ప్రియుడితో శృతి హాసన్ ఎంజాయ్: ఆ పని చేస్తూ అడ్డంగా దొరికిపోయింది.. ఆఖరికి భయంతో పరుగులు!

అద్భుతమైన నటన, విభిన్నమైన శైలితో విశ్వనటుడిగా పేరొందారు దక్షిణాది స్టార్ హీరో కమల్ హాసన్. ఆయన కుమార్తెగా సినీ రంగ ప్రవేశం చేసింది శృతి హాసన్. తండ్రి పేరు చెప్పుకుని కాకుండా.. తనలోని టాలెంట్లను ఒక్కొక్కటిగా బయట పెడుతూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకుందామె. ఈ క్రమంలోనే వరుసగా ఆఫర్లు అందుకుంటూ సత్తా చాటుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో గతంలో ఓ సింగర్‌ను ప్రేమించిన ఆమె.. అతడికి బ్రేకప్ చెప్పేసింది. ఈ మధ్య మరొకరితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతోంది. ఈ నేపథ్యంలో బాయ్‌ఫ్రెండ్‌తో అడ్డంగా దొరికిపోయింది శృతి. వివరాల్లోకి వెళితే...

సినిమాల్లోకి ఎంట్రీ.. మొత్తం తెలిసింది

సినిమాల్లోకి ఎంట్రీ.. మొత్తం తెలిసింది

కమల్ కూతురిగా సినిమాల్లోకి ప్రవేశించినప్పటికీ.. అద్భుతమైన నటనతో సొంతంగా గుర్తింపును అందుకుంది శృతి హాసన్. కెరీర్ ఆరంభంలోనే నటిగా మంచి పేరును సంపాదించుకున్న ఆమె.. దేశ వ్యాప్తంగా పాపులర్ అయింది. దీంతో చాలా భాషల్లో సినిమా అవకాశాలు అందుకుంది. ఆ తర్వాత సింగర్‌గానూ మారింది. అలాగే, మ్యూజిక్ కూడా కంపోజ్ చేస్తూ సత్తా చాటిందీ బ్యూటీ.

తెలుగులోనూ సక్సెస్.. రీఎంట్రీ కూడా

తెలుగులోనూ సక్సెస్.. రీఎంట్రీ కూడా

తమిళ పరిశ్రమకు చెందిన అమ్మాయే అయినా.. శృతి హాసన్ తెలుగులోనూ చాలా సినిమాల్లో నటించింది. ముఖ్యంగా స్టార్ హీరోలు పవన్ కల్యాణ్, మహేశ్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ సహా ఎందరో హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. అలాగే, చాలా గ్యాప్ తర్వాత 'క్రాక్'తో గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె 'వకీల్ సాబ్', 'సలార్'లో హీరోయిన్‌గా చేస్తోంది.

విదేశీ సింగర్‌తో ప్రేమాయణం... బ్రేకప్

విదేశీ సింగర్‌తో ప్రేమాయణం... బ్రేకప్

శృతి హాసన్ కొన్నేళ్ల క్రితం ఇంగ్లండ్ గాయ‌కుడు మైకేల్ కోర్స‌లేతో ప్రేమ‌లో ప‌డిన విషయం తెలిసిందే. అంతేకాదు.. అతడు క‌మ‌ల్‌ హాసన్‌తో క‌లిసి ఒక వేడుక‌లో కూడా పాల్గొన్నాడు. దీంతో తన కూతురి పెళ్లికి విశ్వనాయకుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అన్నారు. ఆ సమయంలోనే శృతి - మైకేల్ పెళ్లి జరగబోతుందని అంతా అనుకున్నారు. కానీ, అనూహ్యంగా వీళ్లిద్దరూ విడిపోయారు.

మళ్లీ ప్రేమలో పడిన శృతి.. ముంబైలో

మళ్లీ ప్రేమలో పడిన శృతి.. ముంబైలో

సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే శృతి హాసన్.. రెండు రోజుల క్రితం తన ఫాలోవర్లతో లైవ్ చాట్ నిర్వహించింది. ఈ క్రమంలోనే ఓ నెటిజన్ 'మీరు మళ్లీ ప్రేమలో ఉన్నారా' అని ప్రశ్నించాడు. దీనికి 'అవుననుకుంటా' అంటూ నోరు జారి బుక్కైపోయిందీ హాట్ బ్యూటీ. ఆ వెంటనే కొత్త బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి ముంబై నగరంలో తిరుగుతూ దేశ వ్యాప్తంగా వార్తల్లో నిలిచిందీ అందాల భామ.

ఆ పని చేస్తూ అడ్డంగా దొరికిపోయింది

ఆ పని చేస్తూ అడ్డంగా దొరికిపోయింది

గురువారం తన 35వ పుట్టినరోజును జరుపుకుంది శృతి హాసన్. ముంబైలో తన ప్రియుడితో కలిసి ఎంజాయ్ చేసిన ఆమె.. సలార్ మూవీ షూటింగ్ కోసం శుక్రవారం ఉదయం హైదరాబాద్ పయనం అయింది. ఆ సమయంలో ఏకంగా బాయ్‌ఫ్రెండ్‌ను వెంట పెట్టుకుని వచ్చి కెమెరాల కంటికి చిక్కింది. అంతేకాదు, అతడితో చనువుగా ఉంటూ.. హగ్ కూడా చేసుకుంది. ఇలా అడ్డంగా బుక్కైంది.

 ఆఖరికి భయంతో పరుగులు పెట్టడంతో

ఆఖరికి భయంతో పరుగులు పెట్టడంతో

ప్రియుడితో కలిసి ఎంజాయ్ చేయడం వల్లో ఏమో కానీ, శృతి హాసన్ తన ఫ్లైట్ టికెట్‌ను కారులోనే మరిచిపోయింది. లోపలికి వెళ్లే చివరి క్షణంలో ఇది గుర్తించిందామె. దీంతో వెంటనే ఆమె ప్రియుడు పరుగు పరుగున వెళ్లి టికెట్ తీసుకుని వచ్చాడు. ఆ తర్వాత ఆమె హైదరాబాద్ పయనం అవగా.. అతడు తిరిగి వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X