గోల్డెన్ హార్ట్ ఉన్న రియల్ సింహం.. బాలయ్యపై శృతిహాసన్ హాట్ కామెంట్..
నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒంగోలులోని అర్జున్ ఇన్‌ఫ్రా మైదానంలో అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకు భారీ ఎత్తున్న అభిమానులు తరలిరావడంతో గ్రౌండ్ అంతా కిక్కిరిసిపోయింది. ఈ వేడుకలో దర్శకుడు బీ గోపాల్, వీరసింహారెడ్డి చిత్ర యూనిట్‌లోని రోజ్ హాని, చంద్రికా రవి, శృతిహాసన్ హాజరయ్యారు. ఈ వేడుకలో శృతిహాసన్ మాట్లాడుతూ..

మైత్రీ మూవీస్‌తో మూడోసారి..
హాలో ఒంగోలు.. అందరికి నమస్కారం. అడ్వాన్స్ సంక్రాంతి విషెస్. మళ్లీ ఒంగోలుకు రావడం చాలా హ్యాపీగా ఉంది. చాలా సంతోషంగా ఉంది. మంచి ఎనర్జీ వచ్చింది. మైత్రీ మూవీస్‌తో వర్క్ చేయడం మూడోసారి. వారితో పనిచేసినందుకు పెద్ద పెద్ద థ్యాంక్స్. చిత్ర యూనిట్ అందరికి నా శుభాకాంక్షలు. ఫైట్ మాస్టర్ రామ్‌లక్ష్మణ్, తమన్ మ్యూజిక్‌తో పాటలు అద్భుతంగా ఇచ్చారు అని శృతిహాసన్ అన్నారు.

నాకు అన్నయ్య లాంటి వాడు..
ఇక దర్శకుడు మలినేని గోపిచంద్ గురించి మాట్లాడుతూ.. ఆయనతో నా మూడో చిత్రం. నన్ను మూడు చిత్రాల్లో భాగస్వామ్యం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో నాకు అన్నయ్య ఉన్నారు. అదే మలినేని గోపిచంద్. మీతో కలిసి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాను అని శృతి హాసన్ అన్నారు.

గాడ్ ఆఫ్ మాసెస్ మీరు..
అలాగే బాలకృష్ణతో మాట్లాడుతూ.. అందరికి ఫేవరేట్. నాకు కూడా ఫేవరేట్. బాలయ్య గారు.. థ్యాంక్యూ సో మచ్. ఈ సినిమాకు ముందు మీరు గాడ్ ఆఫ్ మాసెస్ అని విన్నాను. కూలెస్ట్ పర్సన్. నేను పబ్ వద్దకు వెళ్లి నిలచుంటే.. జై బాలయ్య అనే అరుపులే వినిపిస్తుంటాయి. నిజంగా బాలయ్య గారు.. మీతో కలిసి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాను. మీరు సో పాజిటివ్. మీ ఎనర్జీ సూపర్. గోల్డెన్ హార్ట్ ఉన్న రియల్ సింహం మీరే.. అంటూ జై బాలయ్య అంటూ స్పీచ్ ముగించారు.

సుగుణ సుందరి అంటూ స్టెప్పులు
శృతి హాసన్ స్పీచ్ ముగిసిన తర్వాత సుమకు ఇచ్చిన మాటను నిలబెట్టుకొన్నది. తన ప్రసంగం ముగిసిన తర్వాత డ్యాన్స్ చేస్తానని, స్టెప్పులేస్తానని చెప్పింది. దాంతో యాంకర్ సుమతో సుగుణ సుందరి పాటకు హుషారుగా స్టెప్పులేసింది. దాంతో బాలయ్యతోపాటు అభిమానులందరూ ఈలలు వేసి గోల చేశారు.


Click it and Unblock the Notifications











