For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  శృతి హాసన్ బాడీ పార్ట్‌పై నెటిజన్ కామెంట్: దాని కోసమే లక్షలు ఖర్చంటూ.. సిగ్గు పడకుండా చెప్పేసింది

  |

  అద్భుతమైన అందం.. ఆకట్టుకునే నటనతో చాలా కాలంగా దక్షిణాదిలో హవాను చూపిస్తూ స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది హాట్ బ్యూటీ శృతి హాసన్. విశ్వనాయకుడు కమల్ హాసన్ కూతురిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకుందామె. ఫలితంగా వరుస ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోతోంది. ఇక, తరచూ తన వ్యవహార శైలితో వార్తల్లో నిలిచే ఈ బ్యూటీ.. తాజాగా నెటిజన్ అడిగిన ఓ ప్రశ్నకు సోషల్ మీడియాలో తన బాడీ పార్టు గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. అసలేం జరిగింది? పూర్తి వివరాలు మీకోసం!

  లేడీ ఆల్‌రౌండర్‌గా శృతి హాసన్

  లేడీ ఆల్‌రౌండర్‌గా శృతి హాసన్

  మోడలింగ్ రంగం నుంచి వచ్చి సినిమాల్లోకి వచ్చి తన సత్తాను చూపించింది శృతి హాసన్. ఫలితంగా దక్షిణాది చిత్రాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది. అదే సమయంలో సింగర్‌గా, ఇండిపెండెంట్ మ్యూజిక్ డైరెక్టర్‌గానూ మెప్పించింది. ఈ క్రమంలోనే ఎన్నో ఆల్బమ్‌లను క్రియేట్ చేసింది. ఫలితంగా ఆల్‌రౌండర్‌గా పేరును తెచ్చుకుంది. దీంతో ఈ అమ్మడు నేషనల్ లెవెల్‌లో ఫేమస్ అయింది.

  టాలీవుడ్‌లో హవా.. రీఎంట్రీ ఇలా

  టాలీవుడ్‌లో హవా.. రీఎంట్రీ ఇలా

  తెలుగులో శృతి హాసన్ ఎన్నో చిత్రాల్లో నటించింది. మరీ ముఖ్యంగా టాలీవుడ్ స్టార్ హీరోలు పవన్ కల్యాణ్, మహేశ్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ సహా ఎంతో మందితో ఆడి పాడింది. ఆ మధ్య లాంగ్ గ్యాప్ తీసుకున్న ఈ బ్యూటీ.. ‘క్రాక్'తో రీఎంట్రీ ఇచ్చి సక్సెస్‌ను అందుకుంది. దీని తర్వాత ‘వకీల్ సాబ్' కూడా హిట్టే. ఇప్పుడు ప్రభాస్‌తో ‘సలార్‌' అనే సినిమా చేస్తుంది.

   లవ్ వల్ల కెరీర్‌కు.. ఇప్పుడతడికి

  లవ్ వల్ల కెరీర్‌కు.. ఇప్పుడతడికి

  కెరీర్ పరంగా ఫుల్ ఫామ్‌లో ఉన్న సమయంలో శృతి హాసన్.. మైకేల్ కోర్స‌లేతో ప్రేమ‌లో ప‌డిన విషయం తెలిసిందే. అంతేకాదు.. అతడు క‌మ‌ల్‌ హాసన్‌తో క‌లిసి ఒక వేడుక‌లో కూడా పాల్గొన్నాడు. దీంతో తన కూతురి పెళ్లికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అన్నారు. ఆ సమయంలోనే శృతి - మైకేల్ పెళ్లి జరగబోతుందని అంతా అనుకున్నారు. కానీ, ఊహించని విధంగా అతడికి బ్రేకప్ చెప్పింది.

  మళ్లీ ప్రేమలో శృతి.. కలిసే ఉంటూ

  మళ్లీ ప్రేమలో శృతి.. కలిసే ఉంటూ

  మైకేల్ కోర్సలేతో బ్రేకప్ అయిపోయిన తర్వాత శృతి హాసన్ కెరీర్ మీద ఎక్కువగా దృష్టి సారించింది. ఈ క్రమంలోనే సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చి వరుసగా ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటోంది. ఇలాంటి సమయంలో ఈ కోలీవుడ్ బ్యూటీ శాంతను హజారికా అనే కుర్రాడితో ప్రేమలో పడిపోయింది. ఇక, ఇప్పుడు అతడితోనే కలిసి ఉంటోంది. అలాగే, తరచూ కలిసి కనిపిస్తూ రచ్చ చేస్తోంది.

  శృతి బాడీ పార్ట్‌పై నెటిజన్ కామెంట్

  శృతి బాడీ పార్ట్‌పై నెటిజన్ కామెంట్

  వరుస ఆఫర్లతో బిజీగా ఉన్నా.. శృతి హాసన్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో భాగంగానే ఈ అమ్మడు ఎన్నో విషయాలను వెల్లడించడంతో పాటు తన ఫొటోలు, వీడియోలను సైతం వదులుతూ ఉంటోంది. ఈ క్రమంలోనే తాజాగా ఆమె క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ నిర్వహించింది. ఇందులో ఓ నెటిజన్ ఆమె బాడీ పార్ట్‌పై కామెంట్స్ చేశాడు.

  Star Director Bobby Launches Jagadananda Karaka Movie ​| Filmibeat Telugu
  లక్షలు ఖర్చంటూ సిగ్గ పడకుండానే

  లక్షలు ఖర్చంటూ సిగ్గ పడకుండానే

  ఈ సెషన్‌లో భాగంగా ఓ నెటిజన్ ‘మీ బాడీ మొత్తంలో మీకు నచ్చిన పార్ట్ ముక్కే అనుకుంటా కదా' అని అడిగాడు. దీనికి ఆమె ఏమాత్రం సిగ్గు పడకుండా ‘అవును. అందుకోసమే కదా దానికి చాలా లక్షల రూపాయలు ఖర్చు చేశాను' అంటూ ప్లాస్టిక్ సర్జరీ జరిగిన విషయాన్ని గుర్తు చేసింది. శృతి హాసన్ ఇచ్చిన ఈ జావాబుపై నెటిజన్ల నుంచి విభిన్నమైన కామెంట్లు వస్తున్నాయి.

  English summary
  Legendary actor Kamal Hassan's lovely daughter Shruti Hassan Full Active in Social Media. Recently She Commented about her Nose Surgey in Chat Session.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X