మళ్లీ ప్రేమలో పడ్డ శృతి హాసన్: అతడితో అయిపోయిందంటూ.. పుసుక్కున నోరు జారి బుక్కైంది

దక్షిణాది నుంచి సినీ నటుడిగా పరిచయమై.. దేశ వ్యాప్తంగా ఫాలోయింగ్‌ను దక్కించుకున్న నటుడు కమల్ హాసన్. అతడి వారసురాలిగా సినిమాల్లోకి ప్రవేశించింది గ్లామరస్ బ్యూటీ శృతి హాసన్. ఆరంభంలోనే ఆకట్టుకునే అందంతో పాటు అద్భుతమైన హావభావాలను పలికిస్తూ నటిగా మంచి పేరును తెచ్చుకుంది. అంతేకాదు, దక్షిణాదిలోని దాదాపు అన్ని భాషల్లో నటిస్తూ స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది. కెరీర్ పరంగా సక్సెస్ అయిన ఈ అమ్మడు.. ప్రేమలో మాత్రం విఫలమైంది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా శృతి హాసన్ మరోసారి ప్రేమలో పడింది. ఆ వివరాలు మీకోసం!

ఘనంగా బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ నటాషా దలాల్ వివాహం (ఫొటోలు)

రెండింటిలోనూ సూపర్ సక్సెస్ అయింది

రెండింటిలోనూ సూపర్ సక్సెస్ అయింది

నటిగా సినీ రంగంలోకి ప్రవేశించిన శృతి హాసన్.. ఎన్నో చిత్రాల్లో అద్భుతమైన నటనను కనబరిచింది. తండ్రి చాటు బిడ్డగా కాకుండా సొంత టాలెంట్‌లో ఎన్నో అవకాశాలను అందిపుచ్చుకుంది. కెరీర్ ఆరంభంలో చేతి నిండా సినిమాలతో ఈ చిన్నది బిజీ బిజీగా గడిపింది. అదే సమయంలో సింగర్‌గానూ మారి ఎన్నో పాటలను పాడింది. ఇలా రెండు విభాగాల్లోనూ సూపర్ సక్సెస్ అయింది.

తెలుగులోకి అందరితో... పవన్‌తో లాస్ట్

తెలుగులోకి అందరితో... పవన్‌తో లాస్ట్

శృతి హాసన్ తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించింది. పవన్ కల్యాణ్, మహేశ్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ సహా ఎందరో హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. వీటిలో చాలా వరకు హిట్లే ఉన్నాయి. అయితే, 2017లో వచ్చిన 'కాటమరాయుడు' తర్వాత సినిమాలకు కాస్త బ్రేక్‌ ఇచ్చింది. అప్పటి నుంచి చాలా కాలం పాటు ఆమె అన్ని భాషలకూ దూరంగా ఉంది.

విదేశీయుడితో ప్రేమాయణం... తండ్రితో

విదేశీయుడితో ప్రేమాయణం... తండ్రితో

శృతి హాసన్ కొన్నేళ్ల క్రితం ఇంగ్లండ్ గాయ‌కుడు మైకేల్ కోర్స‌లేతో ప్రేమ‌లో ప‌డిన విషయం తెలిసిందే. అంతేకాదు.. అతడు క‌మ‌ల్‌ హాసన్‌తో క‌లిసి ఒక వేడుక‌లో కూడా పాల్గొన్నాడు. దీంతో తన కూతురి పెళ్లికి విశ్వనాయకుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అన్నారు. ఆ సమయంలోనే శృతి - మైకేల్ పెళ్లి జరగబోతుందని అంతా అనుకున్నారు. కానీ, అనూహ్యంగా వీళ్లిద్దరూ విడిపోయారు.

ప్రియుడితో బ్రేకప్.. సినిమాల్లోకి ఎంట్రీ

ప్రియుడితో బ్రేకప్.. సినిమాల్లోకి ఎంట్రీ

ప్రియుడితో బ్రేకప్ చెప్పిన తర్వాత శృతి హాసన్ సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపించింది. ఇందులో భాగంగానే ఆమె విజయ్ సేతుపతితో 'లాభం' అనే సినిమాలో నటిస్తోంది. అలాగే, తెలుగులో రవితేజ నటించిన 'క్రాక్'తో ఘనమైన రీఎంట్రీ ఇచ్చింది. దీనితో పాటు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కమ్‌బ్యాక్ మూవీ 'వకీల్ సాబ్'లో నటిస్తోంది. వీటితో పాటు మరికొన్ని ప్రాజెక్టులకు సైన్ చేసింది.

ప్రేమలో పడిన శృతి.. నోరు జారిందిగా

ప్రేమలో పడిన శృతి.. నోరు జారిందిగా

సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది శృతి హాసన్. ఇందులో భాగంగానే తాజాగా తన ఫాలోవర్లతో లైవ్ చాట్ నిర్వహించింది. ఇందులో చాలా మంది పలు రకాల ప్రశ్నలు అడగగా.. వాటికి ఆమె సమాధానం చెప్పింది. ఈ క్రమంలోనే ఓ నెటిజన్ 'మీరు మళ్లీ ప్రేమలో ఉన్నారా' అని ప్రశ్నించాడు. దీనికి 'అవుననుకుంటా' అంటూ నోరు జారి బుక్కైపోయిందీ హాట్ బ్యూటీ.

మాజీ ప్రియుడితో అయిపోయిందంటూ

మాజీ ప్రియుడితో అయిపోయిందంటూ

ఇదే లైవ్ చాట్‌లో ఒక వ్యక్తి 'మీ మాజీ బాయ్‌ఫ్రెండ్‌ను మీరు ద్వేషిస్తున్నారా' అని ప్రశ్నించాడు. దీనికి శృతి సమాధానమిస్తూ 'నువ్వు చాలా చెడ్డ వాడిలా ఉన్నావ్. నేను నా జీవితంలో ఎవ‌రినీ ద్వేషించ‌ను. అలా జ‌ర‌గ‌దు. కానీ ఆ విష‌యంలో కొంచెం బాధ ఉంది. అయినా అతడితో బ్రేకప్ అయిపోయింది' అంటూ చెప్పుకొచ్చింది. అలాగే, ఇప్పట్లో పెళ్లి చేసుకోనని కూడా క్లారిటీ ఇచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X