ఎన్ని బ్రేకప్స్ అని అడిగిన నెటిజన్.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన శృతి హాసన్.. మాములుగా లేదుగా!

ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా తెలుగులో చాలా సినిమాలు చేసిన శృతిహాసన్ ఆ మధ్య ప్రేమలో పడి సినిమాలకు దూరం అయింది.. ఇంగ్లాండ్ సింగర్ మైకేల్ కోర్సులే అనే వ్యక్తి తో పీకల్లోతు ప్రేమలో మునిగి పోయిన ఈ అమ్మడు ఇక పెళ్లి చేసుకుంటుందని, సినిమాలకు దూరం అయిపోతుంది అని అందరూ భావించారు.. అందుకు తగ్గట్టుగానే ఈ భామ ఆయనని ఇండియా తీసుకొచ్చి తన తల్లిదండ్రులకు సైతం పరిచయం చేసింది..

పెళ్లి అనుకున్నాక

పెళ్లి అనుకున్నాక

దీంతో ఇక ఆమె అతడిని పెళ్లి చేసుకోవడం కన్ఫామ్ అని అందరూ ఫిక్స్ అయ్యారు. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ చివరికి వాళ్ళిద్దరూ విడిపోయారు. చాలా కాలం తర్వాత శృతి కూడా సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చి మళ్లీ హిట్ అందుకొని ఫామ్ లోకి వచ్చింది. ఈ సమయంలో ఆమె మరో వ్యక్తితో డేటింగ్ చేస్తూ ఆసక్తికరంగా వార్తల్లోకెక్కింది. గత కొద్ది రోజులుగా శృతిహాసన్ శంతను హజారికా అనే ఒక ఆర్టిస్ట్ తో సన్నిహితంగా ఉంటున్న సంగతి తెలిసిందే.. అయితే వీరిద్దరి మధ్య బంధం ఏమిటి అనేది మాత్రం సరైన క్లారిటీ లేదు.

దాచి పెట్టాల్సిన అవసరం లేదని

దాచి పెట్టాల్సిన అవసరం లేదని

ఈ మధ్యకాలంలో శృతి ఒక ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ డేటింగ్ అనే కాన్సెప్ట్ మీద నాకు నమ్మకం ఉందా అంటే దానికి కచ్చితంగా తన వద్ద జవాబు లేదు అని చెప్పుకొచ్చింది. అయితే అందరిలా ఆ విషయం నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించనని చెప్పుకొచ్చింది. అలాగే తన జీవితానికి సంబంధించి ఏం జరుగుతుంది అనే విషయం అందరికీ తెలిసిందేనని ఆమె చెప్పుకొచ్చింది. తాము చిన్నప్పటి నుండి అందరి ముందే పెరిగామని అందుకే తన జీవితం గురించి దాచి పెట్టాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చింది.

థాంక్స్ చెప్పుకుంటా అని

థాంక్స్ చెప్పుకుంటా అని

ఇక ఆమె తమ మధ్య ఉన్న స్నేహ బంధానికి మాత్రం థాంక్స్ చెప్పుకుంటా అని చెప్పుకొచ్చింది. అలా మొత్తం మీద తమ మధ్య ఉన్నది స్నేహమే అని క్లారిటీ ఇచ్చింది. శంతను ఇంజనీరింగ్ డ్రాప్ అవుట్ కాగా ఆయన డూడుల్ ఆర్టిస్ట్. ఆయన ఇన్‌స్టాగ్రామ్ బయోలో ఉన్న వివరాల ప్రకారం 2014 డూడుల్ ఆర్ట్‌లో 'ఉత్తమ డూడుల్ ఆర్టిస్ట్‌ అవార్డ్ గెలుచుకున్నారు. అలాగే ఆయన గౌహతి ఆర్ట్ ప్రాజెక్ట్ సహ వ్యవస్థాపకుడు. అంతే కాక ప్రముఖ రాపర్లు, హిప్-హాప్ కళాకారులతో ఆయన కూడా పనిచేశాడు.

ఎన్ని బ్రేక్‌అప్‌లు

ఎన్ని బ్రేక్‌అప్‌లు

ఇన్‌స్టాగ్రామ్ యూజర్‌కి ఎన్ని బ్రేక్‌అప్‌లు ఎదురయ్యాయి అని అడిగినందుకు నటి శ్రుతి హాసన్ స్పందించింది. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఆస్క్ మి ఎనీథింగ్ (AMA) సెషన్‌లో హాసన్ ఈ ప్రశ్నకు స్పందించారు. ఆమెను "మీకు ఎన్ని బ్రేక్-అప్‌లు అయ్యాయి ?" అని అడిగాడు. దానికి శ్రుతి హాసన్ స్పందిస్తూ, "మీకు ఎంత మంది గర్ల్‌ఫ్రెండ్స్ ఉన్నారు? నేను సున్నా లేదా సగం ఉండవచ్చని అంచనా వేస్తున్నాను." అంటూ కౌంటర్ ఇచ్చింది.

సలార్ కోసం

సలార్ కోసం

ఇక సినిమాల విషయానికి వస్తే ఈ ఏడాది క్రాక్ సినిమాతో హిట్ అందుకున్న శృతి, తాజాగా హిట్ గా నిలిచిన వకీల్ సాబ్ సినిమాలో కూడా నటించింది. ఆ సినిమాలో పవన్ భార్యగా నటించి మంచి మార్కులు తెచ్చుకుంది. మరో పక్క పాన్-ఇండియా ప్రాజెక్ట్ సలార్ లో ప్రభాస్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకి కేజీఎఫ్ ఫేమ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ చేస్తున్న సినిమాలో హీరోయిన్‌గా కనిపించనుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X