నేను అలాంటి దాన్ని.. వాటి గురించి చెప్పడానికి ఎలాంటి సిగ్గు లేదు.. స్టార్ హీరోయిన్ కామెంట్స్
నేను అలాంటి దాన్ని కాదు.. దాని గురించి చెప్పడానికి నాకెలాంటి సిగ్గు లేదని శ్రుతీ హాసన్ ఫైర్ అయింది. తన బాడీ మీద, తన మీద, లావుగా ఉంది, బక్కగా ఉందని కామెంట్స్ చేసే వారిపైన విరుచుకుపడింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ సుదీర్ఘమైన పోస్ట్ చేసింది. ఇంతకీ అసలేం జరిగిందన్నది ఓసారి చూద్దాం.
ఓ పిక్‌ను షేర్ చేయడంతో..
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే హీరోయిన్లలో శ్రుతీ హాసన్ ఒకరు. హాట్ హాట్ ఫోటోలతో రెచ్చగొడుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఓ పిక్‌ను షేర్ చేసింది. అయితే ఈ ఫోటోకు వచ్చిన కామెంట్స్ చూసి ఖంగుతిన్నట్టుంది. అలా కామెంట్స్ చేసే వారికి మళ్లీ ఓ ఫోటోను షేర్ చేసి అందరికీ కౌంటర్ వేసింది.

నేను అలాంటి దాన్ని..
తాను ఇంతకు మునుపు చేసిన పోస్ట్‌పై చేసిన కామెంట్స్‌కు సమాధానమివ్వడానికే ఈ పోస్ట్ చేస్తున్నానని చెప్పుకొచ్చింది. తాను ఒకరి అభిప్రాయాల మేరకు నడుచుకునే వ్యక్తిని కాదని తెలిపింది. తన సొంత ఇష్టాలు, అభిప్రాయాల మేరకే జీవిస్తానని పేర్కొంది.

అలాంటివి మానేయాలి..
సన్నగా ఉంది, లావుగా ఉందని కామెంట్స్ చేయడం మానుకోవాలని సూచించింది. ఈ రెండు ఫోటోలు మూడు రోజుల గ్యాప్‌లో దిగినవి చెప్పుకొచ్చింది. తాను చెప్పబోయే విషయాలతో సంబంధం ఉన్న మహిళలు ఇక్కడ ఉన్నారని తనకు ఖచ్చితంగా తెలుసని చెప్పింది.

హార్మోన్ల సమస్య..
గత కొన్నేళ్లుగా తన హార్మోన్ల సాయంతో మానసికంగా మరియు శారీరకంగా ఉన్నానని చెప్పుకొచ్చింది. హార్మోన్ల సమతుల్యం పాటించడం, ఆరోగ్యకరమైన సంబంధాన్ని కలిగి ఉండటానికి ప్రయత్నిస్తానని తెలిపింది.

ఎవరికీ ఆ హక్కు లేదు..
అయితే ఇదేమీ అంత సులభమైన పని కాదని, ఆ బాధను భరించడం కూడా సులభమేమీ కాదని అయితే తన ప్రయాణాన్ని మాత్రమే పంచుకోవడం మాత్రం ఈజీ అని తెలిపింది. ఏ ఒక్కరికిజజ వారెంత గొప్పవారైనా సరే ఇతరుల గురించి నిర్ణయించే హక్కులేదని చెప్పుకొచ్చింది. ఎప్పటికీ అలా చేయకూడదు.. అది మంచిది కాదని వెల్లడించింది.

చెప్పడానికి నాకేం సిగ్గు లేదు..
ఇది తన జీవితమని, తన మొహమని చెప్పడం తనకు సంతోషంగా ఉందని తెలిపింది. అవును నేను ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాను.. అది చెప్పడానికి నాకేం సిగ్గుగా లేదని చెప్పుకొచ్చింది. తానేమైనా వాటిని ప్రోత్సహించానా? లేదు.. తాను దీనికి వ్యతిరేకమా? లేదు .. ఇది తాను జీవించడానికి ఎంచుకున్న మార్గమని తెలిపింది.
Recommended Video


ప్రేమను పంచండి..
మనకు, ఇతరులకు మనం చేయగలిగే అతి పెద్ద మేలు ఏంటంటే.. మన శరీరాలు, మనస్సుల మార్పులను, కదలికలను అంగీకరించడం నేర్చుకోవడమే. ప్రేమను పంచండి ఆనందంగా ఉండండి. ప్రతీ రోజూ తనను తానే ప్రేమించడం నేర్చుకుంటానని, ఎందుకంటే ఈ జీవితంలో తనతో తనకే ఓ గొప్ప ప్రేమ కథ ఉందని, మీకు కూడా అలాగే ఉంటుంద'ని పోస్ట్ చేసింది. శ్రుతీ హాసన్ ప్రస్తుతం రవితేజ క్రాక్ చిత్రంలో నటిస్తోంది.


Click it and Unblock the Notifications











