For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వకీల్ సాబ్‌కు శృతిహాసన్ ఝలక్.. పవన్ కల్యాణ్‌తో రొమాన్స్‌కు దూరంగానే..

    |

    అందం, అభినయంతో ఆకట్టుకొన్న శృతిహాసన్ గత కొద్దికాలంగా సినిమాలకు దూరంగా ఉంటుంది. ప్రియుడు మైఖేల్ కోర్సలేతో బ్రేకప్ తర్వాత సినిమాల్లో నటించాలని నిర్ణయం తీసుకొన్నది. ఈ మధ్యలోనే కాస్త మనసు మార్చుకొని మళ్లీ సినిమాల ముఖం చూసేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ రీఎంట్రీ చిత్రం వకీల్ సాబ్‌లో నటిస్తున్నట్టు వార్తలు రావడంతో మళ్లీ గబ్బర్ సింగ్ మ్యాజిక్ కనిపిస్తుందని ఆశపడ్డారు. కానీ శృతిహాసన్ ఫ్యాన్స్ ఆశలను అడియాశలు చేస్తూ షాకిచ్చింది. ఎంతకు శృతిహాసన్ చేసిన కామెంట్ ఏమిటంటే..

    పవన్‌ కల్యాణ్‌తో మంచి కెమిస్ట్రీ

    పవన్‌ కల్యాణ్‌తో మంచి కెమిస్ట్రీ

    గతంలో గబ్బర్ సింగ్, కాటమరాయుడు సినిమాలతో పవన్ కల్యాణ్‌, శృతిహాసన్ జంటకు మంచి క్రేజ్ ఏర్పడింది. వారిద్దరి మధ్య ఆన్‌స్క్రీన్ రొమాన్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఆ మధ్యలో పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోదామని, అలాగే సింగర్‌గా స్థిరపడుదామనే ఆలోచనలతో ఆఫర్లను రిజెక్ట్ చేసింది.

     ప్రియుడితో బ్రేకప్ తర్వాత

    ప్రియుడితో బ్రేకప్ తర్వాత

    ఆ తర్వాత పెళ్లి పీటల వరకు వచ్చిన మైఖేల్ కోర్సలేతో పెళ్లి చివరి నిమిషంలో ఆగిపోవడంపై బాగానే చర్చ జరిగింది. జీవితంలో ఎదురైన ఎదురు దెబ్బ నుంచి కోలుకొని సినిమానే జీవితమనే నిర్ణయానికి వచ్చింది. అలాంటి క్రమంలో చాలా రోజులుగా ఎదురు చూస్తున్న తెలుగు ప్రేక్షకులకు మళ్లీ నటిస్తున్నాని తియ్యని వార్తను అందజేసింది.

    క్రాక్‌లో రవితేజతో

    క్రాక్‌లో రవితేజతో

    ప్రస్తుతం తెలుగులో రవితేజ్‌తో కలిసి క్రాక్‌ అనే సినిమాలో శృతిహాసన్ నటిస్తున్నది. ఈ చిత్రంలో మంచి హోమ్లీ లుక్‌తో రొమాంటిక్‌గా కనిపించింది. అయితే అదే ఊపులో పవన్ కల్యాణ్‌తో వకీల్ సాబ్ చిత్రంలో నటిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఆమె తాను నటించడం లేదని అధికారికంగా వెల్లడించడం అభిమానులకు కొంత షాక్ ఇచ్చినట్టు అయింది.

     రీమేక్ సినిమాలో నటించడం లేదు

    రీమేక్ సినిమాలో నటించడం లేదు

    ఇటీవల తన సోషల్ మీడియా అకౌంట్‌లో లైవ్ ఛాట్ సందర్భంగా.. తాను ఎలాంటి రీమేక్ చిత్రంలో నటించడం లేదు. నాతో ఎవరూ కూడా సంప్రదింపులు జరుపలేదు. ఇప్పటి వరకు అలాంటి విషయాలే నా దృష్టికి రాలేదు. క్రాక్ తప్ప తెలుగులో నేను ఎలాంటి సినిమాలను అంగీకరించలేదు. మీడియాలో వస్తున్న వార్తల్లో వాస్తవం లేదు అని శృతిహాసన్ పేర్కొన్నది.

    Vakeel Saab : Shruti Haasan To Pair Up With Pawan Kalyan In Vakeel Saab?
    పింక్ రీమేక్‌గా వకీల్ సాబ్

    పింక్ రీమేక్‌గా వకీల్ సాబ్

    హిందీలో ఘన విజయం సాధించిన పింక్ చిత్రం రీమేక్‌గా వకీల్ సాబ్‌ రూపొందుతున్నది. తమిళంలో విద్యాబాలన్ పోషించిన పాత్రలో శృతి హాసన్ కనిపిస్తున్నారనే వార్త మీడియాలో వైరల్ అయింది. అయితే ప్రస్తుతం తాను నటించడం లేదని క్లారిటీ ఇవ్వడంతో మళ్లీ బంతి దర్శకుడు వేణు శ్రీరాం కోర్టులోకి వెళ్లింది. పవన్ సరసన నటించే అదృష్టం ఏ హీరోయిన్‌కు దక్కుతుందో అనే విషయం బాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది.

    English summary
    Actress Shruti Haasan clarity about Vakeel Saab movie. She said I am not pairing with Pawan Kalyan. She cleared that No one approached me so far any remake.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X