పబ్లిక్‌గా శృతిహాసన్‌కు వేధింపులు.. అలా బుద్ధిచెప్పిన స్టార్ హీరోయిన్
సోషల్ మీడియాలో నటీనటులపై ఓ రేంజ్‌లో ట్రోలింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. కొందరు వ్యక్తిగతం సెలబ్రిటీలపై మాటల దాడికి దిగుతున్నారు. మరికొందరైతే తమ హీరోలకు ప్రత్యర్ధులుగా ఉన్న వారిపై విరుచుకుపడుతున్నారు. అయితే హీరోల కంటే హీరోయిన్లే ఎక్కువగా ట్రోలింగ్ బారినపడుతున్నారు. ఇది ఆన్‌లైన్‌ను దాటి బహిరంగంగానే కామెంట్స్ చేసే స్థాయికి చేరుకుంది. తాజాగా స్టార్ హీరోయిన్ శృతి హాసన్‌పై కొందరు ఆకతాయిలు పబ్లిక్‌గా దారుణమైన కామెంట్స్ చేశారు. దీనికి ఆమె కూడా స్ట్రాంగ్‌గా కౌంటర్ ఇచ్చింది. ఈ వివరాల్లోకి వెళితే..
తండ్రి అడుగుజాడల్లో సినీరంగంలోకి అడుగుపెట్టిన శృతి హాసన్.. స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతున్నారు. నటిగానే కాకుండా, సింగర్‌గా, సంగీత దర్శకురాలిగా తన టాలెంట్ నిరూపించుకున్నారు. ఆచితూచి సినిమాలు చేస్తూ తన మార్క్ చూపిస్తున్నారు. అయితే కెరీర్ తొలినాళ్ల నుంచి నేటి వరకు శృతిహాసన్ పలుమార్లు ట్రోలింగ్ బారినపడ్డారు. ప్రారంభంలో వరుస ఫ్లాపులు ఎదురవ్వడంతో ఆమెను ఐరన్ లెగ్ అంటూ అవమానించారు. వాటి నుంచి కోలుకుని స్టార్ హీరోయిన్ అనిపించుకున్నారు.

హీరోయిన్‌గా నిలదొక్కుకున్నాక ఆమె అందంపై ట్రోలింగ్‌కు దిగారు. గ్లామర్ కోసం శృతి హాసన్ పలు సర్జరీలు చేయించుకున్నారని ట్రోల్ చేశారు. వీటిని సమర్ధవంతంగా ఎదుర్కొన్న ఆమె అప్పట్లోనే ఇచ్చిపడేసింది. రైనో అనే సర్జరీ గురించి.. లిప్ ఫిల్లర్స్ గురించి క్లారిటీ ఇచ్చింది. ఇది నా శరీరం, నా ఇష్టం, నాకు నచ్చిన నిర్ణయం నేను తీసుకుంటానని పేర్కొంది. నా ముక్కుకు గాయం కావడం వల్లే రైనో అనే ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నానని విమర్శలకు నోరు మూయంచింది.
తొలి నుంచి ఫైర్ బ్రాండ్ మెంటాలిటీ ఆమెను వినూత్నంగా నిలబెట్టింది. మనసులో ఏమున్నాసరే దానిని ధైర్యంగా కుండబద్ధలు కొట్టినట్లు మాట్లాడటం శృతిహాసన్ శైలి. ఈ విషయంలో ఎన్నోసార్లు విమర్శలు వచ్చినప్పటికీ తగ్గేదే లేదంటూ బదులిచ్చేవారు. తాజాగా తనను పబ్లిక్‌లో దారుణమైన మాటలతో విమర్శించిన వారికి శృతి ఇచ్చిపడేశారు.
ఓ కార్యక్రమంలో పాల్గొని తిరిగి తన కారు దగ్గరికి వెళ్తున్న శృతిహాసన్‌ను రోడ్డుపై ఉన్న కొందరు ఆకతాయిలు ఇబ్బందిపెట్టారు. మమ్మ అనే పదజాలంతో అవమానించేలా మాట్లాడారు. ఆ మాట తన చెవిన పడిన వెంటనే శృతి ఏమాత్రం ఆలస్యం చేయకుండా పోకిరిల పనిపట్టారు. కౌన్ హై మమ్మ.. హమ్ నే మమ్మ హై.. ఏం మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వెంటనే నీ బండి ఎక్కడుంది అని పక్కనే ఉన్న వారిని అడిగి వెళ్లిపోయారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. శృతిహాసన్ ధైర్యాన్ని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. అయితే ఈ ఘటన ఎప్పుడు? ఎక్కడ? జరిగింది? అన్నది మాత్రం తెలియరాలేదు.
ఇక శృతి హాసన్ సినిమాల విషయానికి వస్తే.. తమిళంలో ట్రైన్, తెలుగులో సైలెంట్ స్క్రీమ్స్, ఆకాశంలో ఒక తార, సలార్ పార్ట్ 2 చిత్రాలలో నటిస్తున్నారు. అయితే శృతి త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారనే.. ఈ మేరకు కమల్ హాసన్ సంబంధాలు వెతికే పనిలో బిజీగా ఉందంటూ సోషల్ మీడియాలో గాసిప్స్ వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications



