ప్రియుడితో బెడ్‌పై శృతి హాసన్ రచ్చ: కరోనా ఉన్నా అలాంటి పనులు చేస్తూ!

చూపు తిప్పుకోకుండా చేయగల అందం.. అద్భుతమైన నటనతో చాలా కాలంగా దక్షిణాదిలోనే స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది హాట్ బ్యూటీ శృతి హాసన్. విశ్వనాయకుడు కమల్ హాసన్ గారాల కూతురిగా సినిమాల్లోకి ప్రవేశించినప్పటికీ.. తనలోని టాలెంట్లతో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. ఈ క్రమంలోనే వరుసగా ఆఫర్లను అందుకుంటూ కెరీర్‌ను సక్సెస్‌ఫుల్‌గా ముందుకు సాగిస్తోంది.

ఇక, ఈ మధ్య ఫుల్ ఫామ్‌తో ఉన్న శృతి హాసన్.. పర్సనల్‌ లైఫ్‌లోనూ ప్రియుడితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ తెగ ఎంజాయ్ చేస్తోంది. ఇక, ఇటీవలే కరోనా బారిన పడిన ఈ హీరోయిన్.. తాజాగా తన బాయ్‌ఫ్రెండ్‌తో బెడ్‌పై రచ్చ చేసింది. దీనికి సంబంధించిన ఫొటోలపై మీరూ ఓ లుక్కేయండి మరి!

అలా మొదలు పెట్టిన శృతి హాసన్

అలా మొదలు పెట్టిన శృతి హాసన్

టీనేజ్‌లోనే శృతి హాసన్ సింగర్‌గా పరిచయమైంది. ఆ తర్వాత సొంతంగా కొన్ని ఆల్బమ్‌లను కూడా క్రియేట్ చేసింది. ఈ క్రమంలోనే 2000లో వచ్చిన 'హే రామ్' అనే చిత్రంలో చిన్న పాత్రలో కనిపించింది. అనంతరం 'లక్' అనే హిందీ సినిమాలోనూ నటించింది. ఇక, తెలుగులో వచ్చిన 'అనగనగా ఓ ధీరుడు'తో శృతి హాసన్ హీరోయిన్‌గానూ ఎంట్రీ ఇచ్చేసింది.

టాలీవుడ్‌లో స్టార్... రీఎంట్రీలోనూ

టాలీవుడ్‌లో స్టార్... రీఎంట్రీలోనూ

టాలీవుడ్‌లోకి అడుగెట్టిన చాలా తక్కువ సమయంలోనే శృతి హాసన్ స్టార్ స్టేటస్‌ను దక్కించుకుంది. ఈ క్రమంలోనే బడా హీరోలు అందరితోనూ ఆడిపాడింది. ఫుల్ ఫామ్‌లో ఉన్నప్పుడే చాలా కాలం గ్యాప్ తీసుకుని 'క్రాక్' మూవీతో రీఎంట్రీ ఇచ్చింది. దీని తర్వాత 'వకీల్ సాబ్'లోనూ మెరిసింది. ఇక, ఇప్పుడు ప్రభాస్‌తో 'సలార్‌', బాలయ్యతో ఓ సినిమాలోనూ నటిస్తోంది.

బ్రేకప్ తర్వాత మరొకరితో డేటింగ్

బ్రేకప్ తర్వాత మరొకరితో డేటింగ్

వరుస సినిమాలతో ఫుల్ ఫామ్‌లో ఉన్నప్పుడే శృతి హాసన్ ఇంగ్లండ్ గాయ‌కుడు మైకేల్ కోర్స‌లేతో లవ్ ట్రాక్ నడిపింది. అంతేకాదు.. అతడితో పెళ్లి అని ప్రచారం జరుగుతున్నప్పుడే బ్రేకప్ చెప్పేసింది. అప్పట్లో ఇది పెద్ద సంచలనం అయింది. ఇక, మైకేల్‌తో బ్రేకప్ తర్వాత వెంటనే ఈ బ్యూటీ డూడుల్ ఆర్టిస్టు అయిన శాంతను హజారికా అనే కుర్రాడితో డేటింగ్‌ మొదలుపెట్టింది.

తెలిసిన తర్వాత బహిరంగంగానే

తెలిసిన తర్వాత బహిరంగంగానే

శాంతను హజారికాతో ప్రేమాయణం సాగిస్తోన్న విషయం బయటకు తెలియగానే శృతి హాసన్ మరింతగా రెచ్చిపోతోంది. తరచూ అతడి గురించే పోస్టులు పెట్టడంతో పాటు తన ప్రేమను తరచూ వ్యక్త పరుస్తూనే ఉంటోంది. అదే సమయంలో ఈ బంధం గురించి బయటకు తెలిసిందనే కారణమేమో కానీ, పట్టపగ్గాలు లేకుండానే వీళ్లిద్దరూ పర్సనల్ లైఫ్‌ను కూడా తెగ ఎంజాయ్ చేస్తున్నారు.

పెళ్లి కాకుండానే ఒకేచోట ఉంటూ

పెళ్లి కాకుండానే ఒకేచోట ఉంటూ

సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత శృతి హాసన్ కెరీర్ మీద ఎక్కువగా దృష్టి సారించింది. ఈ క్రమంలోనే అన్ని భాషల్లోనూ వరుసగా సినిమాలు చేస్తూ వెళ్తోంది. ఇలాంటి సమయంలో ఈ హాట్ బ్యూటీ శాంతను హజారికాతో ఓ రేంజ్‌లో ఎంజాయ్ చేస్తోంది. ఇందులో భాగంగానే వీళ్లిద్దరూ పెళ్లి చేసుకోకుండానే ముంబైలో ఒకే ఇంట్లో కలిసి ఉంటున్నారు. దీంతో బాగా హైలైట్ అవుతున్నారు.

కరోనా బారిన పడిన శృతి హాసన్‌

కరోనా బారిన పడిన శృతి హాసన్‌

గ్లామరస్ హీరోయిన్ శృతి హాసన్ ఇటీవలే కరోనా బారిన పడింది. ఈ మేరకు తన సోషల్ మీడియా ఖాతాల్లో 'ఇది ఫన్నీ అప్‌డేట్ కాదు. ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ నేను కరోనా పాజిటివ్‌గా తేలాను. ప్రస్తుతం నేను చికిత్స తీసుకుంటున్నాను. త్వరగా కోలుకోవడానికి ప్రయత్నిస్తున్నాను' అంటూ వెల్లడించింది. దీంతో ఆమె త్వరగా కోలుకోవాలని అందరూ కోరుకుంటున్నారు.

ప్రియుడితో బెడ్‌పై రచ్చ చేసింది

ప్రియుడితో బెడ్‌పై రచ్చ చేసింది

కరోనా రావడంతో క్వారంటైన్‌లో ఉన్న శృతి హాసన్.. ఇప్పుడు కూడా ప్రియుడితో రచ్చ చేస్తోంది. తాజాగా ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ వీడియోను షేర్ చేసింది. ఇందులో ఒకే బెడ్‌పై తన బాయ్‌ఫ్రెండ్ శాంతను హజారికాతో కలిసి ఉంది. కరోనా ఉన్నా వీళ్లిద్దరూ కలిసే ఉంటున్నట్లు దీనిబట్టి అర్థం అవుతోంది. ఇక, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X