శ్రీయ లాంటి భార్యలకు భయపడుతున్న హీరోలు.. ఎలాంటి సీక్రెట్స్ చెప్పొందంటూ షాకింగ్ గా!

తెలుగు ప్రేక్షకులకు శ్రీయ సరన్ గురించి పరిచయం అవసరం లేదు. ఇష్టం అనే చిన్న సినిమాతో తెలుగు చిత్రసీమలో కెరీర్ ప్రారంభించిన శ్రీయ తర్వాత అనేకమంది అగ్రహీరోలతో జోడి కట్టింది. దీంతో అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా పాపులారిటీ సంపాందించుకుంది. అప్పటి నుంచి ఇప్పటివరకు తన హవాను కొనసాగిస్తూ వస్తోంది ఈ బ్యూటి.

ఇటీవల హిందీలో దృశ్యం 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శ్రీయ సూపర్ హిట్ కొట్టింది. సినిమాల సంగతి అటు ఉంచితే నిత్యం సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంటుంది ఈ ముద్దుగుమ్మ. నిత్యం హాట్ ఫొటోలు, ఫ్యామిలీతో గడిపిన పిక్స్ పెట్టే శ్రీయ సరన్ లేటెస్ట్ ఒక పోస్ట్ షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట్లో వైరల్ గా మారింది.

మోడలింగ్ రంగంలో..

మోడలింగ్ రంగంలో..

టీనేజ్ లోనే మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది గ్లామరస్ బ్యూటి శ్రీయ సరన్. అనంతరం సినిమాల కోసం పలు యాక్టింగ్ స్కూల్ లో నటన నేర్చుకుంది ఈ భామ. ఆ తర్వాత 'ఇష్టం' అనే సినిమాతో హీరోయిన్‌గా తన సినీ ప్రయాణాన్ని మొదలెట్టింది. అనంతరం టాలీవుడ్ మన్మథుడు నాగార్జునతో 'సంతోషం' సినిమాలో నటించి కెరీర్‌లో మొదటి విజయాన్ని అందుకుంది. ఇక అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూడని ఈ సొట్టల బుగ్గల సుందరి వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకెళ్లింది.

స్టార్ హీరోల సరసన..

స్టార్ హీరోల సరసన..

సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ దూసుకెళ్లిన బ్యూటిఫుల్ భామ్ శ్రీయ సరన్ అనేక సూపర్ హిట్లను అందుకుని స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగింది. ఇక సుధీర్ఘం కాలంపాటు టాలీవుడ్‌లో తన అందాలతో మెస్మరైజ్ చేసింది శ్రీయ సరన్. అంతేకాకుండా, టాలీవుడ్‌లో అగ్ర హీరోల సరసన నటించి ఆడిపాడింది. దక్షిణాది భాషల్లోనూ అనేక సినిమాల్లో నటించి క్రేజీ హీరోయిన్ గా రికార్డుకెక్కింది. ఫలితంగా అనేక మంది అభిమానులను సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ.

కుమార్తెకు రాధగా నామకరణం..

కుమార్తెకు రాధగా నామకరణం..

సౌత్ సినీ ఇండస్ట్రీ చిత్రాల్లోనే కాకుండా హిందీ చిత్ర పరిశ్రమలోనూ పలు మూవీలు చేసి నేషనల్ రేంజ్‌కు ఎదిగింది శ్రీయ సరన్. కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉన్న సమయంలోనే ఆండ్రీ కోషివ్ అనే బిజినెస్ మ్యాన్ తో డేటింగ్ చేసింది ముద్దుగుమ్మ శ్రీయ సరన్. అతనితో చాలా కాలం పాటు డేటింగ్ తర్వాత 2018లో పెద్దల సమక్షంలో ఆండ్రీ కోషివ్ ను పెళ్లి చేసుకుంది. మూడేళ్ల తర్వాత శ్రీయ సరన్ బేబీ గర్ల్ కు జన్మనిచ్చినట్లు ప్రకటించి అభిమానులకు శుభవార్త తెలిపింది. తన కుమార్తెకు రాధగా పేరు పెట్టింది శ్రీయ సరన్.

