యువ హీరోకు శ్రీయా సరన్ ‘ప్రపోజల్’.. మై బాస్ అంటూ లండన్‌లో హాట్‌హాట్‌గా డ్యాన్స్
అందాల భామ శ్రియా సరన్ పెళ్లి తర్వాత కూడా సినిమాల జోరు కొనసాగిస్తున్నది. నరకాసురుడు, సందకారి లాంటి తమిళ చిత్రాల్లో నటించిన శ్రీయా సరన్ మరో హాలీవుడ్ సినిమా స్ఫూర్తిగా రూపొందే చిత్రంలో నటిస్తున్నది. హాలీవుడ్‌లో సండ్రా బుల్లక్ నటించిన ప్రపోజల్ సినిమా ఆధారంగా రూపొందే చిత్రంలో తమిళ హీరో వేమల్ సరసన నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీరిద్దర కలిసి నటించడం ఇదే మొదటిసారి. ఈ చిత్రానికి మాదేష్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఇక హాలీవుడ్‌లో ది ప్రపోజల్ సినిమాను స్ఫూర్తిగా చేసుకొని రూపొందించిన మలయాళ చిత్రం మై బాస్ అనే చిత్రానికి ఇది రీమేక్. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. చకచకగా తొలి షెడ్యూల్‌ను పూర్తి చేసే పనిలో ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లండన్‌లో నెల క్రితం మొదలైంది.

తాజా సినిమా షెడ్యూల్ పూర్తి కాగానే శ్రీయా తన భర్తను కలుసుకొనేందుకు రష్యాకు వెళ్లనున్నట్టు సమాచారం. లండన్‌లో తాను ఎంజాయ్ చేస్తున్న క్షణాలను ఇన్స్‌టాగ్రామ్‌లో షేర్ చేస్తున్నారు.
ఇటీవల లండన్‌లో క్రేజీగా డ్యాన్స్ చేసి సోషల్ మీడియాను పిచ్చెక్కించారు. ఓ గ్యాలరీ వద్ద ఫొటో ముందు నిలబడి డ్యాన్స్ చేశారు. ఆ ఫ్రేమ్‌లో ఉన్న వ్యక్తి కోతిగా మారడం ఆ ఫోటో ప్రత్యేకత. దాని ముందు చేసిన డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.

తమిళ స్టార్ హీరో శింబు నటించిన ఏఏఏ చిత్రంలో శ్రియా సరన్ చివరిసారిగా కనిపించింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడటంతో నిరాశ చెందింది. ఇక కార్తీక్ నరేన్ నటించిన నరకాసురుడు చిత్రంలో కూడా నటించింది. ఆ చిత్రం కొన్ని పరిస్థితుల కారణంగా విడుదలకు నోచుకోవడం లేదు. నరకసురుడు తర్వాత సందకారి అనే చిత్రంలో నటిస్తున్నది.


Click it and Unblock the Notifications











