Shruti Haasan: నానితో హీరోయిన్ కాక్‌టైల్ పార్టీ.. ఒక్కదానికే కోటి రూపాయలు ఖర్చా?
గతంలో కంటే ఇప్పుడు తెలుగు హీరోలు మొత్తం పాన్ ఇండియా బాట పడుతున్నారు. అందులో బడా హీరోలతో పాటు కొందరు యంగ్ స్టార్ హీరోలు కూడా ఉన్నారు. వీరిలో ముందుగా చెప్పుకోవాల్సిన పేరు నేచురల్ స్టార్ నానిదే అని అనాలి. అంతలా అతడు సినిమా సినిమాకూ తన రేంజ్‌ను పెంచుకుంటూ వెళ్తున్నాడు. దీంతో రెట్టించిన జోష్‌తో సినిమాలు చేస్తున్నాడు.
'దసరా'తో సెన్సేషన్ హిట్‌ను సొంతం చేసుకున్న నేచురల్ స్టార్ నాని.. ఇప్పుడు తన 30వ సినిమాను శౌర్యూవ్ అనే దర్శకుడితో చేస్తున్నాడు. 'హాయ్ నాన్న' అనే టైటిల్‌తో రాబోతున్న ఈ మూవీ ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్‌తో రాబోతుంది. దీంతో ఆరంభంలోనే ఈ సినిమా అందరి దృష్టిని ఆకర్షించింది. ఫలితంగా ఈ చిత్రంపై అంచనాలు భారీ స్థాయిలోనే ఏర్పడ్డాయి.

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న 'హాయ్ నాన్న' మూవీ షూటింగ్ కొద్ది రోజుల క్రితమే ప్రారంభం అయింది. అప్పటి నుంచి ఏమాత్రం బ్రేకులు లేకుండా ఈ మూవీ చిత్రీకరణను జరుపుతున్నారు. ఇలా ఎవరూ ఊహించని విధంగా చాలా తక్కువ సమయంలోనే టాకీ పార్టును పూర్తి చేసుకున్నారు. మిగిలిన దాన్ని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి డిసెంబర్‌లో విడుదల చేయబోతున్నారు.
క్రేజీ కాన్సెప్టుతో తెరకెక్కుతోన్న 'హాయ్ నాన్న' మూవీలో ఓ స్పెషల్ సాంగ్ కూడా పెట్టబోతున్నారని తాజాగా న్యూస్ బయటకు వచ్చింది. పబ్‌లో కాక్‌టైల్ పార్టీ నేపథ్యంతో ఈ పాట ఉండబోతుందని తెలిసింది. దీనికోసం ఎంతో మంది హీరోయిన్ల పేర్లను పరిశీలించినా.. చివరకు స్టార్ హీరోయిన్ శృతి హాసన్‌ను చిత్ర యూనిట్ ఫైనల్ చేసిందని కూడా తెలిసింది.

ఇక, 'హాయ్ నాన్న' మూవీలోని కాక్‌టైల్ పార్టీ సాంగ్‌లో కనిపించేందుకు శృతి హాసన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. దీనికి కారణం నిర్మాతలు ఆమెకు ఈ పాట కోసం ఏకంగా కోటి రూపాయలు రెమ్యూనరేషన్ ఆఫర్ చేయడమే అని తెలిసింది. ఇక, దీనికి సంబంధించిన షూటింగ్ దసరా పండుగ తర్వాత ప్లాన్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
ఇదిలా ఉండగా.. నాని - శౌర్యూవ్ కాంబోలో తెరకెక్కుతోన్న 'హాయ్ నాన్న' మూవీని వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మోహన్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఇందులో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా.. బేబీ కియారా ఖన్నా నాని కూతురి పాత్రను పోషిస్తోంది. ఈ సినిమాకు హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ చిత్రం డిసెంబర్ 7వ తేదీన రిలీజ్ అవుతుంది.


Click it and Unblock the Notifications











