నీ బాడీలో ఏ పార్టులకు సర్జరీ చేయించావ్: శృతి హాసన్‌కు నెటిజన్ ప్రశ్న.. దానికే చేయించా అంటూ!

శృతి హాసన్.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. అంతలా ఈ బ్యూటీ దేశ వ్యాప్తంగా గుర్తింపును సొంతం చేసుకుంది. విశ్వ నాయకుడు కమల్ హాసన్ కుమార్తెగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె.. తనదైన టాలెంట్లతో చాలా తక్కువ సమయంలోనే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకుంది. ఫలితంగా వరుసగా ఆఫర్లను అందుకుంటూ హవాను చూపించింది. దక్షిణాదిలోనే కాదు.. బాలీవుడ్‌లోనూ ఫేమస్ అయిన శృతి.. ఇప్పుడు మరింత బిజీగా గడుపుతోంది. అదే సమయంలోనే సోషల్ మీడియాలోనూ సందడి చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ స్టార్ హీరోయిన్ తాజాగా తన ఫ్యాన్స్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో చిట్ చాట్ చేసింది. ఇందులో ఓ నెటిజన్ ఆమెను ప్లాస్టిక్ సర్జరీల గురించి ప్రశ్నించాడు. ఆ సంగతులేంటో మీరూ చూడండి!

అప్పుడే మొదలు.. హీరోయిన్‌గా

అప్పుడే మొదలు.. హీరోయిన్‌గా

చిన్న వయసులోనే సంగీతం మీద ఉన్న మక్కువతో శిక్షణ తీసుకున్న శృతి హాసన్.. సింగర్‌గా తన ప్రయాణాన్ని మొదలెట్టింది. అలా ఎన్నో ఆల్బమ్‌లను రూపొందించింది. ఈ క్రమంలోనే 'హే రామ్' అనే చిత్రంతో తెరంగేట్రం చేసింది. తర్వాత 'లక్' మూవీలో కీలకమైన పాత్రను పోషించింది. ఇక, తెలుగులో వచ్చిన 'అనగనగా ఓ ధీరుడు'తో శృతి హీరోయిన్‌గా పరిచయమైంది.

టాలీవుడ్‌లో హవా... రీఎంట్రీలో

టాలీవుడ్‌లో హవా... రీఎంట్రీలో

తెలుగులో హీరోయిన్‌గా పరిచయం అయిన తర్వాత శృతి హాసన్‌కు వరుసగా ఆఫర్లు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే దాదాపు అందరు స్టార్‌ హీరోలతోనూ ఈ అమ్మడు స్క్రీన్ షేర్ చేసుకుంది. ఇలా సత్తా చాటుతున్నప్పుడే చాలా కాలం పాటు గ్యాప్ తీసుకుంది. ఆ తర్వాత గత ఏడాది 'క్రాక్' మూవీతో రీఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పవన్ కల్యాణ్ 'వకీల్ సాబ్' మూవీలోనూ నటించింది.

సీనియర్ హీరోలతో జోడీ కట్టేసి

సీనియర్ హీరోలతో జోడీ కట్టేసి

టాలీవుడ్‌లో ఉన్న కుర్ర స్టార్ హీరోలతో ఆడిపాడిన శృతి హాసన్.. ప్రస్తుతం రెబెల్ స్టార్ ప్రభాస్‌తో 'సలార్' అన పాన్ ఇండియా సినిమా చేస్తోంది. దీనితో పాటు గోపీచంద్ మలినేని - నందమూరి బాలకృష్ణ కాంబినేషన్‌లో రూపొందుతోన్న మూవీలోనూ భాగమైంది. అలాగే, మెగాస్టార్ చిరంజీవి - బాబీ కలయికలో వస్తున్న 'వాల్తేరు వీరయ్య'లోనూ ఆమె హీరోయిన్‌గా చేస్తోంది.

డేటింగ్‌తో బిజీ.. రచ్చ చేస్తూనే

డేటింగ్‌తో బిజీ.. రచ్చ చేస్తూనే


గతంలో శృతి హాసన్.. మైకేల్ కోర్సలే అనే విదేశీయుడితో ప్రేమాయణం సాగించింది. అయితే, ఆ బంధానికి మధ్యలోనే పుల్‌స్టాప్ పెట్టిన ఈ భామ.. ఇప్పుడు శాంతను హజారికాతో అనే డూడల్ ఆర్టిస్టుతో లవ్ ట్రాక్ నడుపుతోంది. ఇందులో భాగంగానే వీళ్లిద్దరూ పెళ్లి చేసుకోకుండానే ముంబైలో కలిసి ఒకే ఇంట్లో ఉంటూ ఎంజాయ్ చేస్తోన్నారు. అతడినే శృతి పెళ్లి చేసుకోబోతుందట.

అందులో మాత్రం యాక్టివ్‌గానే

అందులో మాత్రం యాక్టివ్‌గానే

వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ శృతి హాసన్ సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో నిత్యం టచ్‌లోనే ఉంటోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూ వస్తోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది. అలాగే, ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తోంది.

ప్లాస్టిక్ సర్జరీలపై శృతికి ప్రశ్న

ప్లాస్టిక్ సర్జరీలపై శృతికి ప్రశ్న

శృతి హాసన్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో చిట్ చాట్ సెషన్‌ను నిర్వహించింది. ఇందులో చాలా మంది పలు రకాల ప్రశ్నలు అడగగా.. వాటికి ఆమె ఎంతో సహనంతో సమాధానాలు చెప్పింది. మరీ ముఖ్యంగా పలువురు ఔత్సాహికులు ఆమె పర్సనల్ విషయాలూ ప్రస్తావించారు. ఈ క్రమంలోనే ఓ నెటిజన్ 'నీ బాడీలో ఎన్ని పార్టులకు ప్లాస్టిక్ సర్జరీలు చేయించావ్' అని ప్రశ్నించాడు.

దానికే చేయించా అని ఆన్సర్

దానికే చేయించా అని ఆన్సర్


సదరు నెటిజన్ అడిగిన ప్రశ్నకు శృతి హాసన్ ఒక్కసారిగా షాక్ అయిపోయింది. కొంత సేపటికి తేరుకున్న తర్వాత దానిపై స్పందిస్తూ.. 'నీ పని నువ్వు చూసుకుంటే మంచిది. అయినా అడిగావ్ కాబట్టి చెబుతున్నా. దీనికే సర్జరీ చేయించుకున్నా' అంటూ తన ముక్కును చూపిస్తూ షాకింగ్ ఆన్సర్ ఇచ్చింది. దీంతో ఆమె గురించి గతంలో వచ్చిన వార్తలు నిజమేనని అర్థమైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X