తమన్నా, శృతిహాసన్ పరుగో పరుగు.. ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ఏం జరిగిందంటే..
సాధారణంగా సినీ తారలు ఎవరి పనుల్లో వారు బిజీగా ఉంటారు. తమ కొలీగ్స్‌ను కలుసుకోలేనంత బిజీగా షూటింగ్‌ల్లో మునిగి తేలుతుంటారు. అనుకోకుండా ఎక్కడో ఓ చోట కనిపిస్తే వారి మధ్య కనిపించే ఆత్మీయత, ఆనందం మాటల్లో చెప్పలేకుండా ఉంటాయి. అలాంటి సంఘటనే శృతిహాసన్, తమన్నా భాటియా మధ్య జరిగింది. ఇద్దరు టాప్ హీరోయిన్ల మధ్య ఏం జరిగిందంటే..

బిజీ బిజీగా తమన్నా, శృతి
దక్షిణాదిలోనే కాదు. హిందీ భాషలో కూడా శృతిహాసన్, తమన్నా భాటియా బిజీగా హీరోయిన్లు అనే సంగతి తెలిసిందే. వారి ఇద్దరి మధ్య మంచి క్లోజ్ రిలేషన్స్ ఉన్నాయి. ఫోన్‌లో మాట్లాడుకోవడమే తప్ప కలుసుకొనే అవకాశం చాలానే తక్కువే. అలాంటి సమయంలో తాజాగా ఇద్దరు ముంబై ఎయిర్‌పోర్టులో తారసపడ్డారు.

గట్టిగా ప్రేమతో కౌగిలించుకొని
ఒకరిని ఒకరు చూసిందే తడువుగా ఇద్దరు పరుగులు పెట్టారు. వారిద్దరూ కలుసుకొని గట్టిగా ఒకరిని ఒకరు ప్రేమతో కౌగిలించుకొన్నారు. వారు అలా పరుగులు పెట్టడం ప్రయాణికులను ఆశ్చర్యానికి గురిచేసింది. తీరా వారెందుకు పరుగులు పెట్టారో అర్ధమయ్యాక నవ్వుకొన్నారు.

సెల్ఫీకి ఫోజిచ్చి
ఒకరిని ఒకరు కౌగిలించుకొన్న తర్వాత తమన్నా, శృతిహాసన్ కలిసి ఫొటో దిగారు. వెంటనే సోషల్ మీడియాలో అప్‌లోన్ చేశారు. ఇన్‌టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫొటోకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. వారిద్దరి మధ్య ఉన్న అనుబంధంపై ఆనందాన్ని వ్యక్తం చేశారు.

శృతిహాసన్ ఆనందంతో
తమన్నాతో దిగిన ఫొటోను శృతిహాసన్ తన ఇన్స్‌టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఉదయం ఆరు గంటల ప్రాంతంలో అనుకోకుండా తమన్నాను కలుసుకొన్నాను. తమన్నాను కలిసిన తర్వాత ఆ ఉదయం ఎంతో ఉత్సాహంగా మారిపోయింది అంటూ శృతిహాసన్ పేర్కొన్నారు.

తమన్నా భాటియా జోష్
తమన్నా కూడా తన సోషల్ మీడియా అకౌంట్‌లో ఫోటోను షేర్ చేసింది. నీకు ఇష్టమైన వారిని కలిసినప్పుడు దూరం, సమయం, ప్రదేశం అవేమి పట్టించుకోం. అలాంటి వారిని ఎయిర్‌పోర్టులో కలుసుకోవడం సరైంది. శృతిహాసన్‌ను కలుసుకోవడంతో ఈ రోజు ఎంతో సరదాగా గడిచిపోతున్నది అని తమన్నా తన అకౌంట్‌లో పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











