ఉల్లిపొర లాంటి డ్రెస్‌లో శృతి హాసన్: లోపలివి కనిపించేలా ఘోరంగా!
సినీ రంగంలోకి చాలా మంది వారసులు ఎంట్రీ ఇస్తున్నారు. కానీ, అందులో తమ టాలెంట్లను నిరూపించుకుని స్టార్లుగా ఎదిగిన వాళ్లు మాత్రం చాలా తక్కువే అని చెప్పాలి. అలాంటి వారిలో విశ్వ నాయకుడు కమల్ హాసన్ కూతురు శృతి హాసన్ ఒకరు. చిన్న వయసులోనే తనదైన టాలెంట్లతో ఫేమస్ అయిన ఈ చిన్నది.. హీరోయిన్‌గా వచ్చిన తర్వాత సత్తా చాటింది. దీంతో తక్కువ సమయంలోనే స్టార్ అయిపోయింది. అప్పటి నుంచి హవాను చూపిస్తోంది. ఇక, శృతి హాసన్ సోషల్ మీడియాలోనూ సందడి చేస్తోంది. తాజాగా ఈమె కొన్ని ఫొటోలను వదిలింది. అవి మీకోసం!

అలా వచ్చింది.. యమ ఫేమస్
శృతి హాసన్ చాలా చిన్న వయసులోనే సింగర్‌గా ఎంట్రీ ఇచ్చి సత్తా చాటింది. ఆ తర్వాత స్వయంగా ఎన్నో ఆల్బమ్‌లను క్రియేట్ చేసింది. ఈ క్రమంలోనే 'హే రామ్' అనే చిత్రంలో చిన్న పాత్రతో తెరకు పరిచయమైంది. అనంతరం 'లక్' అనే హిందీ మూవీలోనూ కనిపించింది. ఇక, తెలుగులో వచ్చిన 'అనగనగా ఓ ధీరుడు'తో శృతి హీరోయిన్‌గానూ ఎంటరై ఫేమస్ అయింది.

తెలుగులోకి ఎంట్రీ... స్టార్‌డమ్
హీరోయిన్‌గా తెలుగులోకి వచ్చిన కొంత కాలానికే శృతి హాసన్ స్టార్‌గా ఎదిగిపోయింది. ఈ క్రమంలోనే అందరు స్టార్ హీరోలతోనూ నటించింది. అలా సూపర్ ఫామ్‌లో ఉన్న సమయంలోనే ఈ సుందరాంగి చాలా గ్యాప్ తీసుకుంది. ఆ తర్వాత 'క్రాక్' మూవీతో మరోసారి టాలీవుడ్‌లోకి వచ్చింది. దీని తర్వాత 'వకీల్ సాబ్' మూవీలోనూ ఈమె అదిరిపోయే నటనతో ఆకట్టుకుంది.

సీనియర్ హీరోలకు ఛాయిస్‌గా
చాలా గ్యాప్ తర్వాత టాలీవుడ్‌లోకి వచ్చిన శృతి హాసన్.. వరుస సినిమాలతో సందడి చేస్తోంది. ఇప్పటికే ఈ అమ్మడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో 'సలార్' అనే సినిమాను చేస్తోంది. అలాగే బాలయ్య - గోపీచంద్ కాంబినేషన్‌లో వస్తోన్న 'వీరసింహారెడ్డి'లో నటిస్తోంది. ఇది మాత్రమే కాదు.. బాబీ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తోన్న 'వాల్తేరు వీరయ్య'లోనూ హీరోయిన్‌గా చేస్తోంది.

అతడితో తెగ ఎంజాయ్ చేస్తూ
గతంలో శృతి హాసన్ విదేశీ గాయకుడు మైకేల్ కోర్సలేతో డేటింగ్ చేసింది. అంతేకాదు, అతడితో పెళ్లి అని ప్రచారం జరిగినప్పుడే విడిపోయినట్లు ప్రకటించింది. ఆ తర్వాత ఈ బ్యూటీ డూడుల్ ఆర్టిస్టు అయిన శాంతను హజారికాతో ప్రేమాయణం సాగిస్తోంది. అతడితో కలిసి ఒకేచోట ఉంటూ ఈ అమ్మడు తెగ ఎంజాయ్ చేస్తూనే ఉంటోంది. అలా ఈ బ్యూటీ నిత్యం వార్తల్లోనే నిలుస్తోంది.

సోషల్ మీడియాలో హడావిడి
సుదీర్ఘ కాలంగా సినిమాల మీద సినిమాలు చేస్తూ కెరీర్ పరంగా ఫుల్ బిజీగా గడుపుతున్నప్పటికీ శృతి హాసన్ సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో నిత్యం టచ్‌లోనే ఉంటోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది. తద్వారా ఫాలోయింగ్‌ను పెంచుకుంటోంది.

గ్లామర్ ట్రీట్‌తో రెచ్చిపోతోంది
సోషల్ మీడియాలో ఎన్నో ఏళ్లుగా హడావిడి చేస్తోన్న శృతి హాసన్.. అప్పుడప్పుడు అందాల విందు కూడా చేస్తోంది. ఇందులో భాగంగానే తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తుంటుంది. అలాగే, బాయ్‌ఫ్రెండ్‌తో చనువుగా ఉన్న వాటిని కూడా వదులుతోంది. ఇలా శృతి తన గ్లామర్ ట్రీట్‌తో పాటు రొమాంటిక్ పిక్‌లు షేర్ చేస్తూ బాగా హైలైట్ అవుతూనే ఉంటోంది.



Click it and Unblock the Notifications











