‘అది నేను కాదు.. ఆ నంబర్ నాది కాదు..' శ్రియ వార్నింగ్

ఇటీవల సినీ ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. నకిలీ సోషల్ మీడియా అకౌంట్స్, వాట్సాప్ ఖాతాలు సృష్టించే అభిమానులను మోసం చేస్తున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. ఇటీవల బాలీవుడ్ నటి అదితి రావు హైదరి పేరు, ఫోటోను ఉపయోగించి, ఒక వ్యక్తి ఫోటోగ్రాఫర్లను మోసం చేసిన విషయం కలకలం రేపింది. ఇప్పుడు అదే తరహా మోసానికి నటి శ్రీయ శరణ్ కూడా బారిన పడింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించారు.

శ్రియ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్టు షేర్ చేస్తూ.. ఆమె పేరుతో సృష్టించిన ఫేక్ వాట్సాప్ నంబర్, ఫోటోగ్రాఫర్లు, ఆమెకు దగ్గరగా ఉన్నవారికి మెసేజ్‌లు పంపుతున్నట్టు శ్రీయ చెప్పింది. "ఈ నంబర్ ఎవరిదో తెలియదు. దయచేసి ఇలాంటి వాట్సాప్ అకౌంట్లతో చాట్ చేస్తూ మీ విలువైన సమయాన్ని వృథా చేసుకోకండి. ఇదొక స్కామ్. ఇది నేను కాదు, ఈ నంబర్ కూడా నాది కాదు" అని స్పష్టంగా చెప్పారు. ఇంతటితో ఆగకుండా, "ఆ దారుణానికి పాల్పడిన వ్యక్తి నటి హెచ్చరించారు. నేను ఎంతోగానో గౌరవించే వారితో ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని హెచ్చరించింది. అలాగే.. భవిష్యత్తులో ఇలాంటి మెసేజ్‌లు వస్తే.. వాటికి స్పందించండి. అందరూ జాగ్రత్తగా ఉండండి" అంటూ శ్రీయ తన అభిమానులను హెచ్చరించింది.

Shriya Saran Slams Imposter for Misusing Her Identity Issues Strong Warning to Fans

బాలీవుడ్ హీరోయిన్ అదితి రావు హైదరి కూడా తాజాగా స్కామ్ బారిన పడింది. తన పేరు, ఫోటోను ఉపయోగిస్తూ ఫోటోషూట్ పేరుతో పలువురు ఫోటోగ్రాఫర్లను సంప్రదిస్తున్నారని అదితి చెప్పారు. "ఫోటోషూట్స్ కోసం నేను ఎప్పుడూ వ్యక్తిగతంగా వాట్సాప్‌లో ఎవరినీ సంప్రదించను. నా టీమ్ ద్వారానే కమ్యూనికేషన్ ఉంటుంది. ఇలాంటి ఫేక్ మెసేజ్‌లు వస్తే మా టీమ్ కు లేదా అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతా కు వెంటనే తెలియజేయండి" అంటూ తన అభిమానలను అప్రమత్తం చేసింది.

ఇటీవల కాలంలో సెలబ్రిటీల పేర్లు, ఫోటోలను దుర్వినియోగం చేసే ఇటువంటి ఫేక్ అకౌంట్లపై సినిమా పరిశ్రమలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఎక్కువగా ఫోటోగ్రాఫర్లు, మోడల్స్ పేర్లతో ఇలా సైబర్ నేరాలు జరుగుతున్నాయి. ఈ తరహా ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో సెలబ్రిటీలు మాత్రమే కాదు, అభిమానులు కూడా సైబర్ స్కామ్‌లపై అప్రమత్తంగా ఉండాలి.

ఒకప్పుడు స్టార్ శ్రీయ శరణ్ తన సెకండ్ ఇన్నింగ్స్ లో దుమ్మురేపుతోంది. నాలుగు పదుల వయస్సులోనూ అందంలో ఏమాత్రం తగ్గకుండా.. యంగ్ హీరోయిన్స్ తో పోటీ పడుతుంది. సోషల్ మీడియాలో హాట్ ఫోటోలతో ఫ్యాన్స్‌ను అలరించే శ్రియ, ఇటీవల సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చినా, అప్పుడప్పుడు ప్రత్యేక పాత్రల్లో కనిపిస్తున్నారు.

అలా ఈ ఏడాది 'మిరాయ్'తో థియేటర్లలో సందడి చేశారు శ్రియా శరణ్. అందులో ఆమె పాత్రకు మంచి స్పందన వచ్చింది. ప్రస్తుతానికి ఆమె 'నాన్ వయలెన్స్' సినిమాలో 'కంగా' అనే కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇటీవల ఆ సినిమా నుంచి ఒక పాట రిలీజ్ అయి మంచి హైప్ క్రియేట్ చేసింది. మళ్లీ స్పెషల్ సాంగ్‌తో శ్రీయ తెరపై సందడి చేయడానికి సిద్దమతుండటంతో ఆమె అభిమానుల్లో పెద్ద ఉత్సాహం రేకెత్తిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X