Shriya Saran : స్లీవ్ లెస్ టాప్ లో శ్రియా శరన్.. ఇలా రెచ్చగొట్టడంలో నెక్ట్స్ లెవల్... ఫొటోలు!

శ్రియా శరణ్ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది. చూడచక్కని రూపంతో, అద్భుతమైన నటనా నైపుణ్యంతో ఆడియెన్స్ మనస్సును గెలుచుకుంది. టాలీవుడ్ లో కొన్నేళ్ల పాటు శ్రియా శరణ్ ఒక ఊపూపింది. బడా హీరోల సరసన నటించి మెప్పించింది. ఎలాంటి రూమర్లకు తావులేకుండా తన పని తని చేసుకుంటూ క్లీన్ బయోను మెయింటెయిన్ చేసింది. క్యూట్ లుక్స్, మనస్సును హత్తుకునే రూప సౌందర్యంతో సౌత్ ఆడియెన్స్ కు ఎంతగానో నచ్చిచేసింది శ్రియా శరణ్.

ప్రస్తుతం శ్రియా శరణ్ బాలీవుడ్, కోలీవుడ్ లో పలు చిత్రాలు చేస్తూ బిజీగా ఉంది... కానీ ఈ ముద్దుగుమ్మ తెలుగు లో చేసిన సినిమాలతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. కింగ్, అక్కినేని నాగార్జునతో కలిసి 'సంతోషం' సినిమా నటించిన శ్రియా శరణ్ హీరోయిన్ గా టాలీవుడ్ లో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. ఆ చిత్రం తర్వాత వరుసగా ఆఫర్లు క్యూ కట్టాయి. ఫుల్ బిజీ షెడ్యూల్ తో కొన్నాళ్లపాటు ఊపూపింది.

Shriya Saran Stunning Looks in Sleeveless white top Her Stills Goes Viral

ఠాగూర్, నేనున్నాను, అర్జున్, బాలు, ఛత్రపతి, శివాజీ, తులసి, డాన్ శ్రీను, నువ్వా నేనా, లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్, మనం, గోపాల గోపాల వంటి చిత్రాలతో అలరించింది. ఈ సినిమాలు శ్రియాకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లోనూ ఈ ముద్దుగుమ్మ క్రేజీ ప్రాజెక్ట్స్ ల్లో నటిస్తూ ఆకట్టుకుంటోంది. విభిన్న పాత్రలు పోషిస్తూ అలరిస్తోంది. దృశ్యం, ఆర్ఆర్ఆర్ వంటి క్రేజీ ప్రాజెక్ట్స్ ల్లోనూ నటించి తన సత్తా చూపిస్తోంది.

ఇదిలా ఉంటే.. శ్రియా శరణ్ తన అభిమానులకు ఎల్లప్పుడూ సోషల్ మీడియా ద్వారా టచ్ లోనే ఉంటుంది. తన సినిమాల గురించి, కుటుంబ విషయాల గురించి, తన వ్యక్తిగత విషయాలను ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలోనే శ్రియా స్టన్నింగ్ లుక్ లో మెరుస్తూ ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతుంటుంది. ఇక తాజాగా శ్రియా శరణ్ పంచుకున్న లేటెస్ట్ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

స్లీవ్ లెస్ టాప్ లో శ్రియా శరణ్ స్టన్నింగ్ లుక్ లో మెరిసింది. అట్రాక్టివ్ జీన్స్, వైట్ టాప్ లో యంగ్ హీరోయిన్లకే షాకిచ్చేలా ఫొటోషూట్ చేసింది. జీరో ఫ్యాట్ బాడీని ప్రదర్శిస్తూ కుర్ర హృదయాలను కొల్లగొట్టింది. స్టైలిష్ గా మెరిసి అదిరిపోయే స్టిల్స్ తో ఆకట్టుకుంది. 47 ఏళ్ల వయస్సులోనూ ఈ ముద్దుగుమ్మ ఇంత యంగ్ అండ్ స్టన్నింగ్ ఫిట్ నెస్ తో మెరియడంతో ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు కూడా షాక్ అవుతున్నారు.

శ్రియా శరణ్ తాజా ఫొటోలను పంచుకుంటూ తన బెస్ట్ ఫ్రెండ్, యంగ్ రైటర్ ఇషికాను పరిచయం చేసింది. తను ఎన్నో ఏళ్లుగా తెలుసని, తన హార్ట్ కు బాగా దగ్గరైన పర్సన్ అని తెలిపింది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం శ్రియా శరణ్ యంగ్ లుక్ కు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఫ్యాన్స్, నెటిజన్లు క్రేజీ కామెంట్లతో సీనియర్ హీరోయిన్ ను పొగుడుతూ ఆకాశానికి ఎత్తుతున్నారు.

More from Filmibeat

Read more about: shriya saran shriya actress
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X