ప్రభాస్ ఎనర్జీ లెవెల్స్ ఓ రేంజ్‌లో.. శృతి హాసన్ పొగడ్తల వర్షం
అందాల భామ శృతిహాసన్ ఓ వైపు బాయ్‌ఫ్రెండ్ శంతన్ హజరికాతో లైఫ్‌ను ఎంజాయ్ చేస్తూనే మరో వైపు కెరీర్‌ను బ్రహ్మండంగా ప్లాన్ చేసుకొంటున్నది. లాక్‌డౌన్ సమయంలో కూడా వరుస హిట్లను తన ఖాతాలో వేసుకొన్న ఏకైక అగ్ర హీరోయిన్ శృతి ఓ క్రెడిట్‌ను కొట్టేసింది. 2021లో రవితేజతో క్రాక్, పవన్ కల్యాణ్‌తో వకీల్ సాబ్‌తో విజయాలను అందుకొన్నది. అదే జోష్‌లో ప్రస్తుతం ప్రభాస్‌తో సలార్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు ప్రశాంత్ నీల్, అలాగే హీరో ప్రభాస్‌పై కుప్పలు తెప్పలుగా ప్రశంసలు గుప్పిస్తున్నది.
సినిమాకు సంబంధించిన విజన్ విషయంలో దర్శకుడు ప్రశాంత్ నీల్‌కు ఎవరూ సాటి రాలేరు. ఆయనకు కావాల్సినదేమిటో చక్కగా కమ్యూనికేట్ చేస్తూ రాబట్టుకొంటారు. దాంతో నటీనటుల్లో చాలా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అని శృతి హాసన్ అన్నారు.

ఇక ప్రభాస్‌తో తొలిసారి పనిచేస్తున్న శృతిహాసన్ ఆయనను పొగడ్తలతో ముంచెత్తారు. ప్రభాస్ సెట్‌లో ఉంటే ఆ ఎనర్జీ లెవెల్స్ వేరు. సెట్స్‌లో ఆయన తీరు అద్బుతంగా ఉంటుంది. చాలా కూల్‌గా, ఏ మాత్రం భేషజాలు లేకుండా ఆయన ఉంటారు అని శృతిహాసన్ పేర్కొన్నారు.
గోదావరి ఖనిలో జరిగిన తొలి షెడ్యూల్‌లో శృతిహాసన్ పాల్గొన్నారు. ప్రభాస్, శృతిపై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. హోంబేల్ ఫిల్మ్స్ పతాకంప విజయ్ కే నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 2022 తేదీన రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కన్నడలో ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఉగ్రం చిత్రానికి సలార్ రీమేక్ అనే వాదన సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్నది.


Click it and Unblock the Notifications











