Shruti Haasan: కూలిలో మొత్తం అలాగే కనిపిస్తా.. అస్సలు సినిమాలే చేయాలని లేదు.. శృతి హాసన్
స్టార్ హీరోయిన్ శృతి హాసన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ లో శృతి హాసన్ గుర్తుండిపోయే చిత్రాల్లో నటించింది. తన కంటూ స్పెషల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది. నెక్ట్స్ శృతి హాసన్ నటించిన కోలీవుడ్ ఫిల్మ్ కూలి వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా తన చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈక్రమంలో సినిమా గురించే కాకుండా తన వ్యక్తిగత విషయాలను కూడా నిర్మోహమాటంగా పంచుకుంది. ముఖ్యంగా తన కెరీర్ పై, రాబోయే చిత్రం కూలి గురించి ఆసక్తికరంగా కామెంట్స్ చేసింది. ఆ వివరాల్లోకి వెళితే..
తండ్రికి తగ్గ తనయ..
శృతి హాసన్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి కమల్ హాసన్ కూతురిగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తొలుత చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు చిత్రాల్లో నటించింది. ఇక 2009లో హిందీ చిత్రం లక్ తో హీరోయిన్ గా ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత నేరుగా టాలీవుడ్ లో అడుగు పెట్టింది. అనగనగ ఓ ధీరుడు అనే చిత్రంలో సిద్ధార్థ సరసన నటించి మెప్పించింది. తొలిచిత్రంతోనే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఇక ఆ తర్వాత తెలుగు, తమిళం, హిందీ చిత్రాల్లో స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. కమల్ హాసన్ కూతురిగా చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టినప్పటికీ ఇండియన్ యాక్ట్రెస్ గా, స్టార్ హీరోయిన్ గా తన టాలెంట్ తో గుర్తింపు దక్కించుకుంది. తండ్రికి తగ్గ తనయ అనిపంచుకుంది.

కూలి చిత్రంపై శృతి హాసన్ కామెంట్స్..
రీసెంట్ గా శృతి హాసన్ ఇచ్చిన ఇంటర్వ్యూలో కూలి చిత్రం గురించి ఇలా మాట్లాడింది. రజనీకాంత్ కూలి చిత్రంలో తాను డీ గ్లామర్ రోల్ లో నటించానని చెప్పారు. ఇప్పటి వరకు తన కెరీర్ లో ఇదే తొలిసారి అని చెప్పారు. ఎలాంటి మేకప్ లేకుండా కూలి చిత్రానికి వర్క్ చేశానని చెప్పారు. మరోవైపు తన ఫిల్మ్ కెరీర్ గురించి మాట్లాడుతూ.. తొలుత తను ఒక్కటే చిత్రం చేయాలనుకుందని, ఆ తర్వాత అస్సలు సినిమాలు చేయకూడదని అనుకుందంట. కానీ పరిస్థితుల, తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ అవ్వడం కారణంగా సినిమా తర్వాత సినిమా చేయాల్సి వచ్చిందని తెలిపారు.
కూలి చిత్రం ప్రమోషన్స్..
కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ - లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో రూపుదిద్దుకున్న గ్యాంగ్ స్టర్ యాక్షన్ ఫిల్మ్ కూలి. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్ లో కళానిధి మారన్ నిర్మించారు. భారీ కాస్ట్, టాప్ టెక్నీషియన్లు పనిచేసిన కారణంగా ఈ చిత్రానికి రూ.350 కోట్లకు పైగా ఖర్చైందని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు. ఇక ఈ చిత్రం ఆగస్టు 14న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా విడుదల కాబోతోంది.
శృతి హాసన్ రాబోయే చిత్రాలు..
మరి కొద్ది రోజుల్లో శృతి హాసన్ కూలి చిత్రంలో అలరించబోతోంది. ఇప్పటికే సలార్ తో ఇండియా వైడ్ గా దుమ్ములేపింది. బ్లాక్ బాస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. నెక్ట్స్ కూలి, జన నాయగన్, ట్రైన్, సలార్ పార్ట్ 2 : శౌర్యాంగ పర్వం వంటి చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.


Click it and Unblock the Notifications











