీవలే భర్తతో కలిసి ఆ మహానగరంలో గృహప్రవేశం కూడా చేసింది.

అక్కడ మాత్రం ఎప్పుడూ బిజీగానే

అక్కడ మాత్రం ఎప్పుడూ బిజీగానే

కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నా.. ప్రస్తుతం పెద్దగా సినిమాలు చేయకుండా ఖాళీగా ఉన్నా.. శ్రీయ శరణ్ సోషల్ మీడియాలో మాత్రం ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తనకు తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. తన అందచందాలను చూపిస్తూ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ ఫాలోవర్లను భారీగా పెంచుకుంటోంది.

స్విమ్మింగ్ పూల్‌లో భర్తతో ఘాటుగా

స్విమ్మింగ్ పూల్‌లో భర్తతో ఘాటుగా

శ్రీయ శరణ్ తన భర్త అండ్రీతో కలిసి తెగ ఎంజాయ్ చేస్తోంది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను సైతం సోషల్ మీడియాలో వదులుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఆమె తన భర్తతో స్విమ్మింగ్ పూల్‌లో రొమాన్స్ చేస్తున్న ఓ పిక్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఇందులో శ్రీయ శరణ్‌ను ఆండ్రీ లిప్ కిస్ చేసుకుంటూ కనిపించారు. దీంతో ఇది తెగ వైరల్ అయిపోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X