twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నా క్యారెక్టర్ అలాంటిదే: సీక్రెట్ రివీల్ చేసి పుకార్లకు పుల్‌స్టాప్ పెట్టిన శృతి హాసన్

    |

    విశ్వ నాయకుడు కమల్ హాసన్ కుమార్తెగా సినిమాల్లోకి ప్రవేశించినా... ఆకట్టుకునే అందం, అద్భుతమైన నటనతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది హాట్ బ్యూటీ శృతి హాసన్. చిన్న వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగిపోయింది. అప్పటి నుంచి వరుస ఆఫర్లు దక్కించుకుంటూ దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం యంగ్ రెబెల్ స్టార్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రాబోతున్న 'సలార్'లో నటిస్తోంది. తాజాగా ఈ మూవీ గురించి క్లారిటీ ఇస్తూ పుకార్లకు పుల్‌స్టాప్ పెట్టేసింది.

    'సలార్'లో శృతి హాసన్‌కు కూడా యాక్షన్ సీన్స్ పెట్టారని, ఇందులో ఆమె కొన్ని ఫైట్స్ కూడా చేయబోతుందని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా తన క్యారెక్టర్ గురించి క్లారిటీ ఇచ్చింది. 'సలార్ యాక్షన్‌ సినిమానే అయినా నా క్యారెక్టర్‌ నుంచి అలాంటివి ఆశించవద్దు. బయట ప్రచారం జరుగుతోన్నట్లు ఇందులో నాకు ఫైట్స్‌ లేవు. ఈ సినిమాకి సంబంధించి ఒక షెడ్యూల్‌ పూర్తి చేశాను. ప్రభాస్‌తో సినిమా చేయడం చాలా బాగుంది. తను నిజంగా చాలా మంచి వ్యక్తి' అంటూ చెప్పుకొచ్చింది.

     Shruti Haasan Clarity about her role in Salaar

    ఇక, ఈ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన రవితేజ చిత్రం 'క్రాక్'లో శృతి హాసన్ హీరోయిన్‌గా నటించింది. ఇందులో ఆమె ఓ ఫైట్ కూడా చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా, ఆమె విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్న 'లాభం' అనే మూవీలో నటిస్తోంది. ఎస్పీ జగన్నాథన్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అలాగే, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న 'వకీల్ సాబ్'లోనూ హీరోయిన్‌గా చేసింది. వీటితో పాటు మరికొన్ని చిత్రాల్లో నటించేందుకు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. మరికొన్ని చర్చల దశలో ఉన్నాయి.

    English summary
    Legendary actor Kamal Hassan's lovely daughter Shruti Hassan is not just an eye candy. She is a qualified musician, breathtaking dancer, singer, composer and a dance choreographer as well! In fact, Shruti's film debut was with playback singing for Kamal's cult film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X