Shriya Saran Hot pics: నెట్ డ్రెస్‌తో రెచ్చిపోయిన శ్రీయ...లేటు వయసులో ఘాటుగా అందాల ఆరబోత

తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలా కాలం పాటు స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన వారిలో హాట్ బ్యూటీ శ్రీయ శరణ్ ఒకరు. అద్భుతమైన యాక్టింగ్.. చూపు తిప్పుకోకుండా చేయగలిగే అందంతో కుర్రాళ్ల మతి పోగొట్టిన ఈ బ్యూటీ.. వరుస సినిమాలతో హవాను చూపించింది. ఈ క్రమంలోనే టాలీవుడ్‌లో ఉన్న సీనియర్లు, జూనియర్లు అందరితోనూ సినిమాలు చేసి సత్తా చాటింది. ఈ మధ్యనే వివాహం చేసుకున్నా సినిమాలు మాత్రం ఆపలేదు. ఇక, సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ.. తాజాగా నెట్ డ్రెస్‌తో దిగిన హాట్ ఫొటోను షేర్ చేసింది. దానిపై మీరూ లుక్కేయండి!

‘ఇష్టం' అని వచ్చింది.. హిట్లు కొట్టింది

‘ఇష్టం' అని వచ్చింది.. హిట్లు కొట్టింది

2001లో వచ్చిన 'ఇష్టం' అనే సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి హీరోయిన్‌గా పరిచయం అయింది శ్రీయ శరణ్. ఆ వెంటనే నాగార్జున చిత్రం 'సంతోషం'లో నటించింది. అప్పటి నుంచి వరుసగా ఒకదాని తర్వాత ఒకటి ఇలా ఎన్నో చిత్రాలు చేసి.. ఆరంభంలోనే పలు హిట్లను తన ఖాతాలో వేసుకుంది. తద్వారా చాలా తక్కువ సమయంలోనే టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగిపోయింది.

ఒకే ఏడాది పది సినిమాలతో రికార్డు

ఒకే ఏడాది పది సినిమాలతో రికార్డు

టాలీవుడ్‌లో శ్రీయ శరణ్ ఎంతటి ప్రభావాన్ని చూపించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే ఆమె ఏకంగా ఒకే ఏడాది పది చిత్రాల్లో నటించి రికార్డును క్రియేట్ చేసింది. ఇది ఏ ఒక్క సంవత్సరమో జరగలేదు. దాదాపు ఐదారేళ్ల పాటు కనీసం ఏడు సినిమాలు చేసి సత్తా చాటింది. అలా తన హవాను చూపించింది. తద్వారా భారీగా రెమ్యూనరేషన్ అందుకుని ట్రెండ్‌ను సెట్ చేసేసింది.

వాళ్లతో.. వీళ్లతో.. అన్ని భాషల్లోనూ

వాళ్లతో.. వీళ్లతో.. అన్ని భాషల్లోనూ

తెలుగులో శ్రీయ శరణ్ దాదాపు అందరు స్టార్ హీరోలతోనూ జత కట్టింది. ఈ క్రమంలోనే రెండు తరాల హీరోలతోనూ నటించింది. ఇలా జూనియర్లు, సీనియర్లు అనే తేడా లేకుండా ఎన్నో పాత్రలను పోషించింది. ఈ క్రమంలోనే ఉత్తమ నటిగా అవార్డులు సైతం అందుకుంది. ఇక, ఈ అమ్మడు తెలుగుకు మాత్రమే పరిమితం కాలేదు. దక్షిణాది భాషల చిత్రాలతో పాటు హిందీలోనూ నటించింది.

అందాల ఆరబోతతోనూ అదరగొట్టేలా

అందాల ఆరబోతతోనూ అదరగొట్టేలా

స్టార్ హీరోయిన్‌గా ఎంతో కాలం పాటు హల్‌చల్ చేసిన శ్రీయ శరణ్.. పాత్రకు ప్రాధాన్యం ఉన్న సినిమాలనే కాదు.. గ్లామర్ రోల్స్‌ను కూడా చేసింది. మధ్యలో కొన్ని ప్రయోగాత్మక చిత్రాల్లోనూ విభిన్నమైన పాత్రలను పోషించింది. అదే సమయంలో కొన్ని చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ కూడా చేసింది. వీటితో పాటు కొన్ని మ్యూజిక్ ఆల్బమ్స్‌లోనూ డ్యాన్స్ చేసి అదరగొట్టేసిందీ బ్యూటీ.

పెళ్లి చేసుకున్న బ్యూటీ.. రొమాన్స్

పెళ్లి చేసుకున్న బ్యూటీ.. రొమాన్స్

గతంలో మాదిరిగా ఇప్పుడు వరుసగా సినిమాలు చేయకపోయినా.. చేతి నిండా ఆఫర్లతో ఫుల్ బిజీగా గడుపుతోంది శ్రీయ. ఈ క్రమంలోనే 2018లో ఆండ్రూను వివాహం చేసుకుందామె. ఇక, తన భర్తతో తరచూ టూర్లు వెళ్తూ రచ్చ రచ్చ చేస్తోంది. అదే సమయంలో అతడితో రొమాన్స్ చేస్తున్న ఫొటోలు, వీడియోలను సైతం వదులుతోంది. ఫలితంగా అమ్మడు నిత్యం హాట్ టాపిక్ అవుతోంది.

ఎప్పుడూ అందులోనే ఉంటూ రచ్చ

ఎప్పుడూ అందులోనే ఉంటూ రచ్చ

శ్రీయ శరణ్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ.. ఈ అమ్మడు ఎప్పుడూ ఫ్యాన్స్‌కు టచ్‌లోనే ఉంటోంది. ఈ క్రమంలోనే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలను వాళ్లతో షేర్ చేసుకుంటోంది. అదే సమయంలో అప్పుడప్పుడూ గ్లామర్ ట్రీట్ ఇస్తూ కుర్రాళ్ల గుండెళ్లో గాయాలు చేసేస్తుందామె.

Recommended Video

'Aranya' Movie Motion Poster Released
నెట్ డ్రెస్‌తో శ్రీయ అందాల ఆరబోత

నెట్ డ్రెస్‌తో శ్రీయ అందాల ఆరబోత

తాజాగా సీనియర్ హీరోయిన్ శ్రీయ శరణ్.. తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఆమె నెట్ డ్రెస్ వేసుకుని ఉంది. దీంతో ఆమె లో దుస్తులు మొత్తం కనిపిస్తున్నాయి. ఇలా మరోసారి అందాలను ఆరబోసేసింది. ఫలితంగా ఈ ఫొటో వైరల్ అయిపోయింది. లేటు వయసులోనూ ఘాటు ఫోజులతో రెచ్చగొడుతోన్న ఈ బ్యూటీ.. ఇప్పుడిలా హాట్ టాపిక్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X