బ్రేకప్స్ తర్వాత పెళ్లిపై నిర్ణయం ప్రకటించిన శృతిహాసన్.. ఇన్స్‌టా లైవ్‌లో తేల్చేసిన బ్యూటీ!
సౌత్ ఇండియా సినిమా దగ్గర మంచి క్రేజ్ ఉన్నటువంటి స్టార్ హీరోయిన్స్ లో శృతి హాసన్ కూడా ఒకామె అని చెప్పవచ్చు. కెరీర్ స్టార్టింగ్ లో కొన్ని ఎదురు దెబ్బలు తిన్నప్పటికీ చాలా స్పోర్టివ్ గా శృతి హాసన్ ఇండస్ట్రీ లో కెరటమై లేచింది. ఇప్పటికీ కూడా నేషనల్ మీడియాలో అయినా తన ఫస్ట్ హిట్ గబ్బర్ సింగ్ కోసం తప్పకుండా చెబుతుంది.
అక్కడ నుంచి తన లైఫ్ మారింది అని చెప్పుకొచ్చే శృతి హాసన్ ఇప్పుడు భారీ చిత్రాలు వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తో అయితే దూసుకెళ్తుంది. కాగా శృతి హాసన్ సోషల్ మీడియాలో సమయం దొరికినప్పుడు అంతా సోషల్ మీడియాలో గడుపుతుంది. తానే ఫాలోవర్స్ ని ఏమన్నా అడగండి అంటూ పోస్ట్ చేస్తుంది. అలా వచ్చే దాదాపు అన్ని ప్రశ్నలకి సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తుంది.

కాగా అలా లేటెస్ట్ గా మరోసారి సోషల్ మీడియాలో ఇంటరాక్ట్ కాగా ఆమెకి తన పెళ్లి ఎప్పుడు అనే రెండు ప్రశ్నలు ఎదురయ్యాయి. అయితే ఈ రెండు, మూడు ప్రశ్నలకి కూడా శృతి హాసన్ సమాధానం ఇచ్చేసింది. మొదటగా అసలు నా పెళ్ళి ఎప్పుడైతే మీకెందుకు అన్నట్టుగా పెట్టి ఇలాంటి విసుగు తెప్పించే ప్రశ్నలు ఇంకెప్పుడు నన్ను అడగొద్దు అంటూ విస్తు చెందింది.
అలాగే మరో ప్రశ్న పెళ్లి చేసుకుంటారా అంటే నెవెర్ అని సమాధానం ఇచ్చేసింది. ఇక మరో ప్రశ్నకి గాను ఇది 2024 ఇంకెప్పుడూ ఇలాంటి ప్రశ్నలని ఏ ఆడపిల్లని అడగొద్దు అంటూ సమాధానం ఇచ్చింది. అంటే అసలు ఆమె పెళ్లి చేసుకునే ఉద్దేశంతోనే లేదని ఈ సమాధానాలతో క్లియర్ అయ్యిపోయింది. మల్టీ టాలెంటెడ్ అయిన శృతి హాసన్ కి రీసెంట్ గానే తన బాయ్ ఫ్రెండ్ తో బ్రేకప్ అయ్యిన సంగతి తెలిసిందే. దీనితో అక్కడ నుంచి తాను ఏ రిలేషన్ షిప్ లోకి వెళ్ళకూడదు అని ఓసారి వెల్లడించింది.

కాగా ఇప్పుడు ఏకంగా అసలే పెళ్లే చేసుకోను అంటూ మొత్తం మేటర్ ని తేల్చి పడేసింది. అయితే శృతి హాసన్ తండ్రి కమల్ హాసన్ కూడా చాలా ప్రాక్టికల్ గానే ఆలోచిస్తారు. దీనితో అయితే ఖచ్చితంగా శృతి హాసన్ నిర్ణయాన్ని కమల్ యాక్సెప్ట్ చేసే ఛాన్స్ లు ఉన్నాయనే అనుకోవాలి. కాగా రీసెంట్ గా శృతి హాసన్ నటించిన చిత్రాలు వీరసింహా రెడ్డి, వకీల్ సాబ్, వాల్తేరు వీరయ్య, క్రాక్, ఇలా ప్రతి టాలీవుడ్ హీరో సినిమాలు భారీ హిట్స్ గా నిలవగా ఆ చిత్రాలు అన్నీ ఆ హీరోలకి మంచి కం బ్యాక్ చిత్రాలుగా నిలిచాయి.

అలాగే ఇప్పుడు సెన్సేషనల్ పాన్ ఇండియా సీక్వెల్ చిత్రం సలార్ పార్ట్ 2 సలార్ శౌర్యంగ పర్వంలో నటిస్తుంది. అలాగే ఈ సినిమాని దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తుండగా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. దీనితో పాటుగా యంగ్ హీరో అడివి శేష్ తో "డెకాయిట్" అనే క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ లో శృతి హాసన్ ఇప్పుడు నటిస్తుంది.


Click it and Unblock the Notifications











