7 ఏండ్ల తర్వాత ఐటమ్ సాంగ్ తో స్టార్ హీరోయిన్ రీ ఎంట్రీ..
స్టార్ హీరోయిన్స్ పెళ్లి తర్వాత కాస్త గ్యాప్ ఇచ్చి వరుసగా రీ ఎంట్రీ ఇస్తున్నారు. అలాగే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ దాదాపు ఏడు సంవత్సరాల తర్వాత రీ ఎంట్రీ ఇవ్వబోతుంది. అది కూడా ఓ స్టార్ హీరో సినిమాలో స్పెషల్ సాంగ్ తో అట్రాక్ట్ చేయడానికి తిరిగి రాబోతుంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు? ఆ స్టార్ హీరో ఎవరు? ఓ లూక్కేయండి.
ఆ స్టార్ బ్యూటీ ఎవరో కాదు.. అలనాటి అందాల తార, అగ్ర కథానాయక శ్రియ (Shriya Saran). ఈ అమ్మడు గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. సొంతం సినిమాతో సక్సెస్ అందుకున్న ఈ హీరోయిన్ ఎన్నో సంవత్సరాలు పాటు తెలుగులో స్టార్ హీరోయిన్ గా కొనసాగింది.ఈ సమయంలో సీనియర్, జూనియర్ హీరోస్ అని తేడా లేకుండా తెలుగులో దాదాపు అందరి హీరోలతో నటించి మెప్పించింది శ్రియ.

ఆ తరువాత రజనీకాంత్ 'శివాజీ' అనే సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన ఈ అమ్మడు.. అతికొద్ది కాలంలో బాలీవుడ్ లోనూ అడుగు పెట్టింది. అక్కడ కూడా తన నటనతో గ్లామర్ తో హిందీ ప్రేక్షకులను మెప్పించింది. వయసు పెరిగిన కొద్దీ అందాన్ని కూడా పెంచుకుంటూ అభిమానులను అట్రాక్ట్ చేస్తూ ఉంది ఈ సుందరి. పెళ్లి తర్వాత కాస్త గ్యాప్ ఇచ్చిన ఈ అమ్మడు.. అటు పర్సనల్ లైఫ్ ను.. ఇటు ప్రొఫెషనల్ లైఫ్ ను.. బ్యాలెన్స్ చేయడానికి సిద్ధమయ్యారు. దాదాపు 7 సంవత్సరాల తరువాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నారు. అది కూడా తమిళ స్టార్ హీరో సూర్య సినిమాలో..
హీరో సూర్య 'కంగువా'మూవీ తరువాత.. డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో మరో సినిమా నటించడానికి సిద్ధమయ్యారు. దీనికి 'సూర్య44' అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు. ఈ సినిమాలో అందాల భామ పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.రామ్, బోజు జార్జ్, కరుణాకరన్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీని 2డీ ఎంటర్టైన్మెంట్, స్టోన్ బెంచ్ ఫిలిమ్స్ బ్యానర్లపై సూర్య, కార్తీక్ సుబ్బరాజ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.ఈ సినిమాను వచ్చే ఏడాది ఫిబ్రవరి 10 న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

అయితే.. ఈ సినిమాను నుంచి ఓ క్రేజీ అండ్ ఇంట్రెస్టింగ్ వార్త వెలుగులోకి వచ్చింది. సూర్య 44 సినిమాలో అలనాటి అందాల హీరోయిన్ శ్రియ స్పెషల్ సాంగ్ లో స్టెప్పులు వెయ్యనుందట.ఈ విషయాన్ని శ్రియ కూడా ధృవీకరించారు. ఆ పాట గురించి ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నారు. తాను హీరో సూర్యతో కలిసి స్పెషల్ సాంగ్లో స్టెప్పులు వేయబోతున్నానని, ఆ ఐటమ్ సాంగ్ ను గోవాలో షూట్ చేయబోతున్నారని తెలిపింది. సూర్య తో కలిసి తాను వేసే స్టెప్పులకు కుర్ర కారు చెమటలు పాటాల్సిందేనని పేర్కొంది. కాగా ఈ పాటను డిసెంబర్ లో రిలీజ్ చేయడానికి మూవీ టీం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
ఇదిలా ఉంటే.. ఈ ఏడాది మిహిర్ దేశాయ్ డైరెక్షన్ లో వస్తున్న బాలీవుడ్ సీరియల్ లో త్రిష నటిస్తుందట. అంతేకాకుండా.. ఈ అమ్మడు వెంకటేష్ హీరోగా డైరెక్టర్ తేజ తెరకెక్కించుతున్న సినిమాలో నటించబోతుందట. ఈ సినిమాకు సురేష్ బాబు, అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మించనున్నారు. ఈ సినిమాకు 'పాట నాదే.. వేట నాదే..' అనే టైటిల్ కూడా ఖరారు చేసినట్లు తెలుస్తుంది. వచ్చే ఏడాది డిసెంబర్లో రిలీజ్ చేసేందుకు దీన్ని సిద్ధం చేయనున్నట్లు సమాచారం. దీనిపై అధికారికా ప్రకటన రావాల్సిందే. అంతే కాకుండా.. శ్రియ తమిళ్లో మరో రెండు సినిమాలకు కూడా సైన్ చేసినట్లు సమాచారం. దీంతో అందాల భామ శ్రియ తన రీ ఎంట్రీని గ్రాండ్ గానే ప్లాన్ చేస్తుందంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











