అతడి నిజస్వరూపం బయటపడింది.. శంతనుతో బ్రేకప్ తర్వాత శృతిహాసన్ పోస్టు వైరల్
దక్షిణాదిలో స్టార్ హీరోయిన్ శృతిహాసన్ బ్రేకప్ వ్యవహారం మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. గత కొన్నేండ్లుగా ఈశాన్య రాష్ట్రాలకు చెందిన ఆర్టిస్ట్, ఇల్లస్ట్రేటర్ శంతను హాజరికాతో సహజీవనం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే వారిద్దరి అన్యోన్యత, సన్నిహిత సంబంధాలు చూస్తే..శృతి జీవితం అతడితోనే ముడిపడి ఉందని బలంగా నమ్మకం కలిగించాయి. అయితే ఇలాంటి నమ్మకాన్ని బ్రేక్ చేస్తూ వారిద్దరి విడిపోయారనే వార్త మీడియా హెడ్‌లైన్లను ఆకర్షించింది. ఈ బ్రేకప్ వార్త తర్వాత శృతి హాసన్ తొలి పోస్టు మరింత వైరల్ అయింది. ఆ వార్త వివరాల్లోకి వెళితే..
శంతను హాజరికాతో డేటింగ్, అఫైర్, రిలేషన్‌షిప్ కొనసాగిన సమయంలో వారిద్దరూ ముంబై వీధుల్లో చిలక గోరింకల్లా కనిపించారు. చెట్టు, పుట్టా అనే తేడా లేకుండా లాక్‌డౌన్‌లో వారిద్దరు రొమాన్స్‌కు కొత్త అర్ధం చెప్పారు. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ చూస్తే ఒకరు మరొకరి కోసమే పుట్టామనే ఫీలింగ్ కల్పించారు.

ఇక ఇటీవల శృతి, శంతను ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో విడిపోయేందుకు సిద్దపడ్డారు. వారిద్దరూ సోషల్ మీడియా అకౌంట్లను ఒకరికొకరు అన్ ఫాలో అయ్యారు. దాంతో వారిద్దరి బ్రేకప్ వ్యవహారం మీడియాలో విస్తృతంగా ప్రచారమైంది. దాంతో వారి బ్రేకప్‌కు కారణమేమిటనే ఊహగానాలు జోరందుకొన్నాయి.
అయితే శృతి హాసన్, దర్శకుడు లోకేష్ కనకరాజ్ ఇద్దరు ఇటీవల ఇనిమెల్ అనే షార్ట్ వీడియోలో నటించారు. ప్రేమ కథగా రూపొందిన ఆ కథకు కమల్ హాసన్ కూడా భాగం పంచుకొన్నారు. ఆ షార్ట్ ఫిలింలో శృతి, లోకేష్ కనకరాజ్ మధ్య రొమాన్స్ పీక్స్ లెవెల్‌లో కనిపించింది. వారిద్దరి షార్ట్ ఫిలిం కారణంగానే శంతను, ఆమెకు బ్రేకప్ జరిగిందనేది రూమర్.

ఇదిలా ఉండగా, బ్రేకప్ తర్వాత శృతిహాసన్ సోషల్ మీడియాలో ఘాటైన మెసేజ్‌తో స్పందించారు. ఆయనతో బంధం క్రేజీ రైడ్. ఆ బంధం కారణంగానే నా గురించి, నాతో ఉన్న వారి గురించి చాలా విషయాలు నేర్చుకొన్నాను అని షాకింగ్‌గా పోస్టు పెట్టింది. అయితే నర్మగర్బంగా పెట్టిన ఈ పోస్టు వెనుక ఎవరికి తోచింది వారు ఊహించేసుకొంటున్నారు.
అయితే లోకేష్ కనకరాజ్‌తో బంధం కారణంగానే రియలైజ్ అయిందా? అతడి సహచర్యంలోనే అన్నీ తెలుసుకొన్నాదా? నా చుట్టు ఉన్న ప్రజల గురించి ఏం తెలుసుకొన్నది? శంతనుతో విడిపోవడం వెనుక ఆ వ్యక్తే ఉన్నారా? అనే ప్రశ్నలు ప్రస్తుతం మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ప్రశ్నలకే కాకుండా మరొకొన్ని ప్రశ్నలకు త్వరలోనే సమాధానాలు లభిస్తాయి.


Click it and Unblock the Notifications











