Shruti Haasan బాయ్ ఫ్రెండ్ తో బ్రేకప్ అయ్యి మూడు నెలలే.. అప్పుడే మరొకరితో అఫైర్‌తో శృతి హాసన్

లోక నాయకుడు కమల్ హాసన్ నట వారసురాలిగా ఇండస్ట్రీకి పరిచయమైంది శృతి హాసన్. 2011లో కె. రాఘవేంద్రరావు కొడుకైన కె.ప్రకాష్ దర్శకత్వంలో సిద్దార్థ్ సరసన అనగనగా ఓ ధీరుడు సినిమాతో తెలుగుతెరకు ఎంట్రీ ఇచ్చింది. విమర్శకుల నుంచి తన నటనకు ప్రశంసలనందుకున్నా శృతికి మాత్రం ఈ సినిమా కమర్షియల్ గా పరాజయంగానే మిగిలింది. సినిమా విజయం అందుకోకపోయినా.. ఉత్తమ తెలుగు నూతన నటి విభాగంలో దక్షిణ భారత ఫిలింఫేర్ అవార్డును పొందింది.

నిజం చెప్పాలంటే శృతి మొదట్లో చాలా సినిమాల్లో నటించింది కానీ విజయాలను అందుకోలేకపోయింది. దీంతో అందరూ ఆమెను ఐరెన్ లెగ్ అని పిలిచేవారు. ఆ సమయంలోనే పవన్ కళ్యాణ్ సరసన గబ్బర్ సింగ్ సినిమా చేసింది శృతి. ఆ ఒక్క సినిమా ఆమె జీవితాన్ని మార్చేసింది. ఈ సినిమా భారీ విజయాన్ని సాధించడమే కాక విమర్శకుల మరియూ ప్రేక్షకుల దృష్టిలో శ్రుతి హాసన్ స్థాయిని పెంచింది. తనని నటిగా తెలుగు సినిమాల్లో నిలబెట్టింది. ఈ సినిమా తరువాత తెలుగులో స్టార్ హీరోయిన్ హోదాను అందుకుంది. స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది.

Shruti Haasan confirms breakup with Santanu Hazarika I am single willing to mingle

కేవలం హీరోయిన్ గానే కాకుండా సింగర్ గా, సంగీత దర్శకురాలిగా కూడా మెప్పించింది. ఇక సినిమాల విషయం పక్కన పెడితే.. రిలేషన్ షిప్స్ ద్వారా మరింత ఫేమస్ అయ్యింది. ఇప్పటికీ ఈ ముద్దుగుమ్మకు మూడు బ్రేకప్స్ అయ్యాయి. మొదట్లో 3 సినిమా చేసే సమయంలో ధనుష్ తో ఎఫైర్ ఉందని.. ధనుష్ భార్య ఫైర్ కావడంతో వీరికి బ్రేకప్ అయ్యిందని వార్తలు వచ్చాయి. ఇక ఆ తరువాత శృతి మైఖేల్ అనే వ్యక్తితో సీరియస్ రిలేషన్ లో ఉండేది.

అది కొన్నాళ్ళకు బ్రేక్ అవ్వడంతో అమ్మడు చాలా డిప్రెషన్ లోకి వెళ్ళింది. మందుకు, డ్రగ్స్ కు బానిసగా మారి సినిమాలకు కూడా గ్యాప్ ఇచ్చింది. ఇక మెల్లిగా ఆ బ్రేకప్ బాధ నుంచి బయటపడి శంతను హజారికతో మరోసారి ప్రేమలో పడింది. కొన్నేళ్లుగా వీరిద్దరూ లివింగ్ రిలేషన్ లో ఉంటున్నారు. ఇక ఎక్కడ కనిపించినా జంటగా కనిపించడం.. తమిళ్ పండగలకు శంతను హజారిక తమిళ్ తంబీల రెడీ అవ్వడం, ఇద్దరూ కలిసి పూజలు చేయడం.. అబ్బో చాలా జరిగాయి. దీంతో వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారు అని అందరూ ఆశపడ్డారు. ఇక అంతాలోనే శృతి పెద్ద బాంబ్ పేల్చింది.

Shruti Haasan confirms breakup with Santanu Hazarika I am single willing to mingle

శంతను హజారికతో కూడా ఆమె విడిపోయిందని అధికారికంగా చెప్పుకొచ్చింది. ఈ విషయం గురించి శంతను హజారికను అడిగితే తనను ఏమి అడగొద్దని చెప్పి తప్పించుకున్నాడు. ఇప్పుడు శృతి సమాధానం చెప్పేసింది. ప్రస్తుతం తాను సింగిల్ గా ఉన్నానని, మింగిల్ అవ్వడానికి రెడీగా ఉన్నట్లు తెలిపింది.

ఇన్స్టాగ్రామ్ లో అభిమానులతో ముచ్చటించిన ఈ చిన్నది.. అభిమానుల అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. సింగిల్ ఆర్ కమిటెడ్ అన్న ప్రశ్నకు..దానికి మాత్రం నేను సమాధానం చెప్పాలనుకోవడం లేదు కానీ.. నేను ఇప్పుడు సింగిల్ గానే ఉన్నాను. మింగిల్ అవ్వడానికి రెడీగా ఉన్నాను" అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం శృతి సమాధానాలు నెట్టింట వైరల్ గా మారాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X