శ్రీయ ఫొటోలకు ఫిదా..

శ్రీయ ఫొటోలకు ఫిదా..

శ్రీయ సరన్ తనకు కుమార్తె పుట్టిన్పపటి నుంచి సినిమాలకు కొంచెం గ్యాప్ ఇచ్చిందనే చెప్పాలి. సినిమాల్లో ఎక్కువగా కనిపించని ఈ ముద్దుగుమ్మ ఆమె భర్త, కూతూరు రాధాతో కలిసి అనేక ఫొటోలు, వీడియోల్లో దర్శనమిచ్చింది. అలా తన పర్సనల్ విషయాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు పెడుతూ అభిమానులకు టచ్ లో ఉంది. అలాగే తన కూతురు రాధాతో ఆడిపాడే వీడియోలతోపాటు హాట్ గా ఫొటోలు పెట్టి హీట్ పెంచింది ఈ సొట్టబుగ్గల సుందరి. ఆమె పెట్టే ఘాటు ఫొటోలకు యూత్ ఫిదా అవుతోంది.

క్రైమ్ థ్రిల్లర్ చిత్రంలో..

క్రైమ్ థ్రిల్లర్ చిత్రంలో..

ఇటీవల RRR, గమనం చిత్రాల్లో నటించింది శ్రీయ సరన్. అయితే అవి అంతగా ఫేమ్ తీసుకురాలేకపోయాయి. అయితే తాజాగా సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ దృశ్యంకు సీక్వెల్ దృశ్యం 2ను హిందీలో తీసుకొచ్చారు. మొదటి సినిమాలానే ఇందులో కూడా శ్రీయ సరన్ కీలక పాత్ర పోషించింది. ఈ సినిమాలో శ్రీయ సరన్ కు జోడిగా బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ నటించారు. ఈ సినిమా నవంబర్ 18న విడుదలై మంచి టాక్ తెచ్చుకుంటోంది. వందల కోట్లు వసూళు చేస్తూ సత్తా చాటింది.

ఒక మీమ్ షేర్ చేసి..

ఒక మీమ్ షేర్ చేసి..

అప్పుడప్పుడు సినిమాల్లో కనువిందు చేసే గ్లామరస్ బ్యూటి శ్రీయ సరన్ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తెగ హైలెట్ అవుతోంది. నిత్యం హాట్ ఫొటోలు వదిలే శ్రీయ సరన్ తాజాగా ఒక మీమ్ షేర్ చేసింది. అందులో శ్రీయకు ఎలాంటి సీక్రెట్స్ చెప్పొద్దని ఉంది. అయితే శ్రీయ-రజనీ కాంత్ కాంబినేషన్ లో వచ్చిన శివాజీ సినిమా గురించి తెలిసిందే. ఈ సినిమాలో తన భార్యకు శివాజీ తన ల్యాప్ టాప్ కు సంబంధించిన అన్నీ సీక్రెట్స్ చెబుతాడు. దీంతో అతను జైలు పాలవుతాడు.

శ్రీయలాంటి భార్యకు చెప్పొద్దు..

అదే దృశ్యం 2 సినిమాలో భార్య అయిన శ్రీయకు అజయ్ దేవగణ్ ఏ నిజం చెప్పడు. దీంతో అతను సేవ్ అవుతాడు అన్నది ఆ మీమ్ ఉద్దేశం. అందుకే భార్యలకు భర్తలు ఎలాంటి సీక్రెట్స్ చెప్పొద్దు అని, అందులో ముఖ్యంగా శ్రీయ లాంటి భార్యకు చెప్పొద్దని అర్థం వచ్చే ఈ మీమ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ మీమ్ ను షేర్ చేసిన శ్రీయ సరన్ నవ్వుతూ హహహ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X