ప్రియుడు శంతనుతో రిలేషన్‌షిప్.. డేటింగ్‌పై శృతిహాసన్ క్లారిటీ
అందాల భామ శృతిహాసన్ తన డేటింగ్ వ్యవహారంపై స్పందించారు. నేషనల్ వెబ్‌సైట్‌తో మాట్లాడుతూ తన బాయ్‌ఫ్రెండ్, తన తాజా ప్రేమ వ్యవహారం గురించి వివరంగా వెల్లడించారు. కొద్దికాలంగా శంతను హజారికా అనే పెయింటర్‌తో అతి సన్నిహితంగా ఉండటం తెలిసిందే. వారిద్దరు సన్నిహితంగా ఉన్న ఫోటోలు, సెల్ఫీలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే డేటింగ్‌పై పరోక్షంగా మాట్లాడుతూ.. ప్రస్తుతం నా జీవితంలో ఆనందకరమైన క్షణాలు ఉన్నాయి అంటూ చెప్పారు.
డేటింగ్ అనే కాన్సెప్ట్‌పై నాకు నమ్మకం ఉందా అంటే కచ్చితంగా నా వద్ద జవాబు ఉండదు. కానీ అందరిలా నేను ఆ విషయంపై తప్పించుకోవడానికి ప్రయత్నించను. దానిని దాచడం నాకు ఇష్టం ఉండదు అని శృతి హాసన్ అన్నారు. నా జీవితానికి సంబంధించిన వ్యక్తిగత విషయాలు నాలోనే ఉంచుకొంటాను. నా తల్లిదండ్రుల పెంపకం విభిన్నమైనది. ప్రజల ముందు మేమంతా పెరిగాం అని చెప్పారు.

నా జీవితానికి సంబంధించి ఏం జరుగుతున్నదనేది అందరికి తెలిసిందే. దాని గురించి దాచాల్సిన పనిలేదు. దానికి ఓ లెబుల్ వేయాల్సిన అవసరం లేదు. మా మధ్య కొనసాగుతున్న స్నేహ బంధానికి థ్యాంక్స్ చెప్పుకొంటాను అని శృతి హాసన్ పేర్కొన్నారు.
శృతి హాసన్ కెరీర్ విషయానికి వస్తే.. తాజాగా పవన్ కల్యాణ్‌తో కలిసి వకీల్ సాబ్‌లో అతిథి పాత్రను పోషించింది. ప్రస్తుతం కేజీఆఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో కలిసి ప్రభాస్ పక్కన సలార్ సినిమాలో నటిస్తున్నది.


Click it and Unblock the Notifications











