హీరోయిన్లను చూస్తే అలాంటి ఆలోచనలే... శ్రియా శరణ్ స్ట్రాంగ్ వార్నింగ్

ఒకప్పుడు తన అందం, అభినయంతో టాలీవుడ్‌ను ఒక ఊపు ఊపి అగ్రనటిగా వెలుగొందారు శ్రియా శరణ్. రజనీకాంత్, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, మహేశ్, పవన్, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్ వంటి స్టార్స్ సరసన నటించారు. గతంలో ఏ సినిమా చూసినా ఖచ్చితంగా ఆమె ఉండాల్సిందే. అంతలా తన ముద్ర వేసుకున్న ఈ నటి తర్వాత కనిపించకుండాపోయారు. పెళ్లి తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన శ్రియా.. తన వయసు, ఇమేజ్‌కు తగిన పాత్రలు చేస్తూ దూసుకెళ్తున్నారు. తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఈ వివరాల్లోకి వెళితే..

మోడలింగ్‌తో కెరీర్ ప్రారంభించిన శ్రియాకు సినీరంగం నుంచి అవకాశాలు వచ్చాయి. 2001లో ఇష్టం సినిమాతో తెలుగు వారిని పలకరించగా.. ఆ మూవీ నిరాశపరిచింది. అయితే శ్రియా మాత్రం తన క్యూట్ లుక్స్, నటనతో టాలీవుడ్‌లో వరుస అవకాశాలను దక్కించుకుని స్టార్ హీరోయిన్‌గా దూసుకెళ్లారు. కొన్నేళ్ల పాటు తెలుగులో ఆమె హవానే నడిచింది. హీరోయిన్‌గా టాప్ రేంజ్‌లో ఉన్నప్పుడే .. ఐటెం సాంగ్స్ చేసి కొత్త ట్రెండ్ సెట్ చేశారు శ్రియా శరణ్. హీరోయిన్లు కూడా ఐటెం సాంగ్స్ చేయొచ్చని ఎన్నో స్పెషల్ సాంగ్స్ చేసి మాస్‌ను ఒక ఊపు ఊపారు.

Shriya Saran Strongly Reacts to Age Related Question Says Talent Matters More Than Age in Film Industry

ఇప్పుడు ఆమె చూపిన బాటలో తమన్నా, సమంత, కాజల్, శృతిహాసన్ వంటి హీరోయిన్లు నడుస్తూ కోట్లాది రూపాయల రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. ఈ జనరేషన్‌లో నటిగా 25 ఏళ్లకు పైగా కెరీర్‌ పూర్తి చేసుకున్న అరుదైన ఘనత శ్రియాది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించారు శ్రియా. ది అదర్ ఎండ్ ఆఫ్ ద లైన్, కుకింగ్ విత్ స్టెల్లా, మిడ్ నైట్ చిల్డ్రన్ వంటి ఇంగ్లీష్ సినిమాల్లోనూ నటించింది. కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే ఆమె ప్రేమలో పడ్డారు. రష్యాకు చెందిన ఆండ్రే కొశ్చీవ్‌తో డేటింగ్ చేసి 2018 మార్చి 12న అతనిని పెళ్లి చేసుకున్నారు శ్రియా. ఈ దంపతులకు ఒక పాప. ఇక 40 ప్లస్‌లోనూ చెక్కు చెదరని అందాలతో కుర్ర హీరోయిన్లకు పోటీ ఇస్తున్నారు శ్రియా.

ప్రస్తుతం తమిళంలో నాన్ వయలెన్స్‌తో పాటు హిందీలో దృశ్యం 3లో శ్రియా నటిస్తున్నారు. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే శ్రియా.. తన సినిమాలు, షూటింగ్, ఇతర వ్యక్తిగత వివరాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఇక హాట్ హాట్ ఫోటో షూట్‌లతో కుర్రాళ్లను రెచ్చగొడుతుంటారు. ఏ విషయంపై అయినా ముక్కుసూటిగా మాట్లాడే శ్రియా.. పలు అంశాలపై స్పందిస్తూ ఉంటారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రియాను తన వయసు గురించి యాంకర్ అడగటంతో మండిపడ్డారు. అప్పటికప్పుడే యాంకర్‌కు గట్టిగా బుద్ధి చెప్పారు.

43 ఏళ్ల వయసులోనూ మీ అందాన్ని ఎలా కాపాడుకుంటున్నారని యాంకర్ ప్రశ్నించారు. దీనికి శ్రియా స్పందిస్తూ.. మీరు ఇలాంటి ప్రశ్న అడగటమే తప్పు. వయసుతో ఎలాంటి సంబంధం లేదు. గతంలో హీరోయిన్లకు 30 ఏళ్ల వయసు దాటినా, పెళ్లయినా కెరీర్ ముగిసినట్లేనని అనుకునేవారు. అయితే ఇప్పుడు ఇండస్ట్రీలో పరిస్ధితులు మారుతున్నాయి. వయసు అనేది అడ్డంకి కాదు. వారి ప్రతిభ, పాత్రలకు ప్రాధాన్యత పెరుగుతోంది. 40 ఏళ్ల వయసులోనూ మంచి పాత్రలు వెతుక్కుంటూ వస్తున్నాయి. ప్రేక్షకులు కూడా ప్రతిభనే ఆదరిస్తున్నారు. కాబట్టి నటీమణులను కేవలం వారి వయసు ఆధారంగా అంచనా వేయొద్దు. సినీ రంగంలో విజయం సాధించడానికి ప్రతిభే ముఖ్యమని శ్రియా కౌంటర్ ఇచ్చారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read more about: shriya saran movie news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X