twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నెపోటిజంపై శ్రుతీ హాసన్ స్ట్రాంగ్ రియాక్షన్.. అందుకే ఉపయోగపడుతుందని కామెంట్

    |

    లోక నాయకుడు, యూనివర్సల్ హీరో కమల్ హాసన్ కూతురిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది శ్రుతీ హాసన్. అనగనగా ఓ ధీరుడు సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది శ్రుతీ హాసన్. అయితే ఆ సినిమా దారుణంగా బెడిసికొట్టడం, ఆపై వచ్చిన చిత్రాలు కూడా వర్కౌట్ కాకపోవడం కాస్త నిరాశచెందింది. గబ్బర్ సింగ్ సినిమాతో శ్రుతీ హాసన్ ఫేట్ మారిపోయింది. ఆ తరువాత ఇటు తెలుగు, తమిళం, బాలీవుడ్ అంతటా పాపులర్ అయింది.

    శ్రుతీ హాసన్ నటిగా కంటే ముందు సింగర్, ప్రైవేట్ ఆల్బమ్స్‌తో బాగా ఫేమస్ అయింది. ఇండిపెండెంట్ మ్యూజిక్ చేయడంలో శ్రుతీ హాసన్ దిట్ట. లండన్‌లో శ్రుతీ హాసన్ ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకుంది. ఈనాడు సినిమాకు శ్రుతీ హాసన్ సంగీతాన్ని అందించడమే కాకుండా ఓ పాటను కూడా పాడింది. అలా మల్టీ టాలెంటెడ్‌గా శ్రుతీ హాసన్ సినీ పరిశ్రమలో దూసుకుపోతోంది. తాజాగా తన చిత్రం విడుదలకు సిద్దమవుతున్న నేపథ్యంలో మీడియాతో ముచ్చటిస్తూ అనేక విషయాలపై స్పందించింది.

    Shruthi Hassan About Nepotism

    నెపోటిజం అనేది ఎంట్రీ వరకు మాత్రమే ఉపయోగపడుతుందని, తరువాత సొంత టాలెంట్ మీదే అంతా ఆధారపడుతుందని తెలిపింది. లండన్‌లో ఉన్న సమయంలో తన బ్యాక్ గ్రౌండ్ ఏది పనికి రాలేదని, తన సంగీతాన్ని అందరూ ఇష్టపడేవారని పేర్కొంది. టాలెంట్ ఉంటేనే మనగలుగుతారని వెల్లడించింది. వకీల్ సాబ్ గురించి మాట్లాడుతూ.. ఆ చిత్రంలో నటిస్తున్నానని, అయితే ఇంకా షూటింగ్ మొదలు పెట్టలేదని, అందుకే ఇంతకు మించి ఏమీ మాట్లాడలేనని తెలిపింది. నాలుగేళ్ల క్రితం తెరకెక్కించిన యారా చిత్రం ప్రస్తుతం ఓటీటీలో (జీ 5లో జూలై 30) రిలీజ్ అవుతోందని, అందుకు ఎంతో సంతోషంగా ఉందని తెలిపింది.

    English summary
    Shruthi Hassan About Nepotism. I’ve always said that being a star kid gives you a key to open the door to the industry.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X