చీకటి గుహలో ఎంజాయ్ చేస్తూ కెమెరాకు చిక్కిన శ్రీయ.. సోషల్ మీడియాలో వైరల్ వీడియో
ఇటీవలే పెళ్లి చేసుకున్న సీనియర్ హీరోయిన్ శ్రీయ శరణ్ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ అయింది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫొటోలు, వీడియోలతో నెటిజన్లకు స్పెషల్ ట్రీట్ ఇస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా హాట్ హాట్ ఫోజులిస్తూ ఆమె చేసిన డాన్స్ వీడియోను స్వయంగా తానే సోషల్ మీడియాలో పెట్టి సంచలనం సృష్టించింది. ఈ వీడియోలో చీకటి గుహలో ఆమె ఇచ్చిన బికినీ లుక్ చూసి షాక్ అవుతున్నారు నెటిజన్లు.

చీకటి గుహలో సెక్సీ లుక్
ఈ వీడియోలో చీకటి గుహలో సింగిల్ పీస్ బికినీతో సెక్సీ లుక్‌లో దర్శనమిచ్చింది శ్రీయ. పెళ్లి చేసుకున్నా ఆమె అందాలు ఏ మాత్రం తరిగిపోలేదు. సెక్సీ లుక్‌తో పాటు హాట్ డాన్స్ పర్‌ఫార్‌మెన్స్‌తో మతిపోగొట్టేసింది శ్రీయ. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆ గుహలో సింగిల్‌గా శ్రీయ
తన ఇన్స్‌స్టాగ్రామ్ ద్వారా ఈ వీడియోలో షేర్ శ్రీయ.. ఇది మరో ప్రపంచం అంటూ ట్యాగ్ చేయడం గుహలో ఆమె పొందిన ఆనందానికి నిదర్శనం. ఇక ఆ గుహలో సింగిల్‌గా కనిపిస్తూ బికినీ టాప్ మాత్రమే వేసుకున్న ఈ భామ.. కేవలం ఒక దగ్గర పడుతున్న సూర్య కిరణాల వద్దకు వచ్చి లయబద్దంగా డాన్స్ చేసి ఎంజాయ్ చేస్తూ కనిపించింది.

ఇలా ఎంజాయ్ చేస్తుండగా ఆమె భర్త
లేటు వయసులో గతేడాదే పెళ్లి చేసుకున్న శ్రీయ శరణ్ ఇటీవలే తన భర్తతో కలిసి మెక్సికో టూర్‌కి వెళ్ళింది. అక్కడి ఓ అందమైన గుహలో ఈమె ఇలా ఎంజాయ్ చేస్తుండగా ఆమె భర్త ఆండ్రీ కొశ్చెవ్ ఈ వీడియోను కెమెరాలో బంధించి ఉంటాడని చెప్పుకుంటున్నారు. శ్రీయ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన కాసేపట్లోనే ఈ వీడియో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు పెద్ద ఎత్తున కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

పెళ్లి తర్వాత కూడా
సినిమాలకు పెళ్ళేమన్నా అడ్డా అన్నట్లుగా పెళ్లి తర్వాత కూడా మంచి జోష్‌లో సినిమాలు చేస్తోంది శ్రీయ. "నరకాసురుడు, సందకారి'' లాంటి తమిళ చిత్రాల్లో నటించిన శ్రీయా శరణ్ మరో హాలీవుడ్ సినిమా స్ఫూర్తిగా రూపొందే చిత్రంలో నటిస్తోంది. హాలీవుడ్‌లో సండ్రా బుల్లక్ నటించిన ప్రపోజల్ సినిమా ఆధారంగా ఈ సినిమా రూపొందనుంది. చిత్రంలో హీరో వేమల్ సరసన శ్రీయ ఆడిపాడనుంది.


Click it and Unblock the Notifications











