For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    భర్తతో శ్రీయ బర్త్ డే రొమాన్స్ మాములుగా లేదుగా.. లిప్‌‌లాక్ ఫొటో వైరల్

    |

    రెండు దశాబ్దాల కెరీర్‌ తర్వాత కూడా యంగ్ హీరోయిన్లకు పోటీ ఇచ్చేంతగా అందాల భామ శ్రీయ సరన్ క్రేజీ ప్రాజెక్టులతో ముందుకు వెళ్తున్నారు. ఇటీవలనే 38వ జన్మదినాన్ని భర్త అండ్రూ కొశ్చేవ్‌తో ప్రైవేట్‌గా జరుపుకొన్న ఈ బ్యూటీ తన బర్త్ డే విశేషాలను సోషల్ మీడియా అకౌంట్ ద్వారా వెల్లడించింది. ఈ సారి శ్రీయ బర్త్ డే ఎలా రొమాంటిక్‌గా జరిగిందంటే..

    భర్త అండ్రూతో మధురమైన క్షణాలు

    భర్త అండ్రూతో మధురమైన క్షణాలు

    లాక్‌డౌన్ జీవితం నుంచి ఇంకా పూర్తిగా బయటపడని శ్రీయా సరన్‌కు తన లైఫ్‌ను మరింత రొమాంటిక్‌గా జరుపుకొనేందుకు బర్త్ డే మరో అవకాశం ఇచ్చింది. భర్త అండ్రూతో మరింత క్లాలిటీ సమయాన్ని గడిపేందుకు ఈ బర్త్‌డేను వెచ్చిచ్చింది. భర్తతో గడిపిన క్షణాలకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

    అండ్రూతో రొమాంటిక్‌గా లిప్‌లాక్‌

    అండ్రూతో రొమాంటిక్‌గా లిప్‌లాక్‌

    భర్త అండ్రూతో శ్రీయ సరన్‌ అత్యంత సన్నిహితంగా ఉన్న ఫోటోలు, లిప్‌లాక్ చిత్రాలు ఇప్పుడు నెటిజన్లు విశేషంగా ఆకర్షిస్తున్నాయి. తన పుట్టిన రోజున సంబరాలకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ భర్త అండ్రూకు థ్యాంక్యూ చెప్పింది. ఇంత అందమైన, మరిచిపోలేనటువంటి బర్త్ డేను ఇచ్చిందుకు థ్యాంక్యూ అంటూ కామెంట్ పెట్టింది.

    ప్రకృతి ఒడిలో అలా ఒదిగిపోయి..

    ప్రకృతి ఒడిలో అలా ఒదిగిపోయి..

    ప్రకృతి ఒడిలో, పచ్చిక బయళ్ల మీద ఇద్దరు ఒకరిపై ఒకరు ప్రేమానురాగాలు కురిపించుకొంటూ లైఫ్‌ను ఆస్వాదిస్తున్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. అలాగే మరో లిప్ లాక్‌ ఫోటో వారిద్దరి మధ్య ఉన్న లవ్‌ను, ఒకరంటే మరొకరికి ఎంత ఇష్టమో చెప్పకనే చెప్పింది.

    ప్యాన్ ఇండియా మూవీ గమనంలో

    ప్యాన్ ఇండియా మూవీ గమనంలో

    ఇక నాలుగు పదుల వయసులో కూడా అగ్ర హీరోలు, భారీ బడ్జెట్ చిత్రాల్లో ఆఫర్లను కొట్టేసున్నది. తాజాగా ప్యాన్ ఇండియా చిత్రం గమనంలో ఓ ప్రత్యేకమైన పాత్రను పోషిస్తున్నారు. సుజానా రావు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రూపొందుతున్నది.

    RRR మూవీలో అజయ్ దేవగన్‌కు జోడిగా

    RRR మూవీలో అజయ్ దేవగన్‌కు జోడిగా

    ఇదిలా ఉండగా, బాహుబలి తర్వాత ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న RRR చిత్రంలో కూడా శ్రీయ సరన్ నటిస్తున్నది. అజయ్ దేవగన్‌కు జంటగా ఆమె కనిపించనున్నారు. ఈ చిత్రం ఇప్పటికే రిలీజ్ కావాల్సింది. లాక్‌డౌన్ కారణంగా షూటింగ్ వాయిదా పడడంతో రిలీజ్ కూడా ఆలస్యం అవుతున్నది.

    English summary
    Actress Shriya Saran romantic date with husband Andrei Koscheev on her birthday goes viral in the social media. She turned 38 on September 11, 2020, had gone on a romantic date with her dear hubby.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X