ఎన్టీఆర్‌ను చంపేసి.. బన్నీతో చెక్కేస్తా.. షాకింగ్ విషయాలు చెప్పిన శ్రుతీ హాసన్

ఒకప్పుడు ప్రేమతో లక్ష్మీ అనే ప్రోగ్రామ్ చేసిన సంగతి తెలిసిందే. మంచు లక్ష్మీ.. ప్రస్తుతం సినీ తారలతో ఓ ఇంటర్వ్యూ చేస్తోంది. అయితే ఇప్పుడు చేస్తున్న ప్రోగ్రామ్ మాత్రం పూర్తిగా మసాలాతో కూడుకున్నదే. తారల సీక్రెట్స్, బెడ్రూమ్ ముచ్చట్లు అంటూ ఫీట్ అప్ విత్ స్టార్స్ అనే ఈ షో వూట్ అనే యాప్లో ప్రసారం అవుతోంది.

తారల బెడ్ రూమ్ సీక్రెట్లతో..

తారల బెడ్ రూమ్ సీక్రెట్లతో..

ఇప్పటికే సమంత, రకుల్ ప్రీత్ సింగ్ లాంటి స్టార్స్ ను ఇంటర్వ్యూ చేసి.. షోను ఫుల్ ఫేమస్ చేసింది. ఈ షోలో రకుల్ చెప్పిన విషయాలు ఎంతగా వైరల్ అయ్యాయ్ అందరికీ తెలిసిందే. ఎవరికీ తెలియని నిజాలను, ఎవరితోనూ పంచుకోని విషయాలను ఇక్కడ చెప్పడమే ఈ షో ప్రత్యేకత అంటూ ఫుల్ పాపులర్ చేసేస్తోంది మంచు లక్ష్మీ.

తాజాగా శ్రుతి హాసన్...

తాజాగా శ్రుతి హాసన్...

ఈ షోకు తాజాగా శ్రుతి హాసన్ వచ్చింది. వీరిద్దరి ముచ్చట్లో ఎన్నో విషయాలను బహిర్గతం చేసింది. తన వ్యక్తిగత విషయాలను కూడా బయటకు చెప్పింది. గతంలో జరిగిన సంఘటనల నుంచి ఎంతో నేర్చుకున్నానని, అవన్నీ మంచి అనుభవాలుగా మారిపోయాయని ఇలా తన మనసులోని మాటలను చెప్పుకొచ్చింది.

టాలీవుడ్ టాప్ స్టార్స్తో జతకట్టి...

టాలీవుడ్ టాప్ స్టార్స్తో జతకట్టి...

యంగ్ టైగర్ ఎన్టీఆర్, సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టైలీస్ స్టార్ అల్లు అర్జున్ లాంటి హీరోలతో జతకట్టి సూపర్ హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకుంది. శ్రీమంతుడు, రేసుగుర్రం లాంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో వీరితో కలిసి నటించింది. అయితే ఈ ముగ్గురి హీరోలతో మంచి సంబంధాలు ఉండటంతో వీరి ముగ్గురికి కలిసి ఒక ప్రశ్నను శ్రుతి హాసన్కు వేసింది.

ఆ ముగ్గురికి సంబంధించిన ప్రశ్నతో ఇరకాటంలో శ్రుతి...

అయితే ఈ ముగ్గురిలో ఎవరిని పెళ్లి (మ్యారీ) చేసుకుంటావ్? ఎవరిని చంపుతావ్(కిల్)? ఎవరితో హుక్ (చెక్కేస్తావ్, ఉంటావ్) అని ఓ ప్రశ్నను అడిగింది. ఆ ముగ్గురికి పెళ్లి అయింది కదా.. మళ్లీ ఎందుకు అంటూ తిరిగి ప్రశ్నించింది. అసలు ఈ ప్రశ్న ఎందుకు నేనేందుకు వాళ్లను చంపుతా? నాకేం పనిఅంటూ దాటవేయ సాగింది. అయితే మంచు లక్ష్మీ మాత్రం వదల్లేదు.

వారితో నేను మాట్లాడతాను...

వారితో నేను మాట్లాడతాను...

అయితే ఆ ప్రశ్నకు సంబంధించి జవాబు చెప్పడానికి కాస్త జంకుతూ ఉంటే.. తారక్, మహేష్, బన్నీతో తాను మాట్లాడతాను అని ధైర్యం చెప్పింది. పెళ్లి.. అంటే నాకు తారక్ భార్య తెలియదు.. బన్నీ వైఫ్ స్నేహ కూడా అంతగా తెలియదు.. అయితే నమ్రతా మాత్రం బాగా తెలుసని వారిద్దరు సరదాగా ఉంటారని చెప్పుకొచ్చింది. అయితే మహేష్ ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా? అంటూ తిరిగి అడిగింది. నేను అలా చెప్పలేదంటూ కప్పి పుచ్చే ప్రయత్నం చేసింది.

తారక్ ను చంపేసి.. బన్నీతో చెక్కేస్తా..

తారక్ ను చంపేసి.. బన్నీతో చెక్కేస్తా..

మిగిలిన ఇద్దరిలో.. ఎవరికి ఏం చేప్తావ్.. ఎవరిని కిల్ చేసి..ఎవరిని హుక్ చేస్తావ్ అంటూ ప్రశ్నించింది. బన్నీని ఎలా చంపుతానంటూ శ్రుతి చెబుతూ ఉండగానే.. మధ్యలో అందుకుని అయితే తారక్ ను కిల్ చేసి.. బన్నీతో హుక్ చేస్తావ్ అని మంచు లక్ష్మీ కుండబద్దలు కొట్టేసింది.

కాటమరాయుడు తరువాత కనిపించని శ్రుతి..

కాటమరాయుడు తరువాత కనిపించని శ్రుతి..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాటమరాయుడు చిత్రం తరువాత తెలుగులో మరో సినిమాను శ్రుతి చేయలేదు. ప్రియుడితో కలిసి ఎంజాయ్ చేస్తుండటంతో.. సినిమాలు కాస్త తగ్గించింది. అయితే తమిళంలో ఇటీవలె విజయ్ సేతుపతితో జత కట్టింది. లాభమ్ అంటూ రాబోతోన్న ఈ మూవీ త్వరలోనే విడుదల కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X