పదేళ్ల బిడ్డకు తల్లిగా హీరోయిన్ శ్రీయ!

ఇటు సౌత్ సినిమాలతో పాటు అటు బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ ఇండియన్ సినిమా పరిశ్రమలో ఎక్కువకాలం సర్వైవ్ అయిన తారామణుల్లో శ్రీయ ఒకరు. ఇప్పటి వరకు పలు భిన్నమైన పాత్రలు పోషించిన ఆమె త్వరలో 10ఏళ్ల అమ్మాయికి తల్లి పాత్రలో కనిపించబోతోంది.

చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో మైత్రి మూవీస్ సంస్థ వారు ఉమెన్ సెంట్రిక్ మూవీ ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో శ్రీయ ప్రధాన పాత్ర పోషిస్తోందని, పదేళ్ల బిడ్డకు తల్లిగా నటించబోతున్నట్లు తెలుస్తోంది. కథతో పాటు అందులో తన క్యారెక్టరైజేషన్ బాగా నచ్చడంతో శ్రీయ ఈ పాత్ర చేయడానికి ఒప్పుకుందట.

Shriya Saran will play mother role of 10-year-old girl

ప్రస్తుతం ఈ చిత్రం ప్రీ పొడక్షన్ దశలో ఉంది. త్వరలోనే అఫీషియల్ ప్రకటన రానుంది. గతంలో శ్రీయ బాలీవుడ్ మూవీ 'దృశ్యం', తెలుగు మూవీ 'గౌతమీపుత్ర శాతకర్ణి', 'గోపాల గోపాల'తో పాటు పలు చిత్రాల్లో బిడ్డ తల్లిగా నటించిన సంగతి తెలిసిందే. ఆయా చిత్రాల్లో శ్రీయ బ్రిలియంట్ పెర్ఫార్మెన్స్ చూసిన దర్శకుడు తాను రాసుకున్న కథకు ఆవిడైతేనే కరెక్ట్ అని భావించి ఎంపిక చేశారట.

ప్రస్తుతం శ్రీయ తన భర్త ఆండ్రీ కొశ్చెవ్‌తో కలిసి విదేశాల్లో హాలిడే ఎంజాయ్ చేస్తోంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఈ సినిమా మొదలయ్యే లోపు వెకేషన్ పూర్తి చేసుకుని ఇండియా రాబోతున్నారని తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